Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంత వశీకరణ మెచట కొని తెచ్చితివోరుూ?
ఇంత రసిక శిఖామణివి నోరు కదపవేమోయి?

నడిచినచో నడుచుమేర తొణికిసలాడును అందం
ఒలికిపోవు సోయగాలె సృష్టికి మూలమ్ములనగ

పరుగెత్తిన వెనకపడును కాలప్రవాహమ్మే
దారులందు జారిపడిన చిరుమువ్వల నేరుకొనగ

నిలిచినచో నిలిచిపోవు నిఖిల ప్రపంచమ్మే
నిలువెత్తున నిన్ను కొలిచి నీకంజలి ఘటింపగ

పాడినచో గొంతుకలిపి పాటపాడు కొండలు
పాటలలో ప్రణవనాద పరమార్థం దొరికినట్లు

అనుచు వారు శ్రీకృష్ణుని చుట్టు చేరినారు
సాగరమున చేతులెత్తి నదులు చేరినట్లు
ప్రశంస

శ్రీకృష్ణుడు:
మీరు లేక సోయగాలు నాకెక్కడివో సఖియా?
మీరు లేక వైభవమ్ము నాకెక్కడిదో చెలియా?

పూవులేక తొడిమకెటుల తావులబ్బునోయి?
మీరు లేక నాకెట్టుల ఖ్యాతి కలుగునోయి?

ఇంకావుంది...

-గన్ను కృష్ణమూర్తి.. 9247227087