Others

బట్టలపై మొండి మరకలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బట్టలు మురికిగా తయారవ్వడానికి రకరకాల పదార్థాలు అంటే ఆహారం, పానీయాలు, ఇంక్, లిప్‌స్టిక్, ఆయిల్.. ఇలా ఏవైనా కారణాలు కావచ్చు. ఇలా మరకలు పడిన వాటన్నింటినీ కలిపి ఉతికేయకుండా.. ఒక్కో రకమైన మరకకు ఒక్కో పరిష్కార మార్గం ఉంటుంది. అలాగే మరక పడిన బట్టలు ఏ రకమైనవో చూసి దానిని బట్టి శుభ్రం చేయాల్సి ఉంటుంది.
* కాటన్ చాలా మన్నికైన ఫాబ్రిక్. కాబట్టి ఈ ఫాబ్రిక్‌కు ఎలాంటి నష్టం వాటిల్లకుండానే మరకలను తొలగించడానికి అనేక రకాల పద్ధతులను ఉపయోగించవచ్చు.
* సింథటిక్ బట్టలైతే సాధారణ మన్నికను కలిగి ఉంటాయి. కాబట్టి వీటిపై మరకలను తొలగించేటప్పుడు జాగ్రత్తగా మెలగాలి. తరచుగా సింథటిక్ బట్టలను శుభ్రం చేయడానికి ఎంజైములు కలిగిన సాధారణ డిటర్జెంట్లు సరిపోతాయి. వీటిపై బ్లీచ్ వంటి కఠినమైన రసాయనాలను ఉపయోగించడం మంచి ఆలోచన కాదు. సింథటిక్ బట్టలపై ఉన్న మరకలను తొలగించడం ఉపయోగించే స్టెయిన్ రిమూవర్లు సురక్షితంగా ఉన్నాయా? లేవా? అని ముందుగా తనిఖీ చేసుకోవాలి.
* ఉన్ని బట్టలపై పడిన మరకలను తొలగించడానికి మార్కెట్లో అనేక రకాలైన వాణిజ్యపరమైన స్టెయిన్ రిమూవర్లు ఉన్నాయి. కానీ ఇవి ఉన్ని ఫైబర్లను నష్టపరుస్తాయి. కనుక డిటర్జెంట్లను కొనేటప్పుడు లేబుల్స్‌పై ఉన్న సూచనలను తప్పకుండా చదవాలి. పెర్సిల్ సిల్క్, ఉన్ని వంటి మెటీరియల్స్ కోసం రూపొందించిన నిర్దిష్టమైన డిటర్జెంట్లను వాడాలి. తరువాత బట్టలను పొడిగా మార్చడం వల్ల సరైన ఆకారాన్ని తిరిగి పొందగలదు. అవసరమైతే స్పెషల్ గార్మెంట్ స్టెయిన్ చికిత్స కోసం ఒక ప్రొఫెషనల్ డిటర్జెంట్‌ను తీసుకోండి.
* సిల్క్ బట్టలపై పడిన చిన్న మరకలను నివారించడానికి దానికి సంబంధించిన డిటర్జెంటును వాడటం తప్పనిసరి. ఆ మరకలను తొలగించడానికి మొత్తం వస్త్రాన్ని నానబెట్టాలి. సిల్క్ నమ్మశక్యం కానంత సున్నితమైనది. కాబట్టి కఠినమైన మరకలను తొలగించడానికి డ్రై క్లీనర్ల సహాయం తీసుకోవాలి.
* అన్ని రకాల మరకలను తొలగించడానికి స్టెయిన్ రిమూవర్స్ కోసం పరుగులు తీస్తాం. కానీ ఇంట్లో ఉన్న కొన్ని పదార్థాలు ఈ మరకలను తొలగించడానికి సహాయపడతాయి. ఇలాంటి పద్ధతులను పాటించేటప్పుడు బట్టలపై ఉన్న రంగులు అస్పష్టంగా గానీ, పూర్తిగా గానీ తొలగిపోవని ముందుగా నిర్ధారించుకోవాలి. అందుకోసం మీరు గార్మెంట్స్ నిపుణుడి సలహాను తీసుకోవచ్చు.
* పాలతో డార్క్ చాక్లెట్ మరకలను తొలగించవచ్చు. ఎలాగంటే.. ముందుగా మరకలు పడిన బట్టలను ఫ్రీజర్లో ఉంచడం ద్వారా ఆ మరకలను గట్టిపడేలా చేయవచ్చు. తర్వాత ఆ చాక్లెట్‌ను స్క్రాప్ చేయడం ద్వారా మరకపై గడ్డ కట్టిన చాక్లెట్‌ను తీసేయాలి. తరువాత చాక్లెట్ మరకలు ఉన్న బట్ట వెనుకభాగంలో వేడినీటిని పోయడం వల్ల ఆ మరకలను కరిగిస్తుంది. తరువాత ఆ మరకలను డిటర్జెంట్‌తో కడిగిన తర్వాత ఆ బట్టలను 30 నిముషాల నుంచి ఒక గంట వరకు పాలల్లో నానబెట్టాలి. అంతే డార్క్ చాక్లెట్ మరకలు తొలగిపోతాయి.
* బట్టలపై టమోటా మరకలు పడినప్పుడు ముందుగా ఆ బట్టలను సాధారణంగా ఉతకాలి. అవసరమైతే తరువాత మళ్ళీ ఉతకాలి. వెనిగర్‌తో టమోటా మరకలను తొలగించడానికి తెల్లని వెనిగర్‌లో ముప్ఫై నిముషాల పాటు బట్టలను నానబెట్టాలి. తరువాత ఆ బట్టలను వాషింగ్ మిషన్‌లో ఉతికే ముందు డిటర్జెంట్‌తో నేరుగా మరకలపై రుద్ది వేస్తే ఇక మరకలు కనిపించవు.
* ఇంక్ మరకలను తొలగించడానికి చాలా గమ్మతె్తైన పద్ధతి ఉంది. అదేంటంటే.. మిథైల్ ఆమ్లం(హేస్ప్రే) వంటి ఒక ఆల్కహాల్ ఆధారిత ఉత్పత్తుల్లో బట్టలను నానబెట్టాలి. ఇది చాలా అద్భుతమైన పరిష్కార మార్గం. బట్టలపై ఉన్న మరకలు పూర్తిగా తొలగిపోయే వరకు బట్టలను డిటర్జెంట్ నీటిలో నానబెట్టి ఉతకాలి.
* బట్టలపై ఆయిల్ మరకలు పడినప్పుడు డిష్వాషింగ్ లిక్విడ్‌ని నేరుగా మరకలపై రాసి ఉతికితే మరకలు పోతాయి.
* బట్టలపై రక్తపు మరకలు పడినప్పుడు.. ఉప్పులో కొద్దిగా చల్లటి నీటిని కలిపి పేస్టులా చేసి.. దీన్ని మరకలపై రుద్దాలి. తరువాత చల్లటి నీటిలో బట్టలను శుభ్రంగా ఉతకాలి.
ఇలాంటి చిన్న చిన్న చిట్కాల ద్వారా బట్టలపై పడిన మొండి మరకలను సులభంగా తొలగించుకోవచ్చు.