Others

అందమైన లోగిలి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంట్లో అందరూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటే అది అందమైన లోగిలే అవుతుంది. అలా ఇంటిల్లిపాది సంతోషంలో అందం, పరిశుభ్రత వంటి అంశాలు కీలకపాత్ర పోషిస్తాయి. అందుకే ఇంటిని అందంగా, శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లో అందరూ కాసేపు కూర్చుని గడిపేది, ఎవరైనా వస్తే కూర్చునేది డ్రాయింగ్ రూములోనే.. కాబట్టి డ్రాయింగ్‌రూమును మరింత అందంగా తీర్చిదిద్దుకోవాలి. ఇంటి డ్రాయింగ్‌రూమ్‌లో కళాకాంతులు తెచ్చే ఇత్తడి ఫర్నిచర్, ఉడ్ ఫర్నిచర్‌ను అమరిస్తే బాగుంటుంది. హాలులో ఏ విధమైన సిట్టింగ్ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందో ఆలోచించి అలా చేస్తే సౌకర్యంగా ఉంటుంది. చక్కటి సోఫాలు, కళాత్మకమైన పెయింటింగ్‌లు, మంచి మ్యూజికల్ సిస్టమ్, టీవీ, వాల్ హ్యాంగింగ్స్, లైటింగ్ సిస్టమ్, నేలపై సుతిమెత్తని తివాచీలు.. ఇలా అన్నింటినీ పొందిగ్గా అమరిస్తే.. డ్రాయింగ్‌రూమ్ చాలా అందంగా ఉంటుంది. ఇంటికి వచ్చి అతిథులు ఇంటిని చూసి చాలా ఆశ్చర్యపోతారు.
పిల్లల ఆసక్తిని గమనించి, ఆ విధంగానే వారి గదిని అలంకరించాలి. బొమ్మలు, కంప్యూటర్, చదువుకునే టేబుల్ తప్ప ఇంకో వస్తువు వారి గదిలో లేకుండా అలంకరిస్తే వారికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. వస్తువులు ఎక్కువగా పిల్లల గదిలో ఉంచితే వారు వాటిని అటూ ఇటూ విసిరేయడమో, లేక వారి వస్తువులకు అడ్డుగా ఉండటమో జరుగుతుంది. కాబట్టి పిల్లల గదిలో వీలైనంత తక్కువ వస్తువులు ఉండేలా చూడాలి. తరువాత మీ అభిరుచులకు అనుగుణంగా బెడ్‌రూమ్‌ను తీర్చిదిద్దుకోవాలి. ఇంట్లోని రూముల గురించే కాకుండా ఫోర్టుకో, ఇంటి ముందు ఉండే ప్రదేశంలో, ఇంటి వెనుక పెంచే మొక్కల గురించి కూగా శ్రద్ధ తీసుకోవాలి. ఇంటి వరండాలో, ఇంటి ముందు ఉన్న ఖాళీ ప్రదేశంలో పెంపుడు జంతువుల కోసం కేజ్‌లను ఏర్పాటు చేయాలి. వాటిలో రంగురంగుల పక్షులు, చిలకలు, లవ్ బర్డ్స్, మైనాలు వంటివాటిని తెచ్చిపెట్టాలి. తాబేళ్లు, కుందేలు, కుక్కలు వంటి జంతువులు కూడా పెంచుకోవచ్చు. ఇల్లు ప్రశాంత నిలయంగా ఉండేలా తీర్చిదిద్దడానికి ఇంట్లోని ప్రతి గది కొలతలు మీకు క్షుణ్ణంగా తెలిసి ఉండాలి. అప్పుడే ఇంటి అలంకరణ విషయంలో స్పష్టమైన అవగాహన ఉంటుంది. ఇంట్లోని ప్రతి గదిలో ఏదో ఒక ప్రాంతం ఫోకస్ పాయింట్‌లా ఉండాలి. అందుకు ప్రతి గదిలోనూ ఒక ప్రదేశం మీ అభిరుచికి తగినట్లు ప్రత్యేకమైన శిల్పాలు, చిన్న పిల్లల బొమ్మలు, లైటింగ్ టేబుల్స్, షాండ్లియర్,. ఫ్లవర్‌పాట్స్ వంటివి అమర్చుకోవాలి. చూసిన వెంటనే ఆకట్టుకునేలా వీటిని అలంకరించుకోవాలి. గదిలో అమర్చిన లైటింగ్ గది అందాన్ని మరింత ఇనుమడింపచేస్తుంది. గది రంగును ప్రతిబింబించేలా రకరకాల బల్బులను అమర్చుకోవచ్చు. ఇలా అమర్చిన లైటు కింద చక్కటి రౌండ్ టేబుల్ వేసి దానిపై ఫ్లవర్ బేసిన్ పెట్టాలి. దీనిలో నీళ్లుపోసి రంగురంగుల పూలను అమర్చాలి. ఇలా ఇంటికోసం చేసే ప్రతీపని ఇంటి అందాన్ని పెంచే విధంగా ఉండాలి. ఇల్లు ఇలా ఉండటం వల్ల ఇంటి సభ్యుల ఒత్తిడి దూరమై అందరూ ఆనందంగా ఉంటారు. చూసినవారు మెచ్చుకుంటారు. *