Others

కుండలిని వర్ణములు ( శ్రీచక్రము, మానవ శరీరం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతులకు
7-8-51, Plot No. . 18, నాగార్జున సాగర్‌రోడ్, హస్తినాపురం, సెంట్రల్ కాలనీ, ఫేజ్ -2 హైదరాబాద్- 500079
=================================================================
‘అహమ్’ లో అకార హకార మకారములు మూడు వర్ణములున్నాయి. మకారమును బిందువు(0)గా భావనచేస్తే పై మూడు వర్ణములు, అ, హ, 0గా కనిపిస్తాయి. మంత్ర సంఖ్యానం ఈ మూడు వర్ణములను 1, 8, 0గా సూచిస్తుంది. ఆ విధంగా అహం అనునది 180 అయింది. మరియొక అన్వయమేమనగా అహమనేది ‘అ’కారము మొదలు ‘హ’కారము వరకు వర్ణరూపము బిందువుతో కలిసి పూర్ణ వస్తువైన ‘నేను’ ‘అహం’ అని స్వస్వరూపముగా పరమాత్మ చేత స్వీకరింపబడినదని భావన. ఆ విధంగా 1 నుండి 8 వరకు గల అంకెలు బిందువుతో కలిపి పూర్ణమై ‘‘అ(1) హ(8) సంస్కృత వర్ణమాలకు మరియు సంఖ్య ప్రపంచమునకు తలమానికముగా కనిపిస్తుంది. ‘అహం’ శబ్దమీవిధంగా తనదైన ప్రత్యేక ప్రతిపత్తిని కలిగియున్నది. అదేవిధంగా ప్రణవము అనబడే ‘ఓంకారము’ కూడా ‘ఓమ్’ను పదముగా భావించి విశే్లషిస్తే అ+ఉ+మ మంత్ర సంఖ్యను 1+3+5=9 సంఖ్యను నిరూపిస్తుంది. ఏకాక్షరంగా భావిస్తే దాని మంత్ర సంఖ్యానం అనంతంగా నిర్దేశిస్తుంది. పైన చెప్పినవిధంగా ‘అహం’ను కూడా పదం-వర్ణం అను రెండు విధములుగా చూచినపుడు, ఏకపదంగా దాని సంఖ్యాక విలువ 1+8+0=180-90 లేదా 1+8=9 లేదా 18. వర్ణాత్మకంగా భావిస్తే దాని సంఖ్యాక విలువ 9 అవుతుంది. సంఖ్యా శాస్త్ర ప్రామాణ్యతననుసరించి ‘అహం’ యొక్క సంఖ్యాన విలువ 180 అని ఎన్నో గణిత శాస్త్ర వౌలిక ప్రాథమిక తత్వములావిష్కరించాయి. భారతీయమైన సంఖ్యా శాస్తప్రరంగానే కాక అధ్యాత్మిక విషయపరంగా కూడా సనాతన వాఙ్మయంలో 18- సంఖ్యకు అట్లే 108 సంఖ్యకు చాలా ప్రత్యేకత కనిపిస్తుంది. ఇది మనకు తెలిసిన విషయమే. భారతీయ సంఖ్యామానం ఆధునిక విద్యాభ్యాసం చేసేవారికి పరిచయ దూరమైంది. దశగుణిత ప్రస్తారముగా పేరొందిన మనదైన సంఖ్యను పద్ధతినొకసారి పరికిద్దాము. అవి 1.ఏక, 2.దశ, 3.శత, 4.సహస్ర (వేయి), 5.అయుత(పదివేలు), 6.లక్ష, 7.ప్రయుత (పదిలక్షలు), 8.కోటి, 9.అర్బుద (పదికోట్లు), 10.అబ్జ, 11.ఖర్వ, 12.నిఖర్వ, 13.మహాపద్మ, 14.శంఖు, 15.జలధి, 16.అంత్యము 17.మద్యము, 18.పరార్థము. ఒకటి (క) నుండి పరార్థము వరకు అనగా ఒకటి ప్రక్కన 17 సున్నలు కలదిగా చెప్పబడినది. అంతేకాదు పరను మరల ఒకటి తరువాత 35 సున్నలు కలదిగా చెప్పి దానిని మరల ఏకాదష్టాంత (1 నుండి 8 వరకు గల) అంకెల ప్రస్తారముగా గ్రహించి దానిని పరార్థమని, అనగా వరస సంఖ్యలో సగభాగమని ఈశ్వరాంశలో సగభాగమని దిఙ్మత నిర్దేశముగావించిరి.అదేవిధంగా లంబకోణమితి 90 మొదలగు గణిత వాస్త్ర ప్రాథమిక తత్త్వములను సూక్ష్మేక్షికతో దర్శించవచ్చునని శ్రీ సద్గురు కళ్యాణానంద భారతీ మాంచార్య మహాస్వామివారి ‘పూర్ణ మీమాంసా దర్శనము’ అను గ్రంథమున వివరించింది. సంఖ్యా ప్రపంచమునకు మూలము ‘బ్రహ్మమనియు’ బ్రహ్మము లేక పరమాత్మకు ప్రాతినిధ్యము వహించుచున్న నవ (9) సంఖ్య నుండియే మిగిలిన అంకెలు సంఖ్యలు ఆవిర్భవించినవని తెలిపిరి. ఉదాహరణకు 2 అనే అంకెను విశే్లషిస్తే 2=11=9+2. ఆ విధంగా రెండు వెనుకనున్న తత్త్వ సంఖ్య 9 అని చెప్పవచ్చు. అలాగే 3ను విశే్లషిస్తే 1, 2=12=9+3. ఇక్కడ కూడా3కు వెనుక 9 తత్త్వ సంఖ్యగా కనిపిస్తుంది. అదేవిధంగా 1 (ఒకటి అంకె) విషయంలోను యిలా నిరూపింపబడింది. 1=1, 0=10=9+1 కాగా 1కి వెనుక నవ (9) బ్రహ్మతత్త్వముగా మూలస్తంభముగానున్నదని భావము. పై విధముగా చూచినపుడు సంఖ్యా ప్రపంచానికి ‘నవ’ సంఖ్య అంతర్యామిగా భాసించుచున్నదని తెలియుచున్నది. దీనిని జీవ ప్రపంచానికి సమన్వయం చేసి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత యందు చెపిప్న ఈ క్రింది శ్లోకాన్ని (ఈశ్వరః సర్వభూతానాం, హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని, యంత్రారూడానిమామయా’’- పై సిద్ధాంతానికి వ్యాఖ్యానంగా భావించవచ్చు.
ఇక సున్న గురించి ఒకింత పరిశీలిద్దాము. దీనిని శూన్యాంకముగా వ్యవహరిస్తారు. దీని స్వభావం రెండు విధాలుగా చెప్పబడింది. మొదటిది తనదైన అస్తిత్వమేమాత్రము లేనిది రెండవది లెక్కకందని సూక్ష్మతమము, అనగా ఉపేయింపదగిన పరిమాణ విలువ కలిగినది ఈ తత్త్వము గురిచి ఉపనిషత్తులిట్లు ప్రతిపాదించాయి. బ్రహ్మమును వర్ణిస్తూ ముందు లేదు, వెనుక లేదు, కుడివైపు లేదు, ఎడమవైపు లేదు, పైన లేదు, క్రింద లేదు అని చెబుతుంది. ఈ భావన కూడా నొకటొకటిగా విశే్లషిస్తే, ముందు లేదు అంటే వెనుకనున్నదనే విషయం స్ఫురిస్తుంది. అట్లే వెనుక లేదంటే, ముందున్నదనే విషయం స్ఫురిస్తుంది. ఈ విధంగా విశే్లషిస్తూ పోతే ‘బ్రహ్మము’ అంతటా నిండి నిబికీకృతమైనదిగా తెలుస్తుంది. ఈభావాలు అవిద్యాపరంగా కూడా వ్యాఖ్యానింపబడ్డాయి. అవిద్య అంటే మిథ్యాజ్ఞానమే. పరమార్థ జ్ఞాన దృష్టితో చూస్తే మహత్వమేమాత్రము లేని మిథ్యాజ్ఞానము కావున నది ఉపేక్షింపదగినది అని తెలుస్తోంది.
ముగింపు: రేఖా, పద, బీజ, సంఖ్యా ప్రపంచములన్నియు నిత్యము, శాశ్వతము, పరము, పూర్ణమ, బ్రహ్మము అని కీర్తింపబడుచున్న ఒకే మూల కారణమునుండి వెలువడిన, వృత్తము, సంవృత్త, అకారము, ప్రణవము, అనంతములని తెలియుచున్నది. వేదాంతపరంగా చూస్తే కారణ బ్రహ్మము పూర్ణము- అనంతము అయినట్లే, కార్యరూపమైన జగత్తు కూడా పూర్ణము అనంతముల చేతనే సూచించబడుతోంది. కాబట్టి కారణ బ్రహ్మమే కార్య బ్రహ్మముగా జగద్రూపమున ఆవిర్భవించినదని తెలుసుకోవాలి. (్దళ యఇళషఆజ్పళ ఔ్య్య్ఘౄ జఒ ఆ్దళ ళచిచిళషఆ యచి ఒఖఇళషఆజ్పళ ఔ్య్య్ఘౄ) కారణ బ్రహ్మమును (జీవుడు) జష్యూష్యఒౄ గాను, కార్యబ్రహ్మమును (జగత్తు) ఘష్యూష్యఒౄ గాను భావిస్తే అవి రెండూ ఒకే పూర్ణబ్రహ్మము యొక్క పూర్ణత్వ ప్రతిపాదకములని తెలుస్తోంది. అదే విధంగా జీవుడు, జగత్తు- పిండాండ, బ్రహ్మాండములు రెండును ఒకే పూర్ణములో లయిస్తాయని అర్థవౌతోంది. అంటే పూర్ణమెల్లప్పుడు పూర్ణముగానే భాసిస్తోంది. ఈ విషయాన్ని వేదమాత పరమపవిత్రమైన శాంతిమంత్రంగా గొంతెత్తి చెబుతోంది చూడండి.
‘‘ఓం పూర్ణ మదః పూర్ణమిదం పూర్ణాత్పూర్ణ ముదచ్యతే
పూర్ణస్య పూర్ణ మాదాయ పూర్ణమేవా వశిష్యతే’’ - కారణ వస్తువైన బ్రహ్మము కార్యరూపమైన జగత్తుగా పరిణమించడాన్ని ‘వివర్తన’మంటారు. అట్టి వివర్తనం జగత్తులేక ప్రపంచమని సంభవింపబడుతోంది. తిరిగి యిట్టి వివర్తమే పద బీజ, సంఖ్యా, రేఖాత్మకమనబడే నాలుగు ప్రపంచములుగా బ్రహ్మమునందు భాసించుచున్నది. తిరిగి యిట్టి ప్రపంచ ప్రబేధములెన్నియైనను బ్రహ్మమునందే లయించును. కావుననే బ్రహ్మమెప్పటికిని అనంతము, పూర్ణము పరము, అద్వితీయమనబడుచున్నది. అమెరికాలో నివసిస్తున్న భారతీయ శాస్తవ్రేత్త డా.హరగోవింద ఖురానా, గుణాణువులయొక్క వౌలికమైన గుణాలను ప్రతిపాదించారు. యోగసాధనతో ఆధ్యాత్మిక చరమస్థితి అద్భుతాలకు చేర్చే కుండలిని శక్తి జాగృతి విషయంలో, రుూ గుణాణువుల సిద్ధాంతమెంతగానో ఉపకరిస్తుందనే విషయం, ఆధునిక శాస్త్రానికి పట్టకపోవచ్చు. కాని, మన శరీరంలో ఉన్న అసంఖ్యాకమైన కణాలులో కేంద్రకము వున్నది, ఈ కేంద్రకములో క్రోమోజోమ్స్ వుంటాయి. క్రోమోజోమ్స్‌లో జీన్సు ఉంటాయి. జీన్సులో గుణాణువులు ఉంటాయి. మన శరీరంలోని ప్రతి అవయవంలో అసంఖ్యాకమైన కోశికలు ఉంటాయి. వీటిలో పైన చెప్పిన గుణాణువుల యొక్క సాపేక్ష అమరిక శరీరాన్ని నిర్మించే కోశికలయందు పరస్పరంగా తదనుగుణమైన గుణాలనుద్భవింప చేస్తూ, మనలో ఆ గుణాలనే కలుగజేస్తాయి.
జీన్సులో సర్పాకృతి (ఒక మెలిక) మాదిరిగా వుండే ‘గుణాణువుల’ సాపేక్ష అమరికనుబట్టి, మానవుని లక్షణాలుంటాయి. అందువల్లనే చాలావరకు ఒక్కొక్కరి లక్షణాలు ఒక్కొక్క విధంగా వుంటాయి. కాబట్టి గుణములు లేక సంస్కృత భాషలో ‘‘కుండల్’’అంటే సర్పాకృతి అని అర్థం. పైన చెప్పిన గుణాణువులు చలించే మార్గమొక సర్పాకృతిని పోలి ఉంటుంది. ఆ కుండలములోనున్న సాపేక్ష శక్తినే యోగశాస్తమ్రులో ‘‘కుండలిని’’అంటారు. మన ప్రాచీన భారతీయ విజ్ఞానమెంత వున్నతమైనదో గమనించండి. మన సనాతన ఋషి పుంగవులకు, మానవ శరీరమందలి కోశికలు, వాటి యందలి గుణాణువుల సాపేక్ష అమరిక, తత్సంబంధమైన విషయ విజ్ఞానము మొదలగు అనేక విషయాలకు సంబంధించిన అనేక అద్భుత రహస్యముల గురించి బాగుగా తెలియునని స్పష్టవౌతున్నది. కుండలినీ శక్తి శరీరమంతటా నిండి యున్న కోశికలందలి గుణాణువుల అమరికతో కూడియున్నదని తెలుసుకున్నారు. కుండలినీ శక్తియోగ ప్రక్రియద్వారా జాగృతమైనప్పుడు, మన శరీరమందు కొన్ని చర్యలు(స్థితులు) అనుభూతమగును. ఉదాహరణకు కొన్ని పరిశీలిద్దాము. కుండలిని జాగృతమయ్యేటప్పుడు సాధకుడైన యోగి శరీరమందలి, కోశికలలో ప్రవహించే విద్యుత్ ప్రవాహము, నాలుగు రకాలుగా ఉండునని చెప్పబడింది. 1) పిపీలికము (చీమ) 2) దర్దూరము 3) సర్పము 4) విహంగము. కుండలిని యొక్క అధిక సమాచారముకొరకు వైదిక్ విశ్వప్రచురణలు హైదరాబాదు వారిచే ప్రచురించబడిన, యోగాచార్య ‘కాకాజీ’గారి ‘కుండలిని’ గ్రంథమును పరిశీలించగలరు.

డా॥ గుడిపాటి వి.ఆర్.ఆర్.ప్రసాద్ 9849560014