Others

మాఘమాస వైశిష్ట్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చంద్రుడు ‘మఖ’ నక్షత్రంతో కూడిన మాసం మాఘమాసం. ఈమాసం విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం. ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే పుణ్యప్రదమైన సమయం.
మాఘపురాణం ఈ మాస విశేషాలు ఎన్నో తెలుపబడినాయి. ఈ మాసంలో సూర్యోదయం జరుగుతుండగా స్నానాలు ఆచరిస్తే పాతకాలు తొలుగుతాయి. ఇవి ఫలవంతమైన స్నానాలు. సూర్యుడు వున్న రాశిని బట్టి - సూర్య కిరణాలు పడే కోణాలననుసరించి, సూర్య కిరణాలలో వుండే అతి నీల లోహిత పరా రుణ కిరణాల సాంద్రతను బట్టి శాస్తవ్రేత్తలు జననవరి 20 నుండి మార్చి నెల చివరకు వున్న వేళలలో సూర్యోదయానికి ముందు చేసే స్నానాలు ఆరోగ్యవంతమనీ - ప్రవాహ జలంలో చేసే స్నానాలు శ్రేష్టము. స్నానాలకు అధిష్ఠాన దైవం సూర్యుడు. సమస్త సృష్టిని ఆదిత్యడు తన కిరణాల ద్వారా ఆరోగ్యవంతం చేయగల దిట్ట. కావుననే స్నానానంతరం సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలి. ఇది సంప్రదాయం.
సూర్యుడు మకరంలో వుండే మాఘమాసంలో బావి -తటాకం - నదీ స్నానం- మహానదీ స్నానం-నదీ సంగమ స్నానం- గంగా స్నానం- త్రివేణీ సంగమ స్నానం శత గుణ ఫలాన్ని ఇస్తాయి.
శ్లో దుఃఖ దారిద్య్ర నాశాయ - శ్రీవిష్ణోస్తోషనాయచ
ప్రాతః స్నానం కరోమ్యద్య - మాఘే పాప వినాశనం
శ్లో మకరస్థేవౌ మాఘే - గోవిందాచ్యుత మాధవ
స్నానేనానే నమేదేవ- యధోక్తి ఫలదో భవ- అంటూ స్నానం చేయాలి. ఈ మాసమంతా నియమ నిష్ఠలతో పారాయణలు - జపం అర్చనల వంటివి ఆచరిస్తే విశేష ఫలమని పురాణోక్తి. బ్రహ్మపురాణంలో అరుణోదయ వేళ నారాయణ పాద పద్మాలను ధ్యానిస్తూ స్నానం చేస్తే దేవతలచేత కూడా పూజింపబడతాడని వుంది.
ఈ మాసంలో తిలలు - ఉసిరికలు దానం చేయాలి. ప్రతిదినం నియమంగా శివ -విష్ణుపూజ- అభీష్ట దేవతా పూజ చేయాలి. ‘మాధవ ప్రియతాం’ అని స్తోత్రం చేస్తూ వస్త్రాలు -దుప్పట్లు -పాదరక్షలు దానం చేయాలి. అన్నదానం ఈ మాసంలో ప్రశస్తియైనది. శివాలయాలలో నువ్వుల నూనెతో దీపాలు వెలిగించాలని శాస్త్రం తెల్పింది. ‘తిలతైలేన దీపాశ్చదేయాః శివగృహే శుభాః’ అని అనుష్ఠానాలు చేయదగ్గ మాసం ఇది. ఈ మాఘమాసంలో వచ్చే ఆదివారాలు పవిత్రమైనవి, పుణ్యమైనవి. ఈ ఆదివారాలలో స్ర్తిలు తరిగిన కూరలను తినరు. ఇదీ ఒక నోము.
మాఘంలో గౌరీ నోము నోచుకొని, స్ర్తిలు ముత్తయిదువలకు వాయన -దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి. మాఘ శుద్ధ చతుర్థిని వరగణేశ చతుర్థి అంటారు. పగలు ఉపవసించి సాయంకాలం గణపతిని పూజించాలని స్కాంద పురాణం తెలిపింది. దీనినే కుంద చతుర్థి అంటారు. శివార్చనచేయాలి. మల్లెపూలతో పూజించాలి. ఈ నెలలో శ్రీపంచమి వస్తుంది. విద్య -బుద్ధి -జ్ఞానాలకు అధిష్ఠాన దేవతగా పరాశక్తి సరస్వతీ దేవిగా ఆవిర్భవించిన పుణ్యదినమిది. కావున సరస్వతీదేవిని ఆరాధించి జ్ఞానం పొందాలి. మాఘశుద్ధ సప్తమి రథసప్తమి. ఈ రోజునుండి సూర్యునికి భూమి దగ్గరవడం మొదలవుతుంది. సర్వదేవమయుడు- లోకసాక్షి- కర్మసాక్షి అయిన ఆదిత్యుని ఆరాధించాలి. ఆరోగ్యం, తేజస్సు, ఐశ్వర్యం లభిస్తాయి. ‘ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్’ అని శాస్త్రం. తలపై జిల్లేడు, రేగు ఆకులు పెట్టుకొని అరుణోదయంలో స్నానం చేయాలి. సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలి. సప్తమీ తిథి దేవతనీ సూర్యమండలాన్నీ నమస్కరించాలి.
పరమభక్తుడు భాగవతోత్తముడు భీష్ముడు శ్రీకృష్ణుని సమక్షంలో అంపశయ్యపై పరుండి ఉత్తరాయణ పుణ్యకాలంలో పరమాత్మునిలో లీనమైన తిథి ‘్భష్మాష్టమి’. భీష్మ ఏకాదశి రోజున శ్రీకృష్ణ స్మరణతో శరీరాన్ని విడిచి మోక్షం పొందిన రోజు. మాఘశుద్ధ పూర్ణిమను ‘మహామాఘి’ అంటారు. సత్కర్మలను ఆచరించాలని శాస్త్రం.
ఈ మాసం పలు పుణ్యకార్యాలకు -పర్వదినాలకు ప్రసిద్ధి చెందినదని పద్మపురాణం తెలిపింది. శ్రీ విష్ణు ప్రీతికర మాఘమాసంలో వచ్చే మహాశివరాత్రి, మాఘ కృష్ణ చతుర్దశి-శివ చతుర్దశీ అనీ మహాశివరాత్రి అని ప్రసిద్ధికెక్కింది. పరమశివునికి అత్యంత ప్రీతికరమైన రోజు మహాశివరాత్రి. శివునికి ఈ దినాన అభిషేకాలతో, నదీ జలాలతో, నమక చమకాలతో, రుద్రముతో, బిల్వపత్రాలతో శంకరుని ఆరాధించాలి. మాఘమాస కృష్ణచతుర్దశి మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రినాడు శివుడు ప్రపంచంలోని అన్ని లింగాలలోనూ ప్రవేశించి ఉంటాడనీ, ఆనాడు చేసే శివరాధనలవలన పాప విముక్తి కల్గుతుందని విశ్వాసం. మాఘకృష్ణ అమావాస్యను పితృతిథిగా భావించి పితృదేవతలకు తర్పణాలు వదలడం ధర్మశాస్త్ర రీత్యా మంచిదని ఆ రీతిగా ఆచరించి శుభాలు పొందుతారు. పరమ పవిత్రమైన మాఘమాసంలో ఎన్నో విశిష్టతలున్నాయిగాని ఈ మాసంలో చేయగల్గిన ఆరాధనలన్నిటినీ ఆచరించి జనులు ఆ పరమశివునికి అనుగ్రహం పొందాలని ఆకాంక్ష. ఓం నమశ్శివాయ.

-పి.వి.సీతారామమూర్తి 9490386015