Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐన దాని నాటందురె? ఆట పేర మోసం!
శకుని కాదు కునిశవలె- చేసె శకుని ద్రోహం!

కారుమబ్బులను బోలుచు పోరినారు వెలుగులతో
కాని జయము అపజయమ్ము- దైవాధీనమ్ము

ఐన నేమి? తుది విజయం పాండవులకె దక్కు
ఎటనుండిన కృష్ణార్జునులటె విజయం దక్కు

వస్త్రాపహరణం
కృష్ణపత్నులు:
అది సరియే అతడోడెను- ఈతని పని యేమిటి?
కోడలనడు ధృతరాష్ట్రుడు- కొడుకులేమొ వదిన యనరు!

తనవారల సభకు నీడ్చి తామె పరువుతీతురె?
తమ పరువునె చేజేతుల తమకుతామె పూడ్తురె?

శ్రీకృష్ణుడు:
అవును నిజం! ఇది నిజమ్ము! నెనెంతో వగచితి!
అవును మనుజులే వారలు? మనుజులలో దనుజులు!

ఒక చీకటి రక్కసియై వెలుగు వలువలూడ్చినట్లు
ఒక శిశిరం ఆకురాల్చి ధాత్రి పరువుదీసినట్లు

ఒక మేఘం తన పిడుగుల ఒక భూమిని చీల్చినట్లు
ఒక దుష్టుడు పదుగురిలో చేసెనిట్లు దౌష్ట్యం
చూచితిరే ఏమైనదొ చివరకు ఆనాడు?
చూచినారు సభికులెల్ల చోద్యంగానపుడు!
ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087