Others

సుందరకాండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విషాదమంటే నరకమే. నరకమంటే-
తనెవరో తనకు తెలుస్తూ ఉంటుంది. కాని తన దుఃఖం నుండి తాను తప్పించుకోలేక బాధపడుతూ ఉంటాడు.
నివేద్యఈ స్థితి నుండి తననెవరైనా తప్పించాలి. కనుక స్వామి-
సో‚హం నైవ గమిష్యామి కిష్కింధాం నగరీమితః
అందుకని వెళ్ళను. సీతను చూడకుండా కిష్కింధను చూడటం సాధ్యం కాదు. అనుకొన్నాడు. ఇదీ సంగతి.
తాను సర్వంచేసే ననుకొన్నాడు. చూడవలసినది లేదనుకొన్నాడు చూడవలసిన వస్తువునకు స్థితి లేదనుకొన్నాడు. తాను చూడలేకపోవటంలో లోపం లేదనుకొన్నాడు.
నహిద్రక్ష్యామి యది తాం లంకాయాం జనకాత్మజాం
అనే నైవహి వేగేన గమిష్యామి సురాలయం.
సముద్రాన్ని దాటడానికి సిద్ధపడుతూన్న సమయంలో వానరులను చూసి- లంకలో సీతను చూడలేకపోతే ఈ వేగంతో దేవ లోకాని వెడతాను- అని చేసిన ప్రతిజ్ఞనే మరచిపోయేడు. కనుక ఈ స్థితిలో - వినాశే బహవోదోష జీవన్భద్రాణి పశ్యతి.
అని అనుకొన్నాడు.
ఇదీ సాధకుడైన వానికి కాని వానికి తేడా. ఎంత విషయదంలో ఉన్నా ఆంజనేయస్వామి మనస్సు బలహీనపడదు. స్వాస్థ్వాన్ని కోల్పోదు. ఆత్మ హత్యకు దారితీయదు. ఇదే అంగదుడయితే ఏ చిన్న ప్రతిఘటనను తట్టుకోలేడు. ప్రాయోపవేశం అంటాడు. మరణమంటాడు. అందువలననే స్వామి-
తాపసో వా భవిష్యామి నియతో వృక్షమూలికః
ఏ చెట్టు క్రిందో ఉంటూ తాపసునిలా బ్రతుకుతాను. అనుకొంటాడు. కొంత సేపటిలో మళ్ళీ ఆలోచన మారుతుంది.
లంకతో సహరావణుని తీసికొని రాముని ముందు పెట్టనా- అని అనుకొంటాడు.
ఇలా అస్తవ్యస్త ఆలోచనలతో సాధకుడు అహంకారమూలక అజ్ఞానంలో పడతాడు. దానివలన దుఃఖం-దానివలన కార్య విఘ్నత. కలిగితే సాధకుడు భ్రష్టుడవుతాడు కాస్త సుకృతమేదైనా అడ్డుపడితే తిరిగి తన మార్గంలోకి వస్తాడు. కనుకనే-
ధ్యానశోక పరీతాత్మ చింతయామాస వానరః
శోకముతోబాటు ధ్యాన పరీతాత్ముడైన స్వామి ఆలోచించేడు.
అలా ఒక్కసారి తన లక్ష్య మూర్తిని ధ్యానించేటప్పటికి
యావత్సీతాం హి పశ్యామి రామపత్నీం యశస్వీనీం
తావదేతాం పురీం లంకాం విచినోమి పునః పునః
యశస్విని అయిన రామపత్నిని చూసేవరకు పునఃపునః లంకలో వెదుకుతూనే ఉంటాడు. ఎందుకని? చూసేనన్న యశస్సును తనకు ఆమెయే యివ్వాలి.
తెచ్చుకొన్నాడన్న యశస్సనూ రామునికి ఆమెయే యివ్వాలి.
బంధించేడన్న యశస్సును రావణునికీ ఆమెయే యివ్వాలి.
అందుకని- అలా అనుకొన్నాడు. ఇదీ కార్యజ్ఞానం.
ఇంతవరకు తాను వెదకినచోట్ల ఎక్కడో అక్కడ నిజంగా సీత కనబడితే తనకు అంతకంటె దుఃఖం మరొకటుంటుందా! అట్టి సీతను తాను అంగీకరింపగలడా! అలా సీతను చూసి లంక నుండి తాను కిష్కింధకు వెళ్ళగలడా!
ఆయాసం వలన వచ్చిన ఆలోచనే కాని యిది జ్ఞానమా! కనుక- సుందరకాండ పారాయణ వ్రతస్థులకు ఈ దాక్ష్యం ఏర్పడాలి ఆక్షణంలో స్వామి పోగొట్టుకొన్నదేమిటో- దాని తాము పోగొట్టుకొన కూడదు. స్వామి మనకోసం పోగొట్టుకొంటే మనం మన కోసం నిలబెట్టుకోవాలి. సరే- అలా ఆకార్య జ్ఞానాన్ని పొందేడో లేదో దుఃఖ నాశనమయింది దుఃఖం నాశనం కాగానే సుఖప్రాప్తికి తగిన దర్శనం కలుగుతుంది. అందుకే-
అశోక వనికాచేయం దృశ్యతే యా మహాద్రుమా
ఇమామధిగమిష్యామి నహీయం విచితామయా- అని అనుకొన్నాడు.
ఇంకావుంది...