Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం( తులాభారం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ ద్వారక నొకదినమున ఆయెనొక్క విశేషమ్ము
అది తెలిసిన మానసమ్ము వికసిత కమలమ్ము

ఎంచినాడు శ్రీకృష్ణుడు సత్యభామ తీరు మార్చ
ఎరిగినాడు నారదుండు ఆతని మదిలోని మాట

పుణ్యకవ్రతమను వ్రతమ్ము సలుపుమనుచు తెలిపెను
మేఘమ్ములు తుహినమ్ముల వోలె నగవులొలికెను

మునిమాటను తలదాల్చుచు ముదిత సల్పె వ్రతము
తన నాథుని, సనాతనుని తన్వి దానమిడెను

బడసినట్లు లోకమ్ముల మిడిసిపడెను నారదుండు
మబ్బు వెనక దినమణివలె నడిచె మాధవుండు

మరల పతిని కొనుటకునై మగువ ఆస్తి నూడ్చెను
కాని, అతని తూచలేక, కన్నీరై పోయెను

ఒక తక్కెడలో కృష్ణుడు! ఒక తక్కెట సర్వము!
ఎటుల తూగు శ్రీ కృష్ణుడు? ఎటుల తూచు సత్య?

ఒక తక్కెట సృష్టికర్త! ఒక తక్కెట సృష్టి!
పాదరజము పాదరజమె! ప్రభువునెట్లు తూచును?

అది తెలిసిన సతి రుక్మిణి మది కృష్ణున కిడిదండము
తులసీదళమున నాతని తులయందున తూచెను

దళమో అది తళత్తళల దళమో తారల గణమ్మొ
ఒక దళమే ఏకంగా ఒక కొండనె తూచెను

‘‘అండమె బ్రహ్మాండమ్ము బ్రహ్మాండమె అంత’’ మనెడు
సత్యమ్మే సత్య కనుల దృగ్గోచరమాయెను.

అనుతాపమొ! పరితాపమొ! ఆనందమొ! ఆశ్చర్యమొ!
సంభ్రమమున సత్యకనులు సంద్రములై పోయెను

భక్తికి మించిన చక్కటి పరమార్థం లేదు
పత్రం పుష్పం తోయం పరమాత్ముడు కోరు

నారదముని ఎత్తుగడలు నారాయణు లీలలు
లోక విదితమై పోయెను కృష్ణుడాయె దేముడు

సత్యకు కృష్ణుని నిచ్చుచు సెలవుదీసుకొనెను వౌని
సత్య తెలిసి తన తప్పును సవతి పదము లంటెను

సత్యనామె లేవనెత్తి తన కౌగిట జేర్చెను
పోయెనపుడు పెనవేసుకు భూమియు ఆకసము
ఇంకావుంది...

-గన్ను కృష్ణమూర్తి.. 9247227087