Others

సుందరకాండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అశోక వనం కనబడింది. అంటే సుఖ స్వరూపం కనబడింది. దాని వలన తాను చూడనిదేదో చూడవలసినదేదో తెలిసింది. ఇంతకంటె ఏం కావాలి. కనుక. రహస్యమేమిటంటే- స్వామి సీతను వెదుకలేదు. సీతే స్వామికి కనబడింది వెదుకుతున్నానని అనుకొన్నంత సేపు ఆవిడ కనబడలేదు. మహాకవుల కావ్యాలలో ‘మరణం’ అని ఒక అవస్త ఉంటుంది. మరణం అంటే చావు కాదు. మూర్చ. మరణ స్థితి వంటి స్థితి. అప్పుడు తన శరీరం తన వశంలో ఉండదు. తన యింద్రియాలు తన అదుపులో ఉండవు. తన మనస్సు తన స్వాధీనంలో ఉండదు. ఇట్టి స్థితి అందులో ఉన్న నాయికకు కలుగుతుంది. ఆ క్షణంలో నాయిక దర్శనం కలుగుతుంది. తిరిగి ఆమె జీవిస్తుంది. అంటే- తిరిగి ఆమె యింద్రియాలుఆమె ఆధీనమవుతాయి. ఆమె మనస్సు ఆమె యిష్టాన్ననుసరించి ఉంటుంది.
ఈ స్థితి భక్తునికి కూడా వస్తుంది. సాధకునకు వస్తుంది. ఆ స్థితి వచ్చే వరకు భగవంతుడు కల్పించుకోడు. సాధన సిద్ధించదు. స్వామికి అశోక వన దర్శనం కలుగగానే ఒక్కసారి తన శక్తి పునఃతనకు వచ్చినట్లయింది శక్తిని కలిగింపవలసిన దైవం జ్ఞాపకానికి వచ్చేడు. సమస్త దేవతా నమస్కారం చేసేడు. ముహూర్త కాలం ధ్యానం చేసేడు. వెంటనే-
నమో‚స్తు రామాయ సలక్ష్మణాయ
దేవ్యైచ తస్యై జనకాత్మజాయై
నమో‚స్తు రుద్రేంద్రయమాని లేభ్యో
నమో‚స్తు చంద్రార్క మరుద్గణేభ్య: అని చేతులు జోడించేడు.
అహంకార నిరాసనమైంది. తనను పంపినవాడు జ్ఞాపకం వచ్చేడు.
ఆయన తమ్ముడు జ్ఞాపకం వచ్చేడు. లంకలో చేరినప్పటినుండి ఇంతవరకు స్వామి రామధ్యానమెరుగడు. ఇప్పుడు జ్ఞాపకం వచ్చేడు రామచంద్రా! ఇది నా పని కాదు నీ పని. నాచేత చేయించుకొని అనుగ్రహించు. నీకు నమస్కారం. నీ సేవకుడైనప లక్ష్మణునకు నమస్కారం. అంతేకాదు-
జనకుని కుమార్తెయు నీకు దేవియు అయిన సీతకు నమస్కారం ఎందుకని-
జనకుని ప్రయత్నం లేకుండగానే ఆయనకు దర్శనమిచ్చి అనుగ్రహించినట్లు నన్ననుగ్రహంపవలసి తల్లి.
నా ప్రయత్నం ఏమీలేదు. అందుకని ఆ తల్లికి నమస్కారం నాకంటె ముందు ఆ తల్లి. అనుగ్రహాన్ని పొంది కృతార్ధులైనవారు కనుక- ఆ దారిలో నన్ను నడిపించి కృతార్థుని చేయవలసినదిగా- రుద్రాదులకు నమస్కారం. మానసిక ఉత్సాహం ఉరకలు వేసింది.
సగత్వా మనసా పూర్వం అశోక వనికా శుభాం.
అప్పుడే మనసా అశోక వనానికి వెళ్ళిపోయేడు. ఇది ఆంజనేయస్వామి ప్రకృతి. మనం కూడా ఇలా ఉండాలి. వెంటనే-
జ్యాముక్త ఇవ నారాచః పుప్లువే వనవాటికం.
ధనుస్సు నుండి విడిచిపెట్టబడిన బాణంలా అశోక వనానికి ఎగిరేడు. ఇలా ఎగరటం ఇది రెండవసారి. మన ప్రకృతి అల్పమయినది. కనుక మనకేమి కావాలో నిజంగా మనకు తెలియదు. భగవంతుణ్ణి కూడా మనం అడిగేటప్పుడు కూడా తెలియకే నష్టపోతాం. ఎందుకంటే - ఆయన ఎక్కువే ఈయదలచుకొన్నా అది తెలియక మనం తక్కువే అడుగుతాం. అలాగే-
స్వామి సముద్ర తరణానికి సిద్ధపడుతూ నేను రాముడు విడిచిన బాణంలా లంకను చేరతాను అని అనుకొంటాడు. లంకను చేరేడు. అలాకాక, అప్పుడే- నేను రాముడు విడిచిన బాణంలా సీతా సామీప్యాన్ని పొందుతాను అని అనుకొంటే ఇంత అవస్థలేకుండా అప్పుడే చేరి ఉండేవాడు. అజ్ఞానం ఇప్పుడు కలిగి విడిచిపెట్టబడిన బాణంలా ఎగిరేడు.
ఇది భౌతికంగా.
ఆ ఉత్సాహం ఈ వేగం సుందరకాండ పారాయణ దీక్షాదక్షులకు కావాలి. ఇలా ఎగురడానికి ముందే స్వామి తాను చూడవలసిన స్వరూపాన్ని ధ్యానం చేసేడు. ఆ స్వరూపం ఎలా ఉండాలి!
తదున్నసం పాండురదంత మవ్రణం
శుచిస్మితం పద్మపలాశలోచనం
ద్రక్ష్యే తదార్యా వదనం కదాన్వహం
ప్రసన్న తారాధిపతుల్య దర్శనమ్.
ఎతె్తైన ముక్కు కలది. ఏ వ్రణాలు లేనిది. చిరునవ్వుతో ఉండేది. పద్మ పత్రాలవంటి కండ్లు కలది. అయిన ఆ ఆర్య అందే పూజ్యురాలి ముఖాన్ని ఎప్పుడూ చూడగలనోకదా! ఇదీ శ్లోకం.
సీత అనబడే స్ర్తి స్వరూపాన్ని అనే్వషించడానికి వచ్చిన తనకు ఆ స్వరూపం ఎలా ఉంటే ఎందుకు అంటే- అలాకాదు.
ఇంకావుంది...