Others

నీ జీనుపాంటూ చూసి బుల్లెమ్మో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేటితరం అమ్మాయిల అల్మారా తెరిస్తే.. కనీసం వివిధ రకాల షేడ్లలో ఐదారు జీన్‌పాంట్లైనా దర్శనమిస్తాయి. ఇప్పటి ఉరుకుల, పరుగుల కాలానికి ఇష్టంగా, సౌకర్యవంతంగా ఉండే దుస్తులు ఏవైనా ఉన్నాయంటే.. అది జీన్‌పాంటే.. ఎప్పటికప్పుడు ఫ్యాషన్ కొత్తపుంతలు తొక్కుతున్నా.. ఎవర్‌గ్రీన్ ట్రెండ్ ఏదైనా ఉందంటే అది జీనే్స.. దానికున్న ఆకర్షణ, సౌకర్యం అలాంటిది. అందుకేనేమో కాలేజీలు, కార్యాలయాలు, పార్టీల్లోనూ.. ఎక్కడచూసిన అమ్మాయిలు జీన్స్‌లోనే దర్శనమిస్తారు. ఈ జీన్స్‌లో కూడా రకరకాలు ఉన్నాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే.. అయితే అన్ని రకాల జీన్స్‌లూ అన్నిచోట్లకి బాగోవు. అంటే.. టోర్న్ జీన్స్ వేసుకుని కార్యాలయాల్లోకి అడుగుపెట్టలేం కదా.. అలాగన్నమాట.. అయితే ఏ జీన్స్‌ను ఎప్పుడు వేసుకుంటే బాగుంటుందో చూద్దాం..
* ఏదైనా పార్టీకి జీన్స్‌తో వెళ్లాలనుకుంటే కాస్త పాలిపోయిన రంగులో ఉండే.. అంటే ఫేడెడ్ టోన్డ్ జీన్స్‌కి జతగా మెరుపులతో ఉండే టాప్స్ వేసుకోవాలి. అప్పుడు పార్టీ లుక్ అదిరిపోతుంది.
* స్నేహితులతో సరదాగా బయటకు వెళ్తున్నప్పుడు టీషర్ట్స్, ట్యూనిక్ టాప్‌లు బాగుంటాయి. ఇంకాస్త భిన్నంగా కనిపించాలంటే జీన్స్‌పైకి క్రాప్‌టాప్స్‌ని ప్రయత్నించొచ్చు.
* జీన్స్ అంటే ఎప్పుడూ నీలం, నలుపు రంగులేనా అనుకునేవారు గులాబీ, ఎరుపు, పసుపు రంగుల జీన్స్‌లను కూడా ప్రయత్నించొచ్చు. వీటిపైకి సాదా లేదా ప్రింటెడ్ టాప్స్ బాగుంటాయి. ప్రింటెడ్ జీన్స్ టీనేజీ అమ్మాయిలకు నప్పుతాయి. వీటిపై ఎలాంటి డిజైన్ లేని సాదా టాపుల్ని ఎంచుకుంటే అందంగా ఉంటుంది.
* జీన్స్‌కి జతగా టీషర్ట్, షర్ట్, కుర్తీ, కుర్తాలే కాదు.. పొడుగ్గా చీలికలుండే మ్యాక్సీ టాప్‌లు కూడా బాగుంటాయి.
* పొట్ట ఉన్నవారికి, కాస్త లావుగా ఉన్నవారికి హై వెయిస్టెడ్ జీన్స్ చక్కగా నప్పుతుంది. కొందరిలో పొట్ట, తొడలు, కాళ్లు లావుగా ఉండి ఓ ఆకృతి ఉండదు. ఇలాంటివారు తన శరీరాకృతిని సన్నగా కనిపించేలా చేయాలనుకుంటే.. బాయ్‌ఫ్రెండ్ జీన్స్, స్ట్రెయిట్ ఫిట్, బూట్‌కట్ బాగుంటాయి. ఇవి ముదురురంగులో ఉంటే మరీ మంచిది. వీటిపైకి లేత రంగు టాప్ ఉండేలా చూసుకోవాలి.
* ఎత్తు తక్కువగా ఉన్నవారికి ఫ్లేర్డ్ జీన్స్ నప్పదు. దీన్ని ఎంచుకోవడం వల్ల మరింత పొట్టిగా కనిపించే ఆస్కారం ఎక్కువ. వీరు స్కిన్నీ జీన్స్‌ని ఎంచుకోవచ్చు. కాళ్లు పొడుగ్గా, సన్నగా కనిపించేలా ఉండాలనుకునేవారు త్రీఫోర్త్ పొడవులో ఉండే క్రాప్డ్ జీన్స్ వేసుకుంటే బాగుంటుంది. దీనిపైకి కోల్డ్ షోల్డర్ టాప్‌లు బాగుంటాయి.
* సన్నగా ఉన్నవారికి స్ట్రెచ్, బూట్‌కట్, బాయ్‌ఫ్రెండ్, బ్యాగీ, స్కిన్నీ జీన్స్‌లు బాగుంటాయి. నడుము కింది భాగం లావుగా ఉన్నవారికి స్ట్రెయిట్‌కట్ జీనే్స బాగుంటుంది.
* ముప్పైల్లోపు ఉండే అమ్మాయిలకు కాస్త లేత రంగుల్ని ఎంచుకోగలిగితే బాగుంటుంది. నలభైల్లో వారికి ముదురు రంగులైన నీలం, నలుపు రంగుల జీన్స్ బాగుంటాయి.