Others

సర్వ జగత్తుకూ పరమారాధ్యం గీతామృతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గీతయాః పుస్తకం యత్ర యత్ర పాఠః ప్రవర్తతే
తత్ర సర్వాణి తీర్థాని ప్రయాగాదీని తత్రవై
ఏ స్థలమున గీతా గ్రంథమెసగుచుండు
నెచట సద్భక్తిగీత పఠింపబడునో
అచటనుండును సర్వ ప్రయాగ పుణ్య
తీర్థములు సంతతంబు సుస్థిరములగుచు!
దీనిని బట్టి ‘గీత’కున్నంత ప్రాధాన్యం ఏమిటో తెలుస్తున్నది. ఇటీవలి కాలంలో ‘్భగవద్గీత’కు వచ్చినన్ని వ్యాఖ్యానాలు, పద్యానువాదాలు, నాటకీకరణలు- యింకా యింకా ఇతర ప్రక్రియలూ మరే గ్రంథాలకూ రాలేదేమో! ఇదొక మహాశాస్త్రం. బ్రహ్మవిద్య. ఉపనిషత్సారం. అందుకే మేధావులు గొప్ప వ్యాఖ్యానాలు వ్రాశారు.
‘‘్భగవద్గీతా కించి దధీతా గంగాజల లవకణికా పీతా, సకృతదపి యేన మురారి సపర్యా క్రియతే తస్య యమేనన చర్చా’’-అంటూ ‘మోహముద్గరం’లో ఆదిశంకరులవారు సెలవిచ్చిన విషయం జగద్విదితం. మొత్తానికి గీత భారత జాతినే గాదు, సర్వ జగత్తుకూ పరమారాధ్యమైన గ్రంథం. అందుకే దీన్ని ఇతర భాషలవారు కూడా పరమ ప్రామాణికంగా ఆదరిస్తారు. శ్రీకృష్ణపరమాత్ముని యొక్క వాక్యాలు విన్న తరువాత- ‘‘నాకు మోహమంతరించింది, సందేహాలన్నీ పటాపంచలైనాయి’’ అంటూ నూతనోత్సహాన్ని ప్రకటిస్తాడు పాండవ మధ్యముడు. ఉభయ సంవాద రూపమై యొప్పుచున్న ‘గీత’ను పఠించేవాడికి జ్ఞానసిద్ధి కలగడం ఖాయం. మొక్క విషయంకూడా చెప్పుకోవాలి. శ్రద్ధ గల్గి, మనస్సులో ఎటువంటి ద్వేషం లేకుండా వింటే, లేదా
చదివితే వాడికి పుణ్యలోకాలు తథ్యం అని బల్లగుద్ది చెబుతున్నది ఈ గీత. గీతా ప్రబోధాన్ని ఆచరించేవాడికంటే నాకు ప్రియముడైనవాడు మరొక్కడు లేకున్నాడు, ఆ పరమాత్ముడే! అంతేగాదు, భక్తిహీనుడికి, తపం లేనివాడికి వినగోరనివాడికీ, భగవంతుణ్ణి ద్వేషించేవాడికి యిది చెప్పడం వృధాకార్యం అనికూడా అన్నాడు. ఇదొక పరమ రహస్యం అంటూ, అతి రహస్యమంటూ భగవానుడు ఆ మహావీరుడికి చెప్పుకుంటూబోయాడు. అర్జునుడి సందేహాలన్నిటికీ సమాధానాలను అరటిపండొలిచి చేతిలో బెట్టినంత సులభంగా గాకపోయినా, నమ్మకాన్ని గలిగించేంత నేర్పుతో, ఓర్పుతో చెప్పాడనేది నిర్వివాదాంశం. ఇలాంటి గీతకు ఇటీవలి కాలంలో రామాయణ, మహాభారత, భాగవతాది గ్రంథాలకు లాగానే చక్కని వ్యాఖ్యానాలు లెక్కకు మిక్కిలి వచ్చాయి. ఈ పరంపరలో, సరళమైన తెలుగులో ‘్భగవద్గీత’ అంటే జీవిత పరమార్థాన్ని తెలియజేసే దివ్య జ్ఞానోపదేశం అంటూ అద్భుతమైన వ్యాఖ్యానాన్ని అందించారు పెద్దలు శ్రీ మొదలి వేంకట సుబ్రహ్మణ్యంగారు. ఈ గ్రంథానికి ‘తొలిపలుకు’ చదివిన పాఠకుడు మధ్యలో ఆపడం అసంభవం. అంతా చదివించే శక్తి ఈ వ్యాఖ్యానానికి ఉంది. ప్రపంచ సాహిత్యంలో భగవద్గీతకు సాటిరాగల గ్రంథం మరొక్కటి లేదన్న ‘తిలక్’ మహాశయుని మాటలు నూటికి నూరుపాళ్ళు నిజమేననిపిస్తుంది. అందుకే ఎంత దుఃఖంలో వున్నా, ఆ దుఃఖం నన్ను అంటకుండా ఉండటానికి కారణం భగవద్గీత అన్నాడట జాతిపిత అంతటివాడు. పోనీ, మన భారతీయులు అలా అనుకున్నారంటే, మన జాతిపైన ఉన్న అభిమానమనో, భక్తి అనో అనుకోవచ్చు. ఎందరో పాశ్చాత్యులే ముక్తకంఠంతో భగవద్గీతా ప్రాశస్త్యాన్ని గురించి తమ శైలిలో వివరణలు ఇచ్చారు. ‘ఎడిన్ ఆర్నాల్డు’ అనే పాశ్చాత్య పండితుడు ఈ గీత పట్ల ఆకర్షితుడై దానిని ఆంగ్లంలోకి అనువదించాడంటే ఎంత ఆశ్చర్యంగా ఉందో గదా? కృష్ణార్జునులులాంటి జంట, పోనీ గురుశిష్యులు ఈ సర్వ ప్రపంచంలో మరొక్కరు నిజంగానే కనబడరు. వేదాలూ, ఉపనిషత్తులూ, పురాణాలూ- ఇవన్నీ అవగతం చేసుకోవడం నిజంగానే కష్టసాధ్యం. ఆ కారణం చేత ఉపనిషత్తుల సారమంతటినీ ‘్భగవద్గీత’లో నింపి మన కందించాడు వేదావ్యాసుడు. అనేకమంది వ్యాఖ్యాతలు అభిప్రాయపడినట్లే ఉపనిషత్తులు గోవులయితే పాండవ మధ్యముడు ఒక ఆవు దూడ. గోపాలుడైన శ్రీకృష్ణుడు ‘ఆవు పాలు అనే గీత’ను పిదికి మనకందించాడు. అందుకే ‘గీతామృతం’ అని అన్నారు పెద్దలు. ఎన్నో ఎనె్నన్నో ధర్మసూక్ష్మాలూ, ఆధ్యాత్మిక విషయాలూ దీనిలో నిక్షిప్తమై యుండడంవలన దీనిని ‘ప్రస్థానత్రయం’లో ఒకటిగా చెబుతున్నారు పండితులు. ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు ఈ మూడు ప్రస్థానత్రయం అని పిలువబడుతున్నాయి. ఈ గీత ద్వాపరయుగాంతంలో, కలి ప్రారంభంలో చెప్పబడింది. కలిలో ధర్మం ఒంటిపాదంమీద నడుస్తుందని తెలిసి, ముందు రాబోయే కలియుగంలో మానవజాతిని ఉద్ధరించడానికి గీతను అర్జునుడికి ఉపదేశించాడు పరమాత్ముడు. నిజానికి కృతయుగంలోనో, త్రేతాయుగంలోనో చెప్పియుండవచ్చు.
(ఇంకా ఉంది)

డా అక్కిరాజు సుందర రామకృష్ణ