Others

అవతారశర్మకు నోరి పురస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కవిసమ్రాట్ నోరి నరసింహశాస్ర్తి 120వ జయంతిని పురస్కరించుకుని నోరి పురస్కారాలను అందజేయనున్నట్లు నోరి నరసింహశాస్ర్తి చారిటబుల్ ట్రస్టు సభ్యులు నోరి శివసేనాని, నోరి కళ్యాణ సుందర్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ప్రతిష్ఠాత్మక నోరి నరసింహశాస్ర్తి పురస్కారానికి కాశీవాసి కొల్లూరు అవతారశర్మ ఎంపికయ్యారని, పురస్కారం కింద 20వేల నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందజేయబడుతుందని తెలిపారు. అలాగే యువరచయత ప్రోత్సాహక పురస్కారం రాంభట్ల వెంకటరాయశర్మ ఎంపికయ్యారని, పురస్కారం కింద ఐదువేల నగదు, జ్ఞాపిక ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. 6-2-2019న చిక్కడపల్లి త్యాగరాయ గానసభలో జరిగే నోరి నరసింహశాస్ర్తి జయంతి మహోత్సవ కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రదానం చేయనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్రాంత న్యాయమూర్తి ఎ. రామలింగేశ్వరరావు, సభాధ్యక్షులుగా బ్రహ్మశ్రీ నోరి సుబ్రహ్మణ్య శాస్ర్తి, ప్రత్యేక అతిథిగా ప్రొ. సుదర్శన్‌సింగ్, విశిష్ట అతిథిగా ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి, ఆత్మీయ అతిథులుగా ప్రొ. ముదిగొండ శివ్రపసాద్ తదితరులు హాజరు కానున్నారు.