Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాల్యమంచు మీ తప్పుల దాచుకొనిన నేమందుము?
బాలకులే ఈనాటికి బాలకులే లెండి మీరు!
రాధామాధవం
శ్రీకృష్ణుడు:
ఇదిగో! ఈ నిష్ఠురంపు మాటలేల నోరుూ?
నా తప్పును నా ముఖానె్న అడిగి కడిగి వేయుడి!

కృష్ణపత్నులు:
అడుగుటకిట ఏమున్నది? కడుగుటకిట ఏమున్నది?
శ్రీకృష్ణుని లీలలంచు సరిపెట్టుకునున్నారము

‘‘కృష్ణా! కృష్ణా’’! యటంచు తిరుగమేము మీ చుట్టును
‘‘రాధా! రాధా’’! యటంచు పరుగెత్తరె మీరు?

రాగమ్మో? సరాగమ్మొ? ప్రేమయొ? ఆరాధనయో?
ఏమో? మరి ఏమో అది? వివరించగ వలయు.

వచనం:-
అంతవరకు నవ్వుతూ, నవ్విస్తూ, ఉల్లాసంగా, ఉత్సాహంగా, మాటలాడిన శ్రీకృష్ణుడు ఉన్నట్లుండి ఒక్కసారిగా వౌనం వహించాడు. ఉలకబోడు! పలకబోడు! కళ్ళుమూసికొని, వౌనముద్ర దాల్చి, ధ్యానమగ్నుడై పోయాడు. ఆ అంతరిక్ష వృక్షం క్రింద.
ఈ హఠాత్పరిణామానికి వారంతా ఆశ్చర్యపోయారు. ముఖాలు చూసుకున్నారు. సంజ్ఞలు చేసుకున్నారు.
‘‘తప్పును చేశామా? హద్దులు మీరామా? ప్రాణవల్లభుని మనసును నొప్పించామా’’?అని వారిలోవారు తర్కించుకున్నారు.కానీ, ఎంతటికీ వౌనముద్రలోంచి బయటపడలేదు కృష్ణుడు.

ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087