Others

మంగళకరుడు మహాశివుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శివ శబ్దం మంగళం, శాంతి, శుభం, క్షేమం ఇలా ఎన్నో అర్థాలనిస్తుంది. క్షీరసాగరాన్ని అమృతో త్పాదన కోసం మథించినపుడు ముందుగా లోకాలన్నీ తల కిందులైయ్యేట్టుగా హాలాహలం పుట్టుకొచ్చింది. ఆ అగ్ని విస్ఫోటనాన్ని చూసి దేవతలు రాక్షసులు గగ్గోలెత్తారు. కాని మహాదేవుడు తానే ముందుకు వచ్చి ఆ హలాహలాన్నంతా తన పుక్కిట పట్టుకున్నాడు. తాను గరళం మింగి లోకాలకు ఆనందాన్నిఅమృతాన్నిచ్చిన శివుడు మంగళకరుడే కదా.
ఆ సమయంలో అందరూ పార్వతీ దేవి దగ్గరకు పరుగెత్తి అమ్మా శివుడు గరళాన్ని పుక్కిట పట్టాడు అంటే మరేం ఫర్వాలేదు. శివుడున్నచోట భయమే లేదు అన్నింటికీ కారణాకారుణుడు ఆయనే కదా అని తన మాంగల్యాన్ని కళ్లుకద్దుకుంది. ఆ హాలాహలమంతా శివుని గొంతున చేరీ చేరగానే ఆ శివ కంఠం నీలంగా మారింది. లోకాలన్నింటికీ భద్రతను పొందాయ. అందరూ శివుణ్ణి నీల కంఠునిగా కీర్తించారు.
మరోసారి బ్రహ్మవిష్ణువులనే అహంకార మదన్మోత్తులయ్యారు. వారిలోవారికి స్పర్థ పెరిగింది. నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకున్నారు. వారిద్దరి అహంకారాన్ని దూరం చేయడానికి పరమేశ్వరుడు నిలువెత్తు మూర్తిగా ఆవిర్భవించాడు. జ్వాలాయమానంగా వెలిగే పోయే ఆ స్తంభం మేమిటో బ్రహ్మవిష్ణువులు తెలుసుకోలేకపోయారు. ఈ ఆకారం వారికి పరిష్కరించలేని సమస్యగాతయారు అయంది. వెంటనే వారు ఈ దేదీప్యమానంగా వెలిగిపోయే ఈ స్తంభాకారం మొదలు తుది తెలుసుకొన్నవారిని గొప్పవారిగా భావించాలనుకొన్నారు. వెంటనే బ్రహ్మ లింగాకారం యొక్క పైభాగానికి , మహావిష్ణువు క్రింది భాగానికి అంటే ఊర్థ్వ అధోలోకాలకు బయలుదేరారు. వారిద్దరికీ ఎంతవెతికినా ఆ లింగాకార తుదిమొదలు తెలియలేదు. అపుడు మహావిష్ణువు లో అహంకారం నశించింది. అందరికన్నా , అన్నింటికన్నా ఆద్యుడు ఆధిక్యుడు పరమేశ్వరుడే అనుకుని వెనుక తిరిగి బయలుదేరిన చోటుకువచ్చాడు. అపుడే బ్రహ్మ కూడా అక్కడికి వచ్చాడు.
ఆదిమధ్యాంత రహితుడైన పరమేశ్వరుడు తప్ప దీన్ని కనుగొనువారు లేరు. నాకు బుద్ధి వచ్చింది. పరమేశ్వరుడిని నేను శరణు జొచ్చాను అని మహావిష్ణువు అన్నాడు. బ్రహ్మ మాత్రం చిరునవ్వుతో చూస్తూ అదేమీ లేదు. నేను ఈ లింగాకారం యొక్క తుదిని చూశాను అని అన్నాడు. అంతే అక్కడికి పరమేశ్వరుడు రౌద్రుడై వచ్చాడు. రుద్రుడిని చూసి ఎంతో ఖిన్నులైన వారిద్దరూ నోట మాట లేక నమస్కరించారు.
కాని రుద్రుడు అమితకోపావేశుడై బ్రహ్మను అబద్ధం చెప్పినందుకు శిక్షించాడు. అజ్ఞానాన్ని వదిలిన బ్రహ్మ తన తప్పును మన్నించమని వేడుకున్నాడు. భక్తసులభుడైన శంకరుడు బ్రహ్మను క్షమించాడు. మహావిష్ణువు పరమేశ్వరునికి శరణునన్నాడు. వారిద్దరినీ సర్వ లోకాలను కరుణార్థ్రపూర్వకంగా చూసి అందరికీ శుభం కలుగు గాక అని ఆశీర్వదించాడు కరుణాంతరంగుడు మహాశివుడు.

- కె. వాణి ప్రభాకరి