Others

జీవితమొక అద్భుతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవితాన్ని అద్భుతమనండి, స్వేచ్ఛ అనండి. అంతేకానీ, అది అనిశ్చయమైనదనో, భద్రత లేనిదనో అనకండి.
నేను మీకు అంధవిశ్వాసాలను కలిగించను, భవిష్యత్తుకు సంబంధించిన వాగ్దానాలు చెయ్యను. ఎందుకంటే, మీరు పూర్తి రక్షణలో చాలా భద్రంగా ఉన్నారనే భావాన్ని అవి మీలో కచ్చితంగా కలిగిస్తాయి. ఎలాం టి భద్రత లేని, ఏ మాత్రం కచ్చితత్వంలేని, అనేక ప్రమాదాలతో కూడుకున్న జీవితం పట్ల మీరు ఎప్పుడూ పూర్తి ఎరుకతో, ‘ఇపుడు, ఇక్కడ’ అంటే వర్తమానంలో చాలా అప్రమత్తంగా ఎలా జీవించాలో చెప్తాను. అనేక భయాలతో కూడిన మీరు ఏదో కచ్చితత్వంతో కూడిన మతపరమైన విశ్వాసాలకు, సిద్ధాంతాలకు చెందిన సంప్రదాయాలపై ఆధారపడి జీవించేందుకు చక్కని చెరసాలను వెతుక్కుంటూ ఇక్కడకు వచ్చారని నాకు తెలుసు. ఎందుకుంటే, అపుడే మీరు ఏ మాత్రం ఎరుక లేకుండా జీవించగలరు. కానీ, నేను మీలో మరింత అభద్రతాభావాన్ని, మరింత అనిశ్చితిని కలిగించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే, జీవితం అలాగే ఉంటుంది. మీ దేవుడు కూడా అలాంటివాడే.
ఇంకావుంది...