Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం( తులాభారం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రజలును సుమదళములైరి ప్రభువును తులసీదళం
అంజలించె ద్వారకయే- అతడంజలి మునిగెను

ద్వారక గగనమ్మాయెను- కృష్ణుడు చంద్రుడాయెను
చంద్రునుండి విడనోపని- సత్య వెనె్నలాయెను

తానన్నది మిగులబోక- నిశే్చషమ్మై పోయెను
కృష్ణునిలో కరిగి సత్య కృష్ణుండై పోయెను

వన విహారం
ఆ దినమున అతని సతులు అతని వీడలేకుండిరి
అతని వెంట గ్రహములట్లు అతివలంత తిరిగిరి

అతని నీడలై కదలిరి- అతని ఊపిరై సాగిరి
అతడే ఆతడు నతండు- అతివలు నాతండె

అది చల్లని సాయంత్రం- అది చక్కనివేళ
పూలపరిమళాల తోడ- వీచె వలపు గాలి

అతని తోడ వాహ్యాళికి అతివలు ముచ్చట పడిరి
వారి తోడ వార్ధిదాటి చేరెను యమునా తటి

తరగలవలె నురగలవలె- తరలెను జననాశ్వమ్ములు
అష్ట్భుజములట్లు అతని అష్టసతులు నొప్పిరి

అలలపైని అలలవోలె అతివలు ఆతని గూడిరి
తటిపై నొక తటివోలెను విశ్రమమ్ము సలిపిరి

గాలివోలె పరిమళాల వోలె నీదులాడిరి
కన్నులలో వెన్నియలను గ్రుమ్మరించుకొనిరి

లతలందున లతల వోలె పూలయందు పూలవోలె
చెట్టునందు కొమ్మలనలె చెలియలొదిగి పోయిరి

అతని మాటయై ఆడుచు అతని పాటయై సాగుచు
ఆతని నిశ్వాసమట్లు- అతని చుట్టె తిరిగిరి

ఇంతులతో బంతులాట! బంతులతో యింతులాట!
బంతులెవరొ? యింతులెవరొ? యెరుగునొక్క పూబంతులె!

కన్నులలో కన్నులనిడి కన్నులలో దాగుకొనిరి
చేతులలో చేతులనిడి, చేసికొనిరి బాసలు!

వెన్నుని కన్నుల వెనె్నల- వెలదుల కన్నుల వెన్నుడు
కలిసె మిన్ను మన్నుతోడ- కలసిపోరె వారలు?

ఐనను సంతృప్తి లేదు- ఐనను కుతుకము తీరదు
విశ్వమ్మే కౌగిలిలో- విశ్వం కౌగిట వారలు

ఒకతె పాట పాడమనును- ఒకతె ఆట ఆడమనును
ఒకతె రాజకీయమరయు- ఒకతె ముద్దు కోరును
ఇంకావుంది...

-గన్ను కృష్ణమూర్తి.. 9247227087