Others

ఎంతటి చిత్రమో కదా....!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిడికిలి బిగించి కను తెరుస్తూ
స్వప్నాలన్నీ సాధించేయాలని
ఆశయాల సాధనా సమరంలో
ఉరకలెత్తే ఊపిరవ్వాలని ఉవ్విళ్లూరుతూ...

ఊత మొదిలి ఉరుకులు పరుగుల గాడిలో
జీవితపు పరీక్షల పాఠాలు,
పాఠాల పరీక్షల చట్రంలో
ఉన్నవాటిని ఖారు చేయక
లేని వాటికై వెంపర్లాడుతూ...

నిన్నా మొన్నటితో గబ్బిలమై
రేపటిలోని ఊహా రూపానికి
హంగూ ఆర్భాటాలు అలంకరిస్తూ
నేటిని.. నిజాన్ని... మరచిన చిత్రమైన మాయాజాలపు బంధితులు
ఊతకర్ర మూడో చేయగా మొలచిన
చమురు అడుగంటుతున్న వత్తియైనా
అరిషడ్వర్గాలను జయంచలేక
స్వార్థపు పంకంలో ఈదులాడుతూనే
చేతులు పైకెత్తి మట్టిలో మట్టై కనుమరుగవుతారు!

రెప్పలు తెరిచిన గడియ నుంచి
రెప్పలు మూసే
చుక్కల తీరం చేరే లిప్తపాటులో...
ఈ తోలుతిత్తి చేసే బ్రతుకు చిత్రాలు...
బహు చిత్రమైనవే కదా!!

- విజయలక్ష్మీ నాగరాజ్, 9966559567