Others

ఆచరణకే ప్రాధాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భరత భూమి కర్మభూమి. కర్మాచరణ పై మక్కువ ఉన్నవారు ఎక్కువగా నే ఉంటారు. భగవంతుడే అన్నింటికీ కారణమనుకుంటూ కర్మను మనచేత చేయంచేవాడు భగవంతుడే అనే కర్మసిద్ధాంతాన్ని నమ్మేవరు ఉన్నారు. చేయాల్సిన పనిని నీవు చేస్తే ఇవ్వవలసిన ఫలితాన్ని నేను ఇస్తాను అని గీతాచార్యుడు చెప్పాడు.
ఎంతో పుణ్యం చేసుకొన్న తరువాతనే పూర్వకర్మలను పూర్వ పాపాలను క్షయం చేసుకోవడానికి మానవ జన్మ లభిస్తుంది. అన్నిప్రాణి జన్మల్లోకి మానవ జన్మ దుర్లభమైంది. ఈ జన్మలో పాపాలు చేస్తే పాపం, పుణ్యకర్మలను చేస్తే పుణ్యం లభిస్తుంథి. కనుక ఈ జన్మలో ఏది మంచి ఏది చెడు ఆలోచించి పనులు చేయాలి.
భగవంతుడు సర్వవ్యాప్తి ఆయన లేని సృష్టిలో చోటే లేదు. అణువణువు ఆయన నివాసస్థానమే. ఆయన అనుక్షణం అన్నింటా, అంతటా వ్యాపించి వుంటాడు. ఇది కలియుగం కనుక ఇక్కడ సత్వ రజో తమో గుణాలయొక్క ప్రేరేపణతో మానవుడు పూర్తిగా కలుషితమై ఉంటారు. సత్వగుణులకు భగవంతుడు చేదోడునిస్తుంటాడు. రజ్తోమో గుణాలకు బానిస అయనవారు పాపపు పనులను చేయడంలో అభిలాషను కలిగి ఉంటారు. ఇట్టి కలుషితమైన వారికి అత్యంత పవిత్రుడు అయిన భగవంతుడు దర్శనం దుర్లభం. అరిషడ్ వర్గాలతో తనను తాను ముంచుకుని అందులోనే తేలుతూ, అందులోనే ఆనందం వుందని భ్రమిస్తాడు మానవుడు.
ప్రేమకు, నిర్మలత్వానికి, శాంతికి, అహింసకు, పవిత్రతకు, పరిశుభ్రతకు మారుపేరు భగవంతుడు. ఇవన్నీ ఎక్కడ వుంటే భగవంతుడు అక్కడ తప్పక నివసిస్తాడు. ఈ కర్మభూమిలో ఏ మానవుడు తనను తాను పవిత్రంగా, పరిశుద్ధంగా, ప్రశాంతంగా ప్రేమకు మారుపేరుగా తీర్చిదిద్దుకుంటాడో అతడే భగవంతుడికి మారుపేరుగా నిలుస్తాడు.
ఏ జంతువూ కూడా తన యొక్క లక్షణానికి విరుద్ధంగా ప్రవర్తించదు. కానీ ఒక్క మానవుడే తన స్వస్వరూపాన్ని మరిచిపోతాడు. తనంటో, తన జన్మకు కారణమేంటో అస్సలు ఆలోచించకుండా ప్రాపంచిక సుఖాలకు ఆకర్షింపబడి తన జన్మను వృథా చేసుకొంటాడు.అంతేకాక ఈ ప్రాపంచిక సుఖాలనే సత్యమని, ఇవే నిత్యమని శాశ్వతమనీ భ్రమిస్తాడు. ఆ భ్రమలోనేబతుకీడుస్తూ ఎప్పటికీ తాను నిలిచి ఉంటాడనే భ్రమలో కూరుకుపోతాడు కనుక వివేకంతో ఆలోచించి దుర్లభమైన మానవ జన్మను సార్ధ్క్యం చేసుకోవాలి. అపుడే మాత్రమే జన్మరాహిత్య స్థితి కలుగచేసుకోవాలి.
తపన, సంకల్పం, చిత్తశుథ్ధితో ప్రయత్నం చేస్తే భగవంతుడినే మెప్పించగలరు మాన వులు. ఇకనైనా మానవ జన్మకి అర్థం పరమార్థం తెలుసుకుని ఈ కలియుగంలో నిరంతరం మనసులో భగవత్ నామాన్ని జపిద్దాం. భగవత్ కృపకు పాత్రులమవుదాం.

- కూచిబొట్ల వెంకటలక్ష్మి