Others

మహాభినిష్క్రమణము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవును ఇది నిజం..
కల్పితము కాదు
కథ అంతకంటే కాదు
ఆకాశమంత స్వప్నం ముక్కలై..
నిండునూరేళ్ళ జీవితం
అర్ధాంతరంగా..
విధిరాత వారి
మరణం ముందు ఓడిపోయింది..
పునరపిజననం.. పునరపిమరణం..
దేశ రక్షణ చట్రబంధములో కేవలం
పుట్టుక మాత్రమే తమదని
జీవితాలు దేశం కోసమని
తోటివారి ప్రాణాలను
వారి గుండెల్లో పెట్టుకొని..
రక్షకులై నిలిచి..
వెలుగులను త్యాగం చేసిన సూర్యులు..
కుటుంబ తీపి జ్ఞాపకాల
నెమరు మరవకముందే
ముష్కరుల ముప్పేటదాడి
హేయం.. నీచం..
జుగుప్సాకరం..
మంచు పర్వతము
కన్నీటి కడలిగా..
భీతావహదృశ్యంగా..
వీర జవానులారా.. అమరులారా..
మీ త్యాగం అజరామరం
మీ మహాభినిష్క్రమణకు
కడుపున దుఃఖము నింపుకొని
భరతఖండము
భోరుమని విలపిస్తూ
బుద్ధం శరణం గచ్చామి
ధర్మం శరణం గచ్చామి
సంఘం శరణం గచ్చామి!

- మడిపల్లి హరిహరనాథ్ 96035 77655