Others

శ్రీ పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్తంభమును బట్టుకొని, పడిపోవుదునను భయము లేకుండ దాని చుట్టును దిర్దిర తిరుగు బాలుని తీరున భగవంతునిపై మనసు నిలిపి నీ సంసారిక ధర్మములను నిర్వర్తించుచుండుము. నీకెట్టి అపాయమును గలుగదు.
284. ఊరిలో యువతులు నాలుగైదు కుండలను దొంతరగా తలమీద బెట్టుకొని నీళ్లు తెచ్చుకొనునప్పుడు త్రోవలో తమ కష్టసుఖములను గూర్చి ముచ్చటించుకొనుచు బోవుదురు. ఐనను నీటిని మాత్రము ఒక చుక్కయైనను తొణకనీయరు. ఎట్టి పరిస్థితులలో నున్నను తన మనస్సు మాత్రము ధర్మమార్గమునుండి తప్పిపోకుండ మెలకువ గలిగి మెలగవలయును.
285. వ్యభిచారిణియగు స్ర్తి తన యింటి పనులనన్నిటిని సవరించుకొనుచున్నను మనసు మాత్రము తన విటునిపై నుంచు రీతిని, ఓ సంసారీ! నీవిహిత కృత్యములనన్నిటిని నిర్వర్తించుకొనుచుండుము, కాని నీ మనసును భగవానునిపై నిలుపుము.
286. భాగ్యవంతుని కుటుంబున బిడ్డకు పాలిచ్చు దాది ఆ బిడ్డను తన బిడ్డయో యను రీతిని బెంచును. ఐనను ఆ బిడ్డపై తనకెట్టి హక్కును లేదని బాగుగా తెలిసికొనియే యుండును. అటులనే మీరు మీ బిడ్డలకు కేవలము పోషకులనియు, వారి నిజమైన తండ్రి భగవంతుడనియు, భావింపుడు.
287. వీధిలో బిచ్చమెత్తుకొనుచు తిరుగుపాటకుడు తంబురను ఒక చేతితో మీటుచు, చిరుతలను ఒక చేతితో వాయించుచు, నోటితో గూడ పాడుచుండును గదా? అటులనే, ఓ సంసారీ! చేతులతో నీ సంసారిక ధర్మములను నిర్వర్తించుకొనుచుండుము. కాని నిండుమనముతో భగవన్నామగుణానుకీర్తనము చేయుచుండుము.
288. దాసి తన యజమానుని యింటిని గూర్చి ‘మా యిల్లు’ అని చెప్పుచుండును. ఐనను ఆ యిల్లు తనది కాదనియు తన యిల్లు దూరమగా బర్డ్వాన్‌లోనో, నడియాలోనో వున్న పల్లెటూరిలో నున్నదనియు ఆమెకు తెలియును. ఆమె నిజముగా ఆ పల్లెటూరి యింటిని గురించి తలపోయుచుండును. తన యొడిలోనున్న యజమానుని బిడ్డను గూర్చి, ‘‘మా హరి చాలా కొంటెవాడైపోయినాడు అనియో’’ లేక, ‘‘మా హరికి యిది యిష్టము, ఇది యిష్టము’’ అనియో పలుకుచుండును. కాని హరి తన బిడ్డ కాడని ఆమెకు బాగగుగా తెలియును. ఈ దాసివలె అసంగులై మెలగుడని నా యొద్దకు వచ్చినవారితో నెల్ల చెప్పుచుందును. సక్తత లేకుండ సంసారము చేయుడని-సంసారమున నున్నను సంసారబద్ధులు కావలదని -పరంధాముడగు భగవంతునివైపు మనసు త్రిప్పుడని-వారందరి తోడను చెప్పుచుందును.

శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి

ఇంకావుంది..