Others

పూర్తిస్థాయి మహిళా మార్కెట్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అతివలే అన్నింటికీ నిర్వాహకులు.. మహిళలు ఉత్పత్తి చేసిన వస్తువులు వారే విక్రయించుకునేలా ఒక కేంద్రం.. అదే ‘షీ మార్ట్ అండ్ లూస్’. దీన్ని చందానగర్‌లో జీహెచ్‌ఎంసీ ఏర్పాటుచేసింది. మహిళలు వారు తయారుచేసిన వస్తువులను అమ్మడానికి అనేక తంటాలు పడుతుంటారు. అనేక చోట్ల తిరుగుతూ వారు తయారుచేసిన వస్తువులను విక్రయించడానికి ఇబ్బంది పడుతుంటారు. అలా కాకుండా మహిళలు మాత్రమే తయారుచేసిన వస్తువులన్నింటినీ ఒకేచోట ఉంచి అమ్మడానికి అనుమతినిస్తే.. ఆ సదుద్దేశంతో ఏర్పాటైందే పింక్ మార్కెట్. ఇందులో రెండు స్టాళ్లు ఉంటాయి. ఒక దాంట్లో స్వయం సహాయక సంఘాలు తయారు చేసిన వస్తువులు ఉంటాయి. మరోదానిలో తినుబండారాలు ఉంటాయి. అంతేకాదు ఈ స్టాళ్లను ఏర్పాటుచేసిన మహిళలు ఇబ్బందులు పడకుండా.. ముఖ్యంగా బాలింతలు పిల్లలకు పాలిచ్చేందుకు ప్రత్యేక గది.. పింక్ టాయిలెట్లు.. వెనుక భాగంలో దివ్యాంగ మహిళలకు ప్రత్యేక మరుగుదొడ్లు ఉన్నాయి. ఇందుకోసం హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్‌ఎఎల్) సంస్థ సీఎస్‌ఆర్‌లో భాగంగా నిధులు కూడా మంజూరు చేసింది. స్టాల్స్‌లో ప్రస్తుతం జవహర్‌నగర్‌లోని స్వయం సహాయక సంఘాలు తయారుచేసిన జూట్, కాటన్ బ్యాగులు, చిరుధాన్యాలతో తయారుచేసే స్వీట్లు విక్రయిస్తున్నారు. అన్ని రకాల సరుకులు, కూరగాయలు తెచ్చుకునే విధంగా వీటిని రూపొందించారు. ఇవి రూ. ఐదు నుంచి రూ. 150 వరకు లభిస్తున్నాయి. దేశంలోనే మొదటిసారి పూర్తిగా మహిళల నిర్వహణతో షీ మార్ట్ అండ్ లూస్ ఏర్పాటుచేశారు. స్వయం సహాయక సంఘాల మహిళలు వారి ఉత్పత్తలను ఇక్కడ విక్రయించవచ్చు. స్టాళ్లలో అమ్మకాల ద్వారా వచ్చే లాభాలతో పింక్ టాయిలెట్లను నిర్వహిస్తారు. వీటిని పరిశుభ్రంగా ఉంచడం కోసం ఇద్దరు మహిళలు షిఫ్టుల వారీగా పనిచేస్తారు. మరుగుదొడ్ల నిర్వహణ బాధ్యతను చందానగర్ సర్కిల్ పరిధిలోని వేముకుంట మహిళాసమాఖ్య చేపట్టింది. మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకున సీసీ కెమెరాలను ఏర్పాటుచేశారు. మరో ఇద్దరు మహిళలు స్టాల్స్‌లో వస్తువులను విక్రయిస్తారు. వీటి నిర్వాహకులు కూడా మహిళలే.. అందుకే ఇది పూర్తిగా మహిళా మార్కెట్.. *