Others

నాకు నచ్చిన చిత్రం.. దేవాంతకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1960లో విడుదలైన దేవాంతకుడు తెలుగులో వచ్చిన తొలి సోషియో ఫాంటసీ చిత్రం. బెంగాలీ నవల ‘జమలాయేజీ బంతో మానుష్’ ఆధారంగా సినిమా దర్శక నిర్మాత సి పుల్లయ్య రూపొందించారు. ఎన్టీ రామారావు, కృష్ణకుమారి జంటగా నటించిన చిత్రంలో అతిథి పాత్రలో యమధర్మరాజుగా ఎస్వీఆర్ ఆకట్టుకున్నారు. చిత్రగుప్తునిగా వంగర, విచిత్రగుప్తునిగా పేకేటి శివరామ్, మహావిష్ణువుగా కాంతారావు, లక్ష్మీదేవిగా మోహన, నారదుడిగా ఈలపాట రఘురామయ్యతోపాటుగా కెవిఎస్ శర్మ, హేమలత, మహంకాళి వెంకయ్య తదితరులు నటించారు.
మాటలు- సదాశివబ్రహ్మం, పద్యాలు, పాటలు- ఆరుద్ర సమకూర్చగా జి అశ్వద్ధామ సంగీతం అందించారు. లక్షాధికారి కూతుర్ని నాటకాల రాయుడైన కథానాయకుడు ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. అది నచ్చని లక్షాధికారి కూతుర్ని మరొకరితో పెళ్లి చేయడానికి గృహ నిర్బంధం చేస్తాడు. హీరో దెబ్బలు తిని, చనిపోయే స్థితిలో ఎవరో చెప్పగా హీరోయిన్ చెరువులో దూకుతుంది. అంతే! యమభకులు తప్పుడు చిరునామాతో హీరోను యమలోకం తీసుకెళ్తారు. అక్కడ యమలోకంలో హీరో యముడితో పోట్లాడి ఎద్దు సాయంతో ఆ స్థానాన్ని ఆక్రమిస్తాడు. యముడు శ్రీ మహావిష్ణువుని శరణువేడి నారదుణ్ణి రాయబారం పంపుతాడు. హీరోను ఓ వారంపాటు అన్ని లోకాలూ చూసి, గడువైన తరువాత రమ్మని చెబుతాడు. హీరో మందారమాల వేసుకుని ఇంద్రలోకం వెళ్లి ఆ తరువాత ఉమామహేశ్వరులను దర్శించి, తన భార్యను బ్రతికించమని అడగగా అదంతా శ్రీ మహావిష్ణువు చేతిలో ఉందని వారు చెబుతారు. తన మాటలతో శ్రీహరిని మెప్పించి, భార్యను బతికిస్తే మగవారి పరువు ఉంటుందని కథానాయకుడు విష్ణువును కోరతాడు. అప్పుడు ఆయన అతని భార్యను బ్రతికించి ఇస్తాడు. ఇదంతా ఓ కలగా సాగుతుంది. హీరో నిద్రలేచి హీరోయిన్‌ను రక్షిస్తాడు. ఉషాపరిణయం నాటకంతో మొదలై అదే నాటకంతో ముగుస్తుంది. రఘురామయ్య పాడిన రెండు పాటలు వినసొంపుగా ఉంటాయి. అలాంటి గాయకుడు భవిష్యత్‌లో పుట్టలేడు, పుట్టబోడు, ఇది సత్యం.

-పొందె లలిత, ఆదోని