Others

స్మార్ట్ ట్రౌజర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికలాంగులు, వృద్ధులు కదలడంలో చాలా సమస్యలను ఎదుర్కొంటుంటారు. కిందపడిపోకుండా, ఎక్కువసేపు.. సొంతంగా తమ కాళ్లపై వాళ్లు నిలబడలేరు. ఇలాంటివారు కదలాలన్నా, ఎవరి ప్రమేయం లేకుండా నడవాలన్నా ఇబ్బందే.. అలాంటివారికోసం వచ్చినవే స్మార్ట్ ట్రౌజర్లు.. వీటిని బ్రిటన్‌లోని బ్రిస్టల్ విశ్వవిద్యాలయ పరిశోధకులు అభివృద్ధి చేశారు. కృత్రిమ కండరాలతో కూడిన ఈ స్మార్ట్ ట్రౌజర్లు రోబోటిక్ క్లాతింగ్ కిందకు వస్తాయి. శరీర కదలికలకు స్మార్ట్ ట్రౌజర్లు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇవి సౌకర్యంగా ఉంటాయి. వాడటం కూడా చాలా సులభం.
నడుము చుట్టూ, ట్రౌజర్ చుట్టూ ఉండే కృత్రిమ కండరాల సాయంతో ఇవి పనిచేస్తాయి. వేసుకునే వ్యక్తిని అనుసరించి వీటి పరిణామాన్ని కూడా మార్చుకోవచ్చు. అవసరమైతే పెద్దవిగా చేసుకోవచ్చు. వీటిని విప్పేయడం కూడా తేలికే.. ద రైట్ ట్రౌజర్స్ ప్రాజెక్టు కింద ఈ రొబోటిక్ ట్రౌజర్లను తయారుచేశారు. ‘ద రాంగ్ ట్రౌజర్స్’ సినిమాను దృష్టిలో ఉంచుకుని వీటికి ‘ద రైట్ ట్రౌజర్స్’ అనే పేరును పెట్టారు.