Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం( ఆరాధనం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృష్ణపత్నులు:
ఎంత అందమోయి నీది? ఎంత అందగాడవోయి?
ఎంత మధుర మోయి మోవి? ఎంత మధుర మోయి?

ఈ అందం, ఈ చందం నీకెక్కడివోయి?
ఈ కన్నుల సోయగాలు ఏ తారలవోయి?

నీలి నీలి దేహమ్మున సాగరమ్మె పొంగినట్లు
నీలి నీలి కురులలోన జలపాతము లీదినట్లు

చెక్కిలిలో లెక్కలేని చుక్కలు కలహించినట్లు
నవ్విన పడు సొట్టలందు నదులు సుడులు తిరిగినట్లు

పొట్టయందు గ్రహములెన్నొ- అట్టిట్టుల దొరలినట్లు
గుండె జేరి మహోదధులు గురకనిదుర వోయినట్లు

మూస పోసినట్లు ముక్కు- ముక్కు పైని చిరుకోపం
రుసురుసలను పగడమ్ముల మిసమిసలే దాగినట్లు

ఆ చూపుల తోడనేవొ విరితూపుల దూసినట్లు
ఆ తూపుల విరికనె్నలు చచ్చిమరల బ్రతికినట్లు

ఆ నడకల కలవరపడు అంచలెన్నొ అగుపించును
ఆ నవ్వుల దొంతరలో ఆణిముత్యములె దొరలును
ఇంకావుంది...

-గన్ను కృష్ణమూర్తి.. 9247227087