Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృష్ణపత్నులు
ఐననొక్క సందిమ్ము మనము గలచివేయు
ఐననడుగుదామటన్న అలకలు పోయేరో!

శ్రీకృష్ణుడు
అలకలతో అలకలే? కనుల కొలుకులతో అలకలే?
అలుగుటన్న మీపైనను నాపై నే నలుగుటే!

అతివలార! మనమందున అనుమానం వలదు
అగ్నివోలె అంతరంగమది దహించివేయు

అడుగడుగుడి! మీ మనములనతి శీఘ్రమె కడుగుడి!
తడబడకను అడిగికొనుడి! అడిగిననే నుడివెద

కృష్ణపత్నులు
అవును గానిసీత యంత అందగెత్తనోరుూ?
కృష్ణయ్యను మించి రాముడందగాటోరుూ?

అనగానే అతడు నవ్వె నవ్వె దిక్కులెల్ల
నవ్వులలో పువ్వులవలె మెరిసెనతని మోము

శ్రీకృష్ణుడు
సీతవంటి అందగత్తె రామునివలె అందగాడు
లేనే లేరను మాటను లేమలు! వినలేదే?
పరిమళాల పూవు సీత! పారిజాత పుష్పము!
అందాలకె అందనిది! అందమనిన సీతమ్మే!

ఇంకావుంది...

-గన్ను కృష్ణమూర్తి.. 9247227087