Others

గులేబకావళి కథ (నాకు నచ్చిన సినిమా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫక్తు జానపదమే అయనా అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరించిన చిత్రం ‘గులేబకావళి’. మహారాజుగా ముక్కామల (కృష్ణమూర్తి), అలనాటి చిత్రాల్లో దుష్టపాత్రలకు అతుక్కున్నట్లు సరిపోయే రాజనాల, ఆయన సరసన సహాయక విలన్‌గా కెవియస్ శర్మ నటించాడు. ఇక పేకేటి శివరాం, లంక సత్యం, పద్మనాభం ఎందుకూ పనికిరాని కొయ్యల పాత్రలను రక్తికట్టించారు. ‘అయ్యలూ’ అని రాజనాల పిలవగానే మామయ్యలూ అంటూ సమాధానం చెప్పే దద్దమ్మలువారు. ఈ చిత్రంలోని పాటలన్నీ హైలైట్ అయనా -నన్ను జూచుకొందువటే వనె్నల దొరసానీ, సలాం అలేకం సాహెబుగారు... పాటలు మాత్రం ప్రత్యేకం.
కథ విషయానికి వస్తే -మహారాజు భార్య గర్భవతిగా ఉండగా ఆమెకు కుమారుడు పుడితే రాజు తన్నుసరిగా చూసుకోడనే ఈర్ష్యాభావంతో రెండో భార్య.. తమ్ముడు వక్రకేతుతో కలిసి పన్నాగం పన్ని చెలికత్తెను ప్రలోభపెట్టి పాలలో ఒక విష పదార్థం కలిపి ఇస్తుంది. అమాయకుడైన రాజు ఆ పానీయం సేవించి కంటి చూపు పోగొట్టుకుంటాడు. కాకతాళీయంగా అక్కడ తారసిల్లిన వ్యక్తిని (యువరాజు యన్‌టిఆర్) చూడడం వల్లే కళ్లు పోయాయని రాజును నమ్మించడానికి శత విధాల ప్రయత్నం చేస్తారు. ‘ఆ కుర్రాడి వలన నాకు కళ్లు పోయినా పరవాలేదు. అతడు నా కొడుకైతే ఎంతో బావుణ్ణు’ అని ప్రయత్నంగా పైకి అనేస్తాడు మహారాజు. గులేబకావళి పుష్పం తెచ్చి, ఆయన కనులకు తాకిస్తే చూపువస్తుందని, కాని అది ఎలా ఉంటుందో, ఎక్కడ లభిస్తుందో తమకూ తెలియదని ఈ విషయం తాము శాస్త్రాల్లో మాత్రమే చదివామంటారు రాజవైద్యులు.
ఆ పుష్పం కోసం యువరాజు, ముగ్గురు దద్దమ్మ కొడుకులూ బయలుదేరుతారు. అయతే దారిలో యుక్తిమతి రహస్యాన్ని కథానాయకుడు ముందుజాగ్రత్తగా కనిపెట్టి జాగ్రత్తపడితే, అన్నదమ్ముల త్రయం మాత్రం ఆమెకు లొంగిపోతారు. హీరో యుక్తి ఉపాయంతో యుక్తిమతి పాచిక పారకుండా పోతుంది. ‘అయ్యో నా ప్రతిజ్ఞ ప్రకారం ఈ ముసలి సాయిబును చేసుకోవాల్సి వచ్చింది కదా’ అని బాధపడుతుంది. అప్పుడు ఆ గడ్డాన్ని తీసేసి తన అసలు రూపాన్ని చూపించడంతో యుక్తిమతి ఊరట చెంది సంతోషంగా వివాహమాడుతుంది.
చివరకు ఎన్నో కష్టనష్టాలకోర్చి కథానాయకుడు గులేబకావళి పుష్పాన్ని సాధించటం, తండ్రికి చూపు తెప్పించటంతో కథ సుఖాంతమవుతుంది. ఈ విధంగా చిత్రంలో హాస్య, వీర, శృంగార రసాల మిళితమై ప్రేక్షకుని మెప్పిస్తాయి. శత దినోత్సవం అవలోకగా జరుపుకొన్న జానపద చిత్రరాజం ‘గులేబకావళికథ’.

-కాకుటూరి సుబ్రహ్మణ్యం