Others

నిదురపోరా తమ్ముడా (నాకు నచ్చిన పాట )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1955లో విడుదలైన ‘సంతానం’ చిత్రంలో ‘నిదురపోరా తమ్ముడా’ పాట నాకు వల్లమాలిన ఇష్టం. ఇప్పటికీ ఆ పాట ఎక్కడవిన్నా, చానెల్‌లో చూసినా మనసు ద్రవించి కళ్లవెంట నీళ్లు సుడులు తిరుగుతాయి. పాట నేపథ్యాన్ని గుర్తు చేసుకుంటే -కుటుంబ భారం మోయలేక ముగ్గురు పిల్లల్ని విడిచిపెట్టి తండ్రి (ఎస్వీఆర్) ఎక్కడికో వెళ్లిపోతాడు. పెద్దదైన అక్క (జూనియర్ శ్రీరంజని) తన ఇద్దరు తమ్ముళ్లను సాకుతుంది. ఒకసారి చిన్న తమ్ముడు పొయ్యి దగ్గరకు వెళ్లి చేయి కాల్చుకుంటాడు. అది చూసిన అక్క పరుగున వచ్చి రక్షిస్తుంది. ఈ సందర్భంలో ఏడుస్తున్న పిల్లాడిని ఒడిలో పెట్టుకుని -కుటుంబ కష్టానే్న జోలపాటలా పాడుతుంది. మొదటి చరణంలో బతకు కష్టాన్ని గుర్తు చేసుకుంటూ -‘నిదురలోన గతమునంత నిమిషమైన మరచిపోరా /కరుణలేని ఈ జగాన కలత నిదురె లేదురా/ కలలుపండె కాలమంత కనులముందె కదిలిపోయె/ లేత మనసుల చిగురుటాశ పూతలోనె రాలిపోయె.. అంటాడు పాట రచయిత అనిశెట్టి. రెండో చరణంలో -‘జాలి తెలిసి కన్నీరు తుడిచె దాతలే కనరారే/ చితికిపోయిన జీవితమంతా ఇంతలో చితి ఆయె/ నీడ చూపె నెలవు మనకు నిదురయేర తమ్ముడా.. అంటాడు. సన్నివేశానికి తగ్గట్టు కవి రాసిన ఆర్తికి సంగీత దర్శకుడు సుసర్ల దక్షిణామూర్తి బరువైన బాణీని అందిస్తే, ఆ బాణీని తన గొంతులో అద్భుతంగా పలికించి మరింత గుండె బరువెక్కించారు లతా మంగేష్కర్. లత పాడిన మొదటి తెలుగు పాట ఇదే. ఆ రోజుల్లో ఈ పాట ప్రతివారి నోట నానడానికి కారణం పాటలో విషాద ఛాయలు ఎక్కువగా ఉండడమే. చిత్రంలో పెద్ద తమ్ముడి పాత్రలో ఏయన్నార్, చిన్న తమ్ముడిగా చలం, మిగతా పాత్రల్లో సావిత్రి, రేలంగి, రమణారెడ్డి, అల్లు నటించారు. ‘చల్లని వెనె్నలలో, చక్కని కనె్న సమీపములో’, ‘దేవి, శ్రీదేవి నను లాలించి పాలించి ననే్నలినావె’ అనే హిట్ సాంగ్స్ సంతానం లోనివే.

-పీఎస్ రాజు, కందుకూరు