Others

బరిలో బామ్మ..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సర్పంచ్ పదవికి పోటీపడుతున్న 90 ఏళ్ల మహిళ
‘గ్రామం అభివృద్ధి చెందాలంటే మరోసారి మీరే సర్పంచ్‌గా గెలవాలి..’ అంటూ ఆ ఊరి జనమంతా పట్టుబట్టడంతో- తొంభై ఏళ్ల వయసులో ఆమె ఎన్నికల బరిలో నిలబడక తప్పలేదు. ‘తుది రక్తపు బొట్టు వరకూ ప్రజాసేవ కోసం కృషిచేస్తామ’ని గంభీరమైన హామీలిచ్చే బడానేతలకు భిన్నంగా- ఆమె అభివృద్ధిని చూపి పల్లెవాసుల మనసు దోచుకుంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల కోలాహలం ఊపందుకొన్న తరుణంలో- ఎలాం టి ప్రచార ఆర్భాటం లేకుండా ఆమె వోటర్లను కలుసుకొంటున్నారు.
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని తుమ్మలపల్లి సర్పంచ్ పదవికి తొంభై ఏళ్ల ఈద రత్తమ్మ పోటీ చేస్తుండడం తెలంగాణలో సంచలనం కలిగించింది. ఆమె భర్త చెన్నయ్య స్వాతంత్య్ర సమరయోధుడిగా, పటేల్‌గా గ్రామ ప్రజలకు సేవలందించారు. సర్పంచ్ పదవిని రెండుసార్లు నిర్వహించి ఆయన తుమ్మలపల్లి గ్రామ ప్రగతికి కృషి చేశారు. మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు వంటి ప్రముఖులతో కలసి చెన్నయ్య పనిచేశారు. దీంతో రత్తమ్మ గ్రామ ప్రజలందరికీ సుపరిచితురాలే. గతంలో సర్పంచ్‌గా రెండు సార్లు, జెడ్పీటీసీ సభ్యురాలిగా ఒకసారి ఆమె విశేష సేవలందించి జనం మెప్పు పొందారు. ఒకసారి సర్పంచ్ పదవికి పోటీ చేసి ఓటమి చెందినప్పటికీ నిరాశ చెందక, పెనుబల్లి మండలం ఆవిర్భావంతో మొట్టమొదటి జడ్పీటీసీ సభ్యురాలిగా గెలుపొంది రత్తమ్మ ప్రజాసేవకు అంకితమయ్యారు.
మరోసారి సర్పంచ్‌గా బాధ్యతలు చేపడితే అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, గతంలో కంటే ఎక్కువగా అభివృద్ధి పనులను చేసి చూపిస్తానని ఆమె భరోసా ఇస్తున్నారు. గ్రామస్తుల నుంచి కూడా ఒత్తిడి రావడంతో రత్తమ్మ ఎన్నికల సమరంలో నిలిచారు. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మద్దతుతో బరిలో నిలిచిన ఆమె అధికార తెరాస మద్దతుతో పోటీచేస్తున్న జొనబోయిన రమణను పంచాయతీ పోరులో ఢీకొంటున్నారు.
1940 ప్రాంతంలో జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న రత్తమ్మ భర్త ఈద చెన్న య్య అంటే ఇప్పటికీ తుమ్మలపల్లి వాసులు ఎనలేని గౌరవ మర్యాదులు చూపుతారు. నిస్వార్థ నేతగా, సమరయోధుడిగా తన భర్తకున్న మంచిపేరుతో ఎన్నికల్లో విజయం సాధించడం ఖాయమని రత్తమ్మ ధీమా వ్యక్తం చేస్తున్నారు. భర్తకున్న పేరు ప్రతిష్టలను నిలిపేందుకు జీవితాంతం తాను గ్రామం కోసం పనిచేస్తానని ఆమె అంటున్నారు. తన ఇంటి ఆవరణలో ఉన్న భర్త నిలువెత్తు విగ్రహం వద్ద కూర్చుని గ్రామస్థులను ఆమె ఆత్మీయంగా పలకరిస్తుంటారు. ప్రజాసేవకు వయసు ఎలాంటి ఆటంకం కాదని రత్తమ్మ ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో నాలుగోసారి పోటీ చేస్తున్న తనను గ్రామస్థులే గెలిపించుకొంటారని ఆమె చెబుతున్నారు.
*