Others

కవి మనస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎదురుగా ఉన్న రోడ్డు జగతికి నిదర్శనంగా
క్రమ్ముకున్న చీకటి అజ్ఞానానికి సూచనగా
వెలుగుతున్న నాలుగు దీపాలు
వేదాలకు గుర్తుగా
ఇంకా చెప్పాలంటే దిక్కులను తలపిస్తూ
విచిత్రమైన ఆలోచనలు మెదడును చుట్టేస్తూ
నిలవనివ్వవే ఏ క్షణమూ
కవి అంటే ఇంతేనేమో?
అనుక్షణం అనే్వషణ నేపథ్యంలోనే
తప్పు ఎక్కడ జరుగుతుందా అన్నట్లు
చూపుల బాణాలను ఎప్పుడూ ప్రసరిస్తూనే
రచనతో సరిచేసేంతవరకూ తపన ఆగదే
నువ్వు వింటావా వినవా
అన్న విషయం పట్టించుకోడు
తన పని తాను చేసుకుపోవడమే ధర్మంగా
నిరంతరం సాగిపోయే చిట్టిమనసు
అతనికే సొంతం
కలం సృష్టించే కలకలంలో పడి
కొట్టుకుపోతూనే
ఉప్పెనైనా ఉపద్రవం అయనా
తట్టుకునే స్థైర్యంతో
అడుగు ముందుకే వెనకడుగు తెలియని
పయనం సాగించే నీవెంత ధీరోదాత్తుడివి?
నీకిచ్చే మెమొంటోలు అందరి లెక్కలో
ఓ చెక్కముక్క
అది నీ ప్రతిభకు తార్కాణం అని
కొందరికే తెలుసు
నీ చుట్టూ కప్పే శాలువా గుడ్డముక్క కాదని
నీలోని ఆత్మవిశ్వాసాన్ని అంచెలంచెలుగా
పెంచే చెట్టని ఎందరు గ్రహిస్తారు?
విలువకే విలువను ఆపాదిస్తుందని
ఎప్పుడు తెలుసుకుంటారు?
సత్కారం అంటే పరుగులు తీసే
నీ మనసును పరిహాసాలపాలు చేస్తూ
నిన్ను అనుక్షణం అణగదొక్కే
మాటలతో తూట్లు పొడిచినా
యోధుడిలా, యుద్ధ సైనికుడిలా
సమాజానికి దిక్సూచిలా
నువ్వు మాత్రం
ముందుకే.. మున్ముందుకే..

- యలమర్తి అనూరాధ, 9247260206