Others

నా తపన ఆగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వైవిధ్యమైన పాత్రలను పోషిస్తూ నటుడిగా తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్న నరేష్ విజయ్ కృష్ణ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ముచ్చటించారు.
‘ఒక నటుడి కెరీర్‌లో సక్సెస్.. ఫెయిల్యూర్స్ కామన్. నాటి ఎన్టీఆర్ నుండి నేటి హీరోలు ఎవరికైనా గెలుపు ఓటములు ఎదురవుతుంటాయి. ఐదారేళ్ల క్రితం మంచి హిట్ రాదా? అని అనుకున్న రోజులు కూడా ఉన్నాయి. అయితే నాలుగైదేళ్లుగా దృశ్యం సినిమా నుండి వరుసగా మంచి సినిమాలు వస్తున్నాయి. మంచి సినిమాలు, పాత్రలకు ప్రాధాన్యం ఇచ్చి సినిమాలు చేసుకుంటూ వస్తున్నాను. సక్సెస్ రేట్ పెరుగుతూ వస్తుంది. ‘ఓ తెలుగు నటుడు ఏ పాత్ర చేయగల కెపాసిటీ ఉంది. కాబట్టి ఓ జోనర్‌కే పరిమితం కాకుండా అన్నీ సినిమాలు చేయాలనుకున్నాను. నాకు వచ్చిన పాత్రలన్నీ అలా డిఫరెంట్‌గానే వచ్చాయి. నాపై దర్శకులు, నిర్మాతలు పెట్టుకున్న నమ్మకం.. 2018 నటుడిగా నా కెరీర్‌లో బెస్ట్ ఇయర్. త్రివిక్రమ్, సుకుమార్ వంటి దర్శకులతోపాటు వెంకీ అట్టూరి, వెంకీ కుడుముల, నాగాశ్విన్..వంటి యువ దర్శకులు కూడా నాకు మంచి ప్రాధాన్యమున్న పాత్రలను ఇచ్చారు. 47 ఏళ్లు నటుడిగా అనుభవం వచ్చింది. క్రమశిక్షణతోపాటు, ఎటువంటి కాంట్రవర్సీకి పోకపోవడం అనేవి నటుడిగా నా సక్సెస్‌కు కారణమని భావిస్తున్నాను. పారితోషికం, ఇతర అంశాలకంటే మంచి సినిమా. మంచి పాత్ర పోషించడం.. వచ్చిన అవకాశానికి పూర్తి న్యాయంచేయడం, చిన్న బడ్జెట్ సినిమాలకు అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
వెబ్ సిరీస్‌ల్లోకూడా నాకు మంచి అవకాశాలు వస్తున్నాయి. ‘కొంచెం సెలక్టివ్‌గా మంచి పాత్రలను ఎంచుకుంటున్నాను. ఈ ఏడాది కూడా మంచి పాత్రలతోనే స్టార్ట్‌అయ్యింది. మల్లీ జంధ్యాల దర్శకత్వంలో కార్తికేయ హీరోగా చేస్తున్న సినిమాలో నటిస్తున్నాను. అలాగే ఫణిరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాను. వీటితోపాటు మరో ఆరు సినిమాలు పైప్‌లైన్‌లో ఉన్నాయి. ఒకప్పుడు మనం ఇతర భాషల రీమేక్‌లకోసం వెళ్లేవాళ్లం. కానీ ఇప్పుడు ఇతర భాషలవాళ్లు మన రీమేక్‌లకోసం వస్తున్నారు. ఇది తెలుగు సినిమాకు పెద్ద వరం. కొత్త ఆలోచనలున్న కొత్తతరం దర్శకులు చాలామంది ఇండస్ట్రీలోకి వస్తున్నారు. 2019కూడా తెలుగు ఇండస్ట్రీకి చాలా బావుంటుంది.