Others

అటు నాని.. ఇటు రజని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ ఏడాది కీర్తి లక్కీ చాన్స్ కొట్టినట్టే. తెలుగులో విలక్షణ హీరో నానితో, అటు తమిళంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ సరసన అవకాశాలు అందిపుచ్చుకుంటోంది. ‘మనం’ ఫేమ్ విక్రమ్‌కుమార్ దర్శకత్వంలో నాని 24వ చిత్రం చేస్తుండటం తెలిసిందే. ప్రాజెక్ట్ ప్రకటించినప్పటి నుంచి నాని సరసన నటించబోయే హీరోయిన్ ఎవరా? అని నెటిజన్లు ఆసక్తిగా చూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం సినిమాలో నానికి జోడీగా కీర్తిసురేష్‌ను అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ కీర్తి సురేష్ డేట్లు అడ్జెస్ట్ కాకపోతే.. కొత్త అమ్మాయిని హీరోయిన్‌గా తీసుకోవాలనే ఉద్దేశ్యంతో దర్శక నిర్మాతలున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రం రెగ్యులర్ షూట్ ఫిబ్రవరి మూడోవారం నుంచి మొదలుకానుంది. పూర్తి థ్రిల్లర్ నేపథ్యంలో ఉండబోతుందని, అలాగే మహిళలకు సంబంధించిన మంచి సోషల్ మెసేజ్ కూడా ఉంటుందట. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్టు నిర్మిస్తోంది. చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలను చిత్ర బృందం అధికారికంగా ప్రకటించనుంది. సంక్రాంతి విడుదలైన ‘పేట’ తర్వాత సూపర్‌స్టార్ రజనీకాంత్ త్వరలోనే మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు.
ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్ సినిమా చేయబోతున్నాడని కోలీవుడ్ వార్త. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా సినిమాలో రజనీకాంత్ సరసన కీర్తిసురేష్‌ను హీరోయిన్‌గా తీసుకుంటున్నారట. ఎ.ఆర్.మురుగదాస్ గత చిత్రం ‘సర్కార్’లోనూ కీర్తిసురేష్ హీరోయిన్‌గా నటించింది. ఆమెనే తలైవా సరసన నటింపచేయడానికి మురుగదాస్ ఆసక్తి చూపుతున్నాడని టాక్. ప్రస్తుతం కీర్తిసురేష్ తెలుగులో ఓ సినిమా చేస్తుంది.