Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకాశమె ఎగురలేక అవనిపైన ఒరుగును
వాయువైన ధాత్రి కొంగు పట్టుకు పారాడును

చినుకైనా మట్టిపొరల కునుకుతీయు నోరుూ!
పూవైనా పరిమళించి పుడమి రాలునోరుూ!

ఇది కాదో అవతారం?
ఇదె రహస్యసారం!

ధర్మమ్మే తానగుచును బ్రతుకువాడె యుగపురుషుడు
ప్రజల కొరకు తానంకితమైన వాడె మహత్ముడు

ధర్మరక్షణమ్ము కొరకు ధాత్రిని శ్రీకృష్ణుడు
పాపుల శిక్షించుటయే ఆతని ధ్యేయమ్ము

చేసెను రాముండటులే- చేయుదు నేనటులే
అతడు నడుచు దారిలోన- అడుగులిడుచునుంటిని

మారిపోయె యుగమ్ములే- మారెను యుగధర్మం
భగవానునికైన తరమె? ధర్మమ్మును మీరుట

కానమాదు దారులందు కనిపించును భేదం
కమనత వేరైన నేమి? గమ్యమ్మొకటేను!
రాముడు శాసించబడెను- కృష్ణుడు శాసించు
రాముడు తననెరుగబోడు- కృష్ణుడెరుగు తనను

ఇంకావుంది...

-గన్ను కృష్ణమూర్తి.. 9247227087