Others

అరుదైన గౌరవం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రియాంక చోప్రా జోనాస్‌కు అరుదైన గౌరవం దక్కింది. న్యూయార్క్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లో ప్రియాంక చోప్రా మైనపు విగ్రహం కొలువుతీరింది. ఈ బొమ్మకు ‘ప్రియాంకచోప్రా జోనాస్’ అని పేరు పెట్టారు. 2016లో ఎమీ పురస్కారాల వేడుకల్లో ఎర్రరంగు డ్రెస్ ధరించి సందడి చేసిందామె. ఇప్పుడు ప్రియాంక మైనపు బొమ్మకూ అలాంటి డ్రెస్సే వేశారు. ఈ మైనపు విగ్రహాన్ని న్యూయార్క్‌తో పాటు యూకే, ఆస్ట్రేలియా, ఆసియాల్లోనూ ఏర్పాటు చేయనున్నారు. ఒకే వ్యక్తికి చెందిన విగ్రహం నాలుగు వేర్వేరు మ్యూజియాల్లో పెట్టడం ఇదే తొలిసారి. గతంలో అమెరికన్ గాయని విట్నే ఎలిజిబెత్ హోస్టన్‌కు అత్యధికంగా మూడు విగ్రహాలు పెట్టారు. ఇప్పుడు ఆ రికార్డుని ప్రియాంక బ్రేక్ చేసింది. తన మైనపు బొమ్మతో ఫొటోలకు పోజులిచ్చి సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది ప్రియాంక. ఇక ఈ పోస్టుకు లక్షల్లో లైకులు వస్తున్నాయన్నది వేరే చెప్పాలా!?