Others

మోక్షానికి మార్గం భగవద్గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దీని ఆవశ్యకత కలియుగంలోనే ఎక్కువగా ఉంటుందనే తలంపుతో అందించాడు. నిజంగానే గీతామృతాన్ని లోకానికి అందించాడు. సంసార సాగరంలో ఈదులాడేవాడు దీనిని తప్పక చదవాలి. ఈ సంసార సాగరంలో మునిగిపోయేవాడికి, లేదా మునిగిపోతున్నవాడికి నిస్సంశయంగా యిది ఒక నావే!
ఈ గీతాసారాన్ని విపరీతంగా అధ్యయనం చేసిన మహనీయుడు, గొప్ప నాటక కర్త కీ.శే. కాళ్ళకూరి నారాయణరావుగారు తమ భక్త చింతామణి నాటకంలో మొదటి రంగంలోనే నాయకుడైన బిల్వమంగళుని నోటిమీదుగా-
కష్ట్భరితంబు బహుళ దుఃఖ ప్రదంబు
సార రహితంబునైన సంసారమందు
భార్యయను స్వర్గమొకటి కల్పనము జేసె
పురుషుల నిమిత్తము పురాణ పురుషుండు!
అని అంటారు. తర్వాత వచ్చే ‘పురాణ పఠన’ ఘట్టంలో నిజంగానే భగవద్గీతా సారాన్ని కూడా అందించారనిపిస్తుంది. అజ్ఞానమే అన్ని దుఃఖములకు మూలం. ఈపరమ సత్యాన్ని బోధించేదే గీత- మహాభారతం 18 పర్వాలు. భగవద్గీతలో వున్నవి కూడా 18 అధ్యాయాలు. మహాభారత యుద్ధం జరిగింది కూడా 18రోజులు. పాల్గొన్న సైన్యం కూడా 18 అక్షౌహిణిలే! అక్షౌహిణి అంటే ఏమిటో, ఎన్ని ఏనుగులు, ఎన్ని రధాలూ, ఎన్ని గుర్రాలు, ఎంతమంది సైనికులు పాల్గొన్నారో, వాటి వివరణ తొలి మాటలోనే చాలా అందంగా వివరించారు శ్రీమొదలివారు. అంతేగాదు, మన దేహంలో ఉన్న ఇంద్రియాలు, వాటి గుణాలూ, వర్తనలూ ఇవన్నింటికీ అద్భుత వివరణతో అందించారు. శ్రీకృష్ణుడు చెప్పిన శ్లోకాలెన్నీ, అర్జునుడు చెప్పినవి ఎన్నో, సంజయుడు ఎన్ని చెప్పాడు అన్న విషయాన్ని చాలా వివరణాత్మకంగా అందించారు. మొత్తం 700 శ్లోకాలనీ, కొన్ని కొన్నిప్రతులలో ఈ సంఖ్య 701గా కనబడుతుందని కూడా వివరించారు శ్రీ సుబ్రహ్మణ్యంగారు.
ఈ గీతను కృష్ణుడు అర్జునునికి ఎప్పుడు ఏ సందర్భంలో చెప్పాడో అన్న అంశాన్ని కూడా వివరించారు. ఏ భీష్ముడికో, విదురుడికో చెప్పకుండా కేవలం అర్జునుడికే ఎందుకు చెప్పాడో అన్న విషయాన్ని ప్రతి పాఠకుడూ చదవాలి. అదిగూడా హాయిగా భోంచేసి, తాంబూలం సేవిస్తూ, ఉయ్యాల బల్లమీద ఊగుతూ అర్జునుడికి చెప్పలేదు. ఇంకాసేపట్లో యుద్ధం ప్రారంభవౌతున్నది అనే సమయంలో చెప్పాడు. అలా ఎందుకు చెప్పాడో కూడా ‘మొదలి’ వారి మాటలలోనే పాఠకుడు చదవాలి. మనస్సులో సంఘర్షణ తలెత్తినప్పుడు నివారణోపాయం ‘్భగవద్గీతా’పఠనం అన్నమాట. ఏడుస్తున్న అర్జునుడికి కన్నీళ్ళు తుడిచాడు. అమృతవాక్కులు వినిపించాడు. ఆత్మస్థైర్యం కలిగించాడు. యుద్ధానికి ఉద్యుక్తుణ్ణి చేశాడు. విజయలక్ష్మిని వరించేటట్లు చేశాడు. నిజంగానే ఈ వ్యాఖ్యాత సూచించినట్లు ‘గీత’ చదివితే పుణ్యం వస్తుందనీ, స్వర్గసుఖాలు సంప్రాప్తవౌతాయనీ, నేరుగా మోక్షం వస్తుందనీ చదువగూడదు. ఇది నిజంగానే మోక్షానికి మార్గం చూపుతుంది. విద్యార్థి దశనుండే భగవద్గీతను పాఠశాలలో పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలన్న మాటలు మనసుల్ని పులకించేలా చేస్తున్నాయి. ఒక పరిశోధనాంశంగా వ్యాప్తిలోకి తేవాలి. ‘సత్యసాయి విద్యావిహార్’ లాంటి పాఠశాలలలో మాత్రం నిత్యం భగవద్గీతా శ్లోకాలను విద్యార్థులకు గురువులు నేర్పడం, అంటే వారిచే పఠింపజేయటం జరుగుతున్నది. అపుడు నిజంగానే ప్రతి విద్యార్థిలో ఆత్మస్థైర్యం పెరుగుతుంది. గంధర్వ గాయకుడు ఘంటసాల వారి గీతా పఠనశ్లోకాలను స్మశానం దగ్గర వినిపించడం బాధాకరం అంటూ వాపోయారు ఈ వ్యాఖ్యాత. ఈ వ్యాఖ్యానం అంతా ఒక యెత్తు, 16వ అధ్యాయం ‘దైవాసుర సంపద్విభాగయోగం’ మరో యెత్తు. దైవీ సంపద అంటే ముఖ్యంగా జ్ఞాన సంపద. సద్గుణాలు కలిగి ఉండడం. అలాగే ‘ఆసురీ సంపద’ అంటే దుర్గుణాలు కలిగి ఉండడం. హింసా ప్రవృత్తి, మత్తు పదార్థాలు సేవించడం, ప్రతిదానినీ ద్వేషించడం, అమితమైన కోరికలు కలిగి ఉండడం- వేటిని విడిచిపెట్టాలో, వేటిని అవలంభించాలో అనే శ్లోకాలకు ‘మొదలి’ వారి వివరణ నిజంగానే సరళ సుందరంగా ఉన్నది. అందుకే దీనిని ‘దైవాసుర సంపద్విభాగం’ అన్నారు.
831 పుటల ఈ భగవద్గీతా వ్యాఖ్యానాన్ని డాక్టర్ పబ్లికేషన్స్ వారు తెలుగు ప్రజానీకానికి అందించారు. ప్రచురణదాత శ్రీమతి సామ అమృతమ్మ. పీచుపల్లి గ్రామం, గనే్నరువరం మండలం, కరీంనగర్ జిల్లా. అన్నింటికన్నా ఆశ్చర్యకరమైన విషయం యిది అమూల్యం. మొదటి ముద్రణ మార్చి 2018. వేణుగ్రాఫిక్స్, నల్లకుంట, హైదరాబాద్‌వారు దీనిని వెలుగులోనికి తేవడానికి కారణభూతులు. దీని ముద్రణ దాత సామ రామరెడ్డి, అమృతమ్మల దౌహిత్రుడు చి. విజయేందర్‌రెడ్డి కావడం, అతని చిత్తశుద్ధికి, భక్తి ప్రపత్తికి తార్కారణం. దౌహిత్రుడంటే యిలా వుండాలి. ఇటువంటి సత్కార్యాలను చేయడానికి నేటి తరం ముందుకు రావాలి.
కామ క్రోధ వియుక్తానాం యతీనాం యత చేత సామ్
అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనామ్- (కర్మసన్యాసయోగం- 26శ్లో.) అన్న శ్లోకానికి మొదలివారు చేసిన వ్యాఖ్యానం ముఖ్యంగా పఠితల్ని మరీ మరీ చదివించేలా చేస్తుంది.
(సమాప్తం)

డా అక్కిరాజు సుందర రామకృష్ణ