Others

జీవన సార్థకత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవితంలో విజయం సాధించచటం అంటే, అంతులేని ధనరాశులు కూడబెట్టడం విలాసవంతమైన భవనాలు నిర్మించడమని భావిస్తారు. అవి అవసరమే, కాని, వాటిని మాత్రమే సాధించడం ఘనవిజయంగా భావించడం ఉచితమేనా? ఈ విషయాలు మనసుకు అఖండ సంతృప్తి కలిగించే అపూర్వవిజయాలుగా కనిపిస్తాయా ? అనిపిస్తాయా? జీవితం ఏ కోణంలోనుంచి చూసినా పరిపూర్ణత్వపు మాధుర్యంగా పల్లవించాలి. అదే జీవితానికి అర్థం, పరమార్థం. సాఫల్యమకుటం.
ఎన్ని ఐహిక సంపదలున్నా ఆముష్మికానందంతో సరితూగలేవుఅని ఎవరికి వారు అనుభవైక వేద్యంగా తెలుసుకొంటేనే అర్థమవుతాయ. ధనమే ధ్యేయం జీవితాన్ని గడి పితే కొద్దిరోజులకు విసుగు వేసట కలుగు తాయ. విరక్తి కలుగుతుంది. శరీరం కొన్నాళ్లకు పటుత్వం కోల్పోతుంది. అపుడు ఏమి చేయలేక కాలాన్ని వృథాగా గడిపామని అనుకోవాల్సి వస్తుంది. అంతేకాదు మితిమీరిన ధనం అమిత ప్రమాదాలకు దారితీయవచ్చు. ధనం బాగా సంపాదించేవారు వేదన చెందుతూనే వుంటారు. అవసరమైనంత సంపాదనతో జీవించేవారు తృప్తిగా రోజులు గడుపుతారు.
ఆర్థిక స్థితి మెరుగుపడినకొద్దీ సుఖ సంతోషాలు పెరుగుతాయని భరోసా లేదు. భద్రత అన్నది ఎండమావి. డబ్బువల్ల హంసతూలికా తల్పం కొనవచ్చు కాని నిద్రను కొనలేం. పుస్తకాలు కొనవచ్చు కాని ప్రజ్ఞా ప్రాభవం బజార్లో దొరికే వస్తువు కాదు. ఆహారం కోకొల్లలుగా కొనవచ్చు కాని ఆకలిని కొనలేం. అందమైన వస్తువులు ఎన్నైనా కొనవచ్చు. కాని సౌందర్యం ధనరాశులకు అందదు. ఎన్నో అంతస్తుల మేడ కొనవచ్చు. శాంతిధామాన్ని కొనలే. మందులు కొనగలుగుతారు. ఆరోగ్యం కొనలేరు. విలాస వస్తువులను కొనవచ్చు. సంస్కారం, సంస్కృతి రాదు. మనిషి కేవలం ఆహారం తిని మాత్రమే బతకలేరు. అతనికి నలుగురి తో మాటమంతి కావాలి. తాను సుఖంగా ఉండాలి. ఇతరులు కూడా సుఖంగా ఉండాలని వాంఛిస్తాడు.
ఏమనిషికైనా ఆనందమే కోసమే శ్రమిస్తాడు. ఈ ఆనందం ఏ వస్తువు నుంచి రాదు. కాని ఒకరికి దేనినైనా ఇచ్చినపుడు ఆ వ్యక్తి ఆనందిస్తే వీరికి అపరిమితమైన ఆనందం లభిస్తుంది. అంటే త్యాగం ద్వారానే మనిషి ఆనందాన్ని చవి చూడగలడు. అపుడే శాంతిసౌధాలను నిర్మించు కోగలడు. కనుక జీవితాన్ని చ్చిన భగవంతుని స్మరిస్తూ ఉన్నదానితో తృప్తి పొందుతూ ఈ మానవజన్మను మరొకరికి ఉపకరించేటట్టు మలుచుకోగలిగితే జీవితం ధన్యం అవుతుంది. మానవజన్మ సార్థక్యం చెందుతుంది. అజ్ఞాన తమస్సునుంచి విడవడి యుగయుగాలుగా, జన్మ జన్మలుగా సాగే భువన జీవన రూపకానికి సరికొత్త భాష్యం చెప్పే వెలుగు కిరణం వైపు ప్రయాణించడమే అసలైన విజయంగా భావించాలి.

- వాణి ప్రభాకరి