Others

సుందరకాండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటువంటి సమయాలలోనే సుందకాండ పనిచేస్తుంది. అలాగే. లౌకికమైన కార్యాన్ని ప్రారంభించిన వాడు కూడా. ఎంత తంటాలు పడ్డానండీ పనికాలేదు- అంటాడు. అలాకాక పని పూర్తయ్యే వరకు తంటాలు పడాలని తెలుసుకోవాలి. ఎందుకంటే- ఒక్కొక్కప్పుడు పని అయ్యే స్థితిలో మానేస్తాం. మనకు తెలియక. అలాగే- దైవానికి మన కేక వినబడే పరిస్థితి వచ్చేటప్పటికి జపాన్ని మానేస్తాం. ఇదంతా ఎందుకు వస్తుందంటే- నేను జపం చేస్తున్నాను. నేను కార్యం నడుపుతున్నాను- అని అనుకొనటం వలన అలాకాక ఇది నా పని. దాన్ని నేను నిర్వహిస్తున్నాను. అది నెరవేరే వరకు ఇలాగే చేస్తూ ఉంటాను. అని అనుకొంటే యిబ్బంది లేదు. కనుక పురుషకారం అహంకారం మూలకమవుతున్నది. సరే స్వామి ఆలోచిస్తున్నాడు.
క్షిప్ర ముత్పతతో మనే్య సీతామాదాయ రక్షసః
బిభ్యతో రామ బాణానామంతరా పతితా భవేత్.
దొంగిలించుకొని వస్తూన్న రావణునికి మార్గమధ్యంలో జ్ఞాపకం వచ్చి ఆ సీతను సముద్రంలోనికి తోసి వేసేడేమో- కాకపోతే వాడి గమన వేగానికి తట్టుకోలేక ఆవిడే సముద్రంలోకి జారిపోయిందేమో- కాకుంటే ఈ దుష్ట రాక్షస స్ర్తిలు తినేసేరేమో- లేకపోతే రామ విరహాన్ని భరించలేక ఆమెయే ప్రాణ త్యాగం చేసిందేమో కనుక-
వినష్టావా ప్రాణష్టావా మృతావా జనకాత్మజా
రామస్య ప్రియభార్యస్య ననివేదయితుం క్షమమ్.
ఆమె ఎలా మరణించినా ఈ వార్తను రామచంద్రునకు నివేదించుటలో నేను సమర్ధుణ్ణి కాను. అనుకొన్నాడు. ఇదీ అజ్ఞానం. అప్పుడే ఆమె చనిపోయిందని అనుకొన్నాడు. నేను సర్వం చూసేను అని అనుకొన్నాడు. సీతానే్వషణ విషయంలో నా పని పూర్తి అయిందని అనుకొన్నాడు. ఈ దుఃఖ వార్తను రామచంద్రునకు ఎలా చెప్పను. చెప్పకుండా ఎలా ఉండను.
మానే దోష స్స్యా ద్దోష స్యాదని వేదనే.
చెబితే దోషం. చెప్పకపోతే దోషం. సోతను చూడకుండగా సుగ్రీ పట్టణం వెడితే నేనేమి సాధించినట్లు. సరే- వెడతాను.
గత్వాతు యది కాకుత్థ్సం వక్ష్యామి పరమప్రియం
సదృష్టేతి మయా సీతా తతస్త్య క్ష్యతి జీవితమ్
సీత కనబడలేదని చెబుతాను. అంతకుముందే మూడు దిక్కుల వారూ వచ్చి ఈ మాటనే చెబుతారు. నేను కూడా అలాగే చెబితే సీతా మరణవార్తను చెప్పినట్లవుతుంది.
వెంటనే శ్రీరాముడు జీవితాన్ని విడిచి పెడతాడు.
అతనితో సరిపోతుందా! రాముని యందు నిత్యానురక్షుడైన లక్ష్మణుడు మరణిస్తాడు. ఆ తరువాత సోదరుల మరణవార్తను విని భరతుడు మరణిస్తాడు. అది చూసి శత్రుఘు్నడు మరణిస్తాడు. పుత్రమరణాలకు తట్టుకోలేక- కౌసల్య సుమిత్రా కైకేరుూలు మరణిస్తారు. ఇదంతా చూసి-
అనిన మాటను నిలబెట్టుకోలేక పోయేనే అని దుఃఖంలో సత్యసంధుడైన మారాజు సుగ్రీవుడు మరణిస్తాడు. ఆ తరువాత భర్తృ వినియోగంతో మారాణి ‘రుమ’మరణిస్తుంది. తరువాత తార మరణిస్తుంది. మాతాపితృ పితృవ్య వియోగంతో యువరాజు అంగదుడు మరణిస్తాడు. ప్రభు మరణాలను చూసిన మా వానరులు రాళ్ళతో తలలు బ్రద్దలుకొట్టుకొని మరణిస్తారు. ఆ తరువాత వారి భార్యాపుత్రులందరూ విషం త్రాగో ఉరిపోసికొనే బలవన్మరణాన్ని పొందుతారు- ఇలా
నేను వెళ్ళటం వలన అటు ఇక్ష్వాకుల కులం ఇటు వానర కులం సర్వనాశనమయిపోతాయి.
ఒక్క క్షణకాలంలో- స్వామి దృష్టిలో అటు రఘుకులం ఇటు వానర కులం సర్వనాశన మయిపోయేయి. స్వామి ఏకాకి అయి ఉన్నాడు.
విషాదయోగంలో ఉన్నాడు.

ఇంకావుంది...