Others

ప్రతి గృహం నిత్యాగ్నిహోత్రమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హోమం, యజ్ఞాలు ఒకప్పుడు దేవతలు చేసేవారు. ఆ తరువాత రాజ్యం సుభిక్షంగా ఉండటంకోసం రాజులు ప్రజలయొక్క మేలుకోరి, రాజ్యం సదా పచ్చగా పాడిపంటలతో ఉండాలని, కరువుకాటకాలు రాకూడదని చేసేవారు. రానురాను యజ్ఞయాగాదులు, హోమాలు నిర్వహించడం చాలా తక్కువయింది. ఎక్కువగా దేవాలయాల్లో పండుగలు, పుణ్యదినాల్లోనే చేయడం చూస్తున్నాము. హోమాలు, యజ్ఞయాగాదులంటే పెద్దఎత్తున వ్యయంతో కూడుకున్నవి. సాధారణ మానవుడు వీటిని చేయడం కొంచెం కష్టమే అయినప్పటికీ వారికున్నటువంటి కీడు తొలగిపోయి ఆయురారోగ్యాలతో, కీర్తి సంపదలతో విలసిల్లాలని కొంతమంది హోమాలు చేస్తున్నారు. ఇలా హోమాలు నిర్వహించినపుడు బ్రాహ్మణులతోపాటు నల్గురికి చుట్టాలు, బంధువులు, ఆత్మీయులు, అన్నార్థులకు భోజనం కడుపునిండా పెట్టడం ఆచారం. అన్నదానం చేయడం అనేది హోమాలు, యజ్ఞయాగాదులు చేసిన దానిలో సగం పుణ్యకార్యం. అందుకే ‘‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’’అంటాము. ప్రతి మనిషీ కూడా ఆకలితో ఎదురుచూడకుండా ఏ పూటకాపూట (రెండు పూటలు) అన్నం తిన్నట్లయితే (దొరికినట్లయితే) జీవితంలో సగం ఇబ్బందులు తొలగి ఎంతోకొంత సాధించినట్లే. అంతటి ప్రాముఖ్యత, ప్రాధాన్యత, పవిత్రత అన్నప్రసాదానికుంటుంది. హోమాలు, యజ్ఞయాగాదులు జరిపించి అన్నదానాలు చేసినట్లయితే ఆ పరమాత్మునికి నైవేద్యం పెట్టి ఆయన ఆకలి తీర్చినట్లే.
ఇక చెప్పుకుంటూపోయినట్లయితే ప్రతి ఇల్లూ ఇక నిత్య అగ్నిహోత్రమే అవుతుంది. ఎందుకంటె నిత్యం ప్రతీ ఇంట్లో వంట చేయడానికి పొయ్యి వెలిగిస్తూనే ఉంటారు. అన్నదానం చెయ్యడం చాలా గొప్పదే అయితే ఒక స్ర్తి ప్రతిరోజూ వంటచేసి భర్తకు, పిల్లలకు, కుటుంబ సభ్యులకు, చుట్టాలు, బంధువులు, పండుగలు, పర్వదినాల్లో వచ్చే అతిథులకు, అన్నార్థులకు, సాధువులకు భోజనం వండిపెట్టే శక్తి స్ర్తికే ఉంటుంది. యజ్ఞయాగాదులు, హోమాలు చేసినంతటి పుణ్యం, వేదమంత్రోచ్ఛారణ చేసినంత పుణ్యం వస్తుంది. వంట చేసేప్పుడు శుచి, శుభ్రతలు పాటించాల్సి వుంటుంది. మైల అంటకూడదు. ఇంకా కొన్ని కుటుంబాల్లో మడికట్టుకుని మరీ వంటలు చేస్తుంటారు. మనం తినే ప్రతీది దైవప్రసాదమే. దైవప్రసాదంగానే భావించాలి. అలాంటి పవిత్రమయిన వంటను స్ర్తిలు బహిష్ఠు సమయాల్లో చేయరాదు. చేసినప్పటికీ ఎవరికీ అంటే సాధువులు లాంటి వారికి పెట్టరాదు. వీలయితే మగవారు ఆ రోజుల్లో వంట చేస్తే మంచిది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో నూటికి అరవై నుంచి డెబ్భై శాతం మందికి వంటచేయక తప్పటం లేదు. ఇప్పటికీ ఉమ్మడి కుటుంబాల్లో పెద్దవారు బహిష్ఠువచ్చిన స్ర్తిలను వంట చేయనివ్వరు. అలా చెయ్యడం కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. కానీ ఆచారాలు, వ్యవహారాల పేరుతో అలవాటును మార్చుకోలేని పరిస్థితి.
అగ్ని అనేది పంచభూతాల్లో ఒకటి. అతి పవిత్రమయినది. కాబట్టి అంతటి మహత్తుగల అగ్నిని అపవిత్రం చేయడం ధర్మంకాదు. ఆచార వ్యవహారాలు, సంస్కృతీ సాంప్రదాయాలను కొన్ని కట్టుబాట్లు బ్రతికించగలవు. భారతదేశంలో హిందూ మతానికి సంబంధించి స్ర్తికి గొప్ప ప్రాధాన్యత ఉంది. ఇలాంటి విషయాల్లో స్ర్తిని కించపరచటం కాదుగానీ, సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవడంలో భాగమేనని చెప్పుకోవడంలో అతిశయోక్తి ఎంతమాత్రంకాదు. కాబట్టి ప్రతీ ఇల్లు, ఇంట్లోని పొయ్యి ఒక అగ్నిహోత్రమే, అదే విధంగా వంటచేసే ప్రతీ స్ర్తి ఒక వేదమంత్రాలు చదివే ఒక సద్భ్రాహ్మణుడే. అంతటి గొప్పతనం స్ర్తిది.

-శ్రీనివాస్ పర్వతాల