Others

నిజమైన ప్రేమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెండు మనుషుల కలయికతో
ప్రేమ జనించదు
ముఖ సౌందర్యాలని దాటుకుంటూ
గుండె లోతుల్ని స్పృశించగలిగితే
నీ పాదాక్రాంతమే

భిన్న వైరుధ్యాల నడుమ
మొక్కవోని నమ్మకమై నిలబడితే
కడదాకా నిలబెడుతుంది

ఎదుటివారి కళ్లలో నవ్వులు
పూయించగలిగితే ఎడారి బతుకులంతా
ఒయాసిస్సుల సంపదలే

అనంగీకారాన్ని కూడా ప్రేమగానే భావిస్తే
ఉన్మాద స్థితికి చరమగీతమే

ప్రేమ అక్షరాలు నిజం కావాలంటే
మనసా వాచా ప్రేమించు

భౌతిక వాంఛలనధిగమించి
మానసిక బంధంలో వొదిగిపో

అప్పుడు ప్రతీ దినమూ ప్రేమకి
పట్ట్భాషేక మహోత్సవమే!

-పుష్యమీ సాగర్ 9010350317