Others

అస్సలు నచ్చదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సహ జీవనంపై మీ అభిప్రాయం ఏంటి అని అడిగితే.. ‘సహజీవనం చేస్తున్న వారిని నేను జడ్జ్‌చేయలేను కానీ నావరకైతే నేను అలాంటి సంబంధం ఎంచుకోను. లివిన్ రిలేషన్‌ను మా ఇంట్లో అంగీకరించరు. అందుకే నేను వాటికి దూరం’అని చెప్పింది. అలాఅని అరేంజ్డ్ మ్యారేజ్ కూడా చేసుకోదట. ఈ విషయం ఇంట్లోవాళ్ళకు క్లియర్‌గా ముందే చెప్పేసిందట. తను పెళ్లిచేసుకోబోయే వ్యక్తి తనకు ముందే తెలిసి ఉండాలని.. ఎందుకంటే అతనితో జీవితాంతం కలిసి ఉండాలి కదా.. అంటూ చెప్పుకొచ్చింది. సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్‌తో ఎఫైర్ వార్తల గురించి అడిగితే ఇలాంటి వార్తలు 2016నుంచి మాపై వస్తూనే ఉన్నాయి. నేను ఇలాంటివి అసలు పట్టించుకోను. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అంటూ క్లారిటీ ఇచ్చింది. ‘లుకా చుప్పి’ మార్చి 1న విడుదల అవుతోంది. ఈ సినిమాలో హీరోగా కార్తిక్ ఆర్యన్ నటించాడు. ఈ సినిమా తర్వాత కృతిసనన్‌కు ‘అర్జున్ పాటియాలా’...‘హౌస్‌ఫుల్ 4‘.. ‘పానిపట్’చిత్రాల్లో లైన్‌లో ఉన్నాయి.