Others

శ్రీ పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భక్తి నిమిత్తమై భగవానుని ప్రార్థింపుడనియు భక్తినే జీవితమునకు మూలముగా నొనర్చుకొనుడనియు వారితో బలుకుచుందును.
289. నీ (సంసార) యోగ క్షేమములు నీవి కావని సదా జ్ఞప్తి నుంచుకొనుము. అవి భగవంతునివి. నీవు వాని సేవకుడవు, వాని యాజ్ఞలను పరిపాలించుటకై నీవిచటికి వచ్చియున్నావు. ఈ భావన స్థిరమయ్యెనా, నరుడు తనదనుకొనదగిన బాధ్యత ఏమియు నుండదు.
290.మనసు భగవానునిపై నిలిపి సంసార ధర్మములనన్నిటిని నిర్వర్తించువాడే నిజమైన వీరుడు. బలాఢ్యుడు దక్క మరియొకడు రెండు మణుగులు బరువును తలమీద బెట్టుకొని మోయుచుండియు తనకెదురుగా నడుచున్న ఊరేగింపు ఉత్సవమును చూచి ఆనందించుటకై ఆగజాలడు.
291.సంసారులై యుండియు మోక్ష సాధనలను సాగించువారు కోటగోడల చాటునుండి పోరాడు యోధులవంటివారు. సంసారమును త్యజించి భగవదనే్వషణ చేయు సన్న్యాసులు బహిరంగంగా యుద్ధము చేయు భటులు బోలువారు. బహిరంగముగా పోరాడుకంటె కోటలోపలినుండి శత్రువులతో యుద్ధము చేయుట ఎక్కువ క్షేమంకరము, సుకరము.
292. బయటికి పోయి శత్రువునెదిరించి పోరుటకు పూర్వము యోధులు బార్కాసులలో బహిరంగముగా యుద్ధము జేయునపుడు గలుగు ప్రమాదములు లేని తావులందు- రణకౌశలమును నేర్చుకొందురు. అటులనే సన్న్యాసాశ్రమపు కఠిన నియమములను పూనుటకు పూర్వము ఆత్మోన్నతిని గడించుటకై మీ గృహస్థ జీవనపు సౌకర్యములను వినియోగించుకొనుడు.
293.ఎవని బుద్ధియు హృదయమును పూర్ణ వికాసమునంది సమత్వము నొందియున్నవో వాడే నిజముగా ధన్యాత్ముడు. అట్టివాడెక్కడనున్నను, ఏ పరిస్థితులలో నున్నను, ప్రశంసార్హముగా వర్తింపజాలును. ఆతడు దైవమునెడ వినిర్మల భక్తి విశ్వాసపూర్ణుడై యుండును. ఐనను పరులతో నాతని వ్యవహారములందెట్టి లోపమును గానరాదు. లోక వ్యవహారములను నిర్వహించునపుడాతడు దక్షుడు; పండిత సభలలో నాతడు విశేష విద్యావంతుడై ప్రకాశించును; వాదములలో అద్భుత యుక్తి నైపుణ్యమును బ్రదర్శించును; తల్లిదండ్రల యెడ విధేయుడై శ్రద్ధ్భాక్తులను జూపును; బంధు మిత్రుల యెడ హితవర్తనుడై ప్రేమానురాగములతో మెలగును; ఇరుగుపొరుగు వారియెడ దయాదాక్షిణ్యములు గలిగి పరోపకారమొనర్చుట కెప్పుడును సంసిద్ధుడై యుండును; భార్య యెడ ప్రేమంపు వేలుపై వర్తించును. ఇట్టి పురుషుడే నిజముగా సిద్ధాత్ముడు.
శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము - సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి
ఇంకావుంది..