AADIVAVRAM - Others

ప్రసంగాల్లో ‘ఆణిముత్యాలు’..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సద్గురు జగ్జీ వాసుదేవ్ అనేక చోట్ల ప్రసంగాలు చేశారు. మానవాళికి అందించిన ఆయన బోధనలు ‘ఆణిముత్యాల’ల్లా ఉంటాయి. వాటిలో కొన్నింటిని చూద్దాం...
* ఆశలు పెంచుకోండి, వాటిని నెరవేర్చుకునేందుకు కృషి చేయండి. అల్పత్వాన్ని పెంచుకుని ఆశలు చంపుకుంటే జీవితంలో మీరు దేన్నీ సాధించలేరు.
* కోరికలకు హద్దు ఉంటే సంతోషంగా జీవిస్తారు. ఆశ ఉండాలి కాని అది అత్యాశగా మారకూడదు.
* మీ పిల్లలకు కోపం, అహంకారం లేని ఆనందమయ జీవితాన్ని ఇవ్వండి. అభిమానం, జాగ్రత్త వహించడం నేర్పించండి.
* మీ జీవితాన్ని మీరే అందంగా తీర్చిదిదుకోవాలి. మీ తప్పులను ఎదుటివారు ఎత్తిచూపితే సంతోషంగా స్వీకరించండి.
* మీ జీవితాన్ని మీ చేతిలోకి తీసుకోండి. దేవుడి చేతికి ఇవ్వకండి. అన్నీ దేవుడే చేయాలని ఆశించడం మంచిది కాదు. మనవంతు ప్రయత్నం మన చేయాలి. గాలిలో దీపం పెట్టి ‘దేవుడా రక్షించు..!’ అంటే వీలుకాదు కదా!
* మీ ప్రవర్తన, మీ నిర్ణయాలపై ఆధారపడి జయాపజయాలు ఉంటాయి. ఎవరో సాయం చేయాలని ఎదురు చూస్తూ కూర్చోకూడదు.
* ఎదుటివారిని ఎప్పుడూ తక్కువగా అంచనా వేయవద్దు. కించపరిచే విధంగా మాట్లాడవద్దు. ఎదుటివారి అభిప్రాయాలను గౌరవించడం సంస్కారం అవుతుంది.
* ఎదుటివారు మీ ఇష్టప్రకారం ఉండకపోయినా, మీ జీవితం మీ ఇష్టప్రకారమే ఉంటుంది.
* ఎదుటివారి జీవితంతో మీ జీవితాన్ని పోల్చుకోవద్దు. వివేచనతో వ్యూహరచన చేస్తే విజయం సాధ్యమవుతుంది. ఏ పనైనా గొప్పగా ఆలోచించి చేయాలి.
* మనిషి అన్నాక ఒక్కోసారి, ఒక్కోచోట, ఒక్కో విధంగా నడచుకోవాల్సి ఉంటుంది. మీలోని మంచితనాన్ని, అభిమానాన్ని మీరు పోగొట్టుకోకుండా జాగ్రత్తగా ఉండండి. ఏ పరిస్థితిలోనూ కోపం, ఈర్ష్య చూపించకండి. అప్పుడు ఎవరికీ భాధ కలగదు. మీ లక్ష్యాన్ని మీరు చేరుకోగలుతారు.
* ఎలాంటి పరిస్థితిలోనైనా మీపై మీకు పూర్తి నమ్మకం కలిగి ఉండండి. మీ సాయశక్తులా పనిచేయండి. అప్పుడే ఉన్నత స్థానానికి చేరుకోగలుతారు. మీ ఎదుగుదలను అప్పుడు ఎవరూ ఆపలేరు.
* యవ్వనంగా ఉండాలంటే బలమైన శరీరంతో పాటు దృఢమైన మనస్సు కలిగి ఉండాలి. ఎలాంటి స్థితినైనా ధైర్యంగా ఎదుర్కొండి. యోగ సాధనతో ధైర్యం వస్తుంది.
* భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుని జీవిస్తే జీవితం సవ్యంగా, సంతోషంగా ఉంటుంది. పట్టింపులకు పోకుండా, సర్దుకుపోతూ ఉండాలి.
* ఏ పనైనా సగం సగం చేయవద్దు. మీ అభివృద్ధి, సమాజ సంక్షేమం దృష్టిలో ఉంచుకుని పూర్తి చేయండి. ఆటలో ప్రవేశించకుండానే ముగింపు కావాలని ఆశపడవద్దు.
* అసూయకు, భయానికి చోటివ్వకండి. ఎదుటివారిలో చెడు చూడవద్దు. మీ మనస్సును, శరీరాన్ని పూర్తిగా ఉపయోగిస్తేనే గెలుపు సాధ్యమవుతుంది.
* మీ కోరికలను తీర్చాలంటూ వేడుకున్న తర్వాత దైవంపై నమ్మకం ఉంచండి. దైవంపై అనుమానాలు వద్దు.
* మీ మనస్సును ఎవ్వరూ చలింపచేయలేని స్థిరనిశ్చయ చిత్తులై ఉండండి. అప్పుడే కోరుకున్నదాన్ని సాధించగలుగుతారు.
* సంతోషంగా ఉండే మనుషులు మాత్రమే ఏ పనైనా హాయిగా, చక్కగా చేయగలుగుతారు. చిత్తశుద్ధితో పనిచేస్తేనే వృత్తిలో ఎదిగేందుకు వీలుంటుంది.
* బతికి ఉండటం వేరు. జీవించడం వేరు. ఒక్క క్షణం..ఒకే ఒక్క క్షణం పరిపూర్ణంగా జీవించినా చాలు. గులాబీ ఒక రోజు జీవించినా అందరూ దానే్న ఇష్టపడతారు. అలాంటి జీవితాన్ని కోరుకుంటే ప్రతిక్షణం ఆనందంగా గడపవచ్చు.
* కుటుంబ సభ్యుల మధ్య, స్నేహితులు, బంధువుల మధ్య ప్రేమ, అభిమానం, ఆప్యాయతలు ఉండాలి. ఇవే ప్రతి ఒక్కరికి శాశ్వతమైనవి. ముఖ్యమైనవి. ఆస్తులు, అంతస్తులు, హోదాలు శాశ్వతం కాదు.
* ఎదుటివారిని గౌరవంగా, అభిమానంతో చూడటం కన్నా గొప్పతనం ఏమీ ఉండదు. నాది.. అన్న పదం విడనాడి, మనది.. అన్న పదం పలికితే జీవితం పరిపూర్ణమవుతుంది.
* శాస్త్రాలు జీవితాలకు దారి చూపడానికి ఏర్పడ్డవి. జీవితాన్ని శాస్త్రాలకు అర్పించడం సముచితం కాదు. మీరు పవిత్రంగా, ప్రశాంతంగా ఉండటం నేర్చుకోవడం ముందు నేర్చుకోవాలి.
* అన్నీ కోల్పోయిన వాళ్లకు చేయూత ఇవ్వండి. మానవత్వం నుండి దైవత్వానికి ఎదగడానికి జీవితన్నా ఒక అవకాశంగా భావించండి.
* ప్రేమించడం తెలివైన విషయమని మీరు గుర్తించగలిగితే అంతకన్నా మేలైనది ఏదీ ఉండదు.
* భగవంతుడి పట్ల భక్తి ఉంటే చాలు. భయం అక్కర్లేదు.
* తెలివిగా బతకడం తెలిస్తే, దైవ సహాయం లేకుండా కూడా మీరు సుఖంగా బతకవచ్చు. బతుకు అంటే అర్థం చేసుకోకుండా, మూర్ఖంగా జీవిస్తే, పూజాగదిలో ఎన్ని దేవుళ్ల ఫొటోలు పెట్టుకున్నా లాభం లేదు.
* ప్రపంచాన్ని ఏలాలని కోరిక ఉండటం తప్పు కాదు. అందుకోసం శక్తివంచన లేకుండా పనిచేయాలి.
* ఆనందంగా జీవించడం మీ చేతుల్లోనే ఉంది. ఆనందం పోగొట్టుకోవడానికి మన ప్రవర్తనే కారణం అవుతుంది.
* మనస్సును ప్రశాంతంగా ఉంచుకుంటే చురుకుగా ఉండగలుగుతారు. యోగ, ధ్యానం వల్లనే ఇది సాధ్యమవుతుంది.
* మతగ్రంథాలు చదివినంత మాత్రాన జ్ఞానులు కాలేరు. వాటిలోని మంచిని అమలు చేయడమే జ్ఞానులు చేయాల్సింది.
* ఓడిపోతే కుంగిపోవద్దు. ధైర్యంగా మళ్లీ ప్రయత్నించండి.
* తప్పు చేస్తే నిజాయితీగా అంగీకరించి, తప్పును సరిదిద్దుకోండి. వాదించడం మూర్ఖత్వం అవుతుంది.
* గెలుపుకోసం అడ్డదారులు తొక్కవద్దు.
* మానసిక వత్తిడికి లొంగకుండా పనిచేస్తే ఆనందం మీ వెంటే ఉంటుంది.
* స్ర్తి, పురుషుల్లో ఒకరు ఎక్కువ, ఇంకొకరు తక్కువ కాదు. ఇద్దరూ పరస్పరం అర్థం చేసుకుంటే సజావుగా జీవితం సాగుతుంది.
* అత్యున్నత స్థాయికి చేరాలంటే మెట్లెక్కే వెళ్లాలి. తొలుత కష్టమైనా విజయం సాధించిన తర్వాత సంతృప్తి మిగులుతుంది.