Others

తెలుగు నేలపై శైవమతాదరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం మల్లికార్జునునికి, చంద్రగ్తుడు అనే రాజు బంధువైన చంద్రవతి ప్రతిష్ఠించినదని చెపుతున్న గుప్త మహేశ్వర ఆలయ శిథిలాలు, నేటికీ శ్రీశైల ఉత్తర ద్వార క్షేత్రమైన ఉమా మహేశ్వరానికి ఉత్తరాన ప్రతాపరుద్ర కోటకింద వాయవ్య మూలానై రోడుకు దక్షిణాన ఉన్నాయి. శ్రీశైల మల్లికార్జునుడు విష్ణుకుండినుల కాలంలోనే బహుళ ప్రచారం పొందాడు. గోవింద వర్మ అనేక దేవాలయాలు కట్టించాడు. 2వ మాధవ వర్మ అనేక రామలింగేశ్వరాలయాలు కట్టించాడు. గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి తాలూకా వేల్పూరులో, ఈఊరులో, కీసరగుట్టలో రామలింగేశ్వరాలయాలు నేటికీ దర్శనీయ స్థలాలే. తూర్పు చాళుక్య 2వ విజయాదిత్యుడు 108 విజయాలకు గుర్తుగా 108 భీమేశ్వరాలయాలు నిర్మించాడు. జైన మతం విష్ణుకుండినుల కాలంలోనే దాదాపు కనుమరుగు కాగా, జైన ఆలయాలు శివాలయాలైనాయి. అలంపురం విష్ణుకుండినుల కన్నా ముందువారైన ఇక్ష్వాకుల నుంచే మనుగడలో ఉండేదని శాసనాధారంగా ఉంది. వేములవాడ చాళుక్యులు, వేములవాడలో నిర్మించిన రాజరాజేశ్వరాలయం తెలంగాణలోని ప్రముఖ శివాలయం. బద్దెగ (క్రీ.శ.850-895) వేములవాడలో బద్దిగేశ్వర (్భమేశ్వర) ఆలయాన్ని నిర్మించాడు. క్రీ.శ.7వ శతాబ్ది శాసనంలో శివమండల దీక్ష ప్రసక్తి ఉంది. శ్రీశైలం, అలంపురం, బెజవాడ, పిఠాపురం నాటి శక్తి పూజా కేంద్రాలు. బసవేశ్వరుడు (క్రీ.శ.1100-70) వీర శైవోద్యమాన్ని ప్రారంభించాడు. అనంతరం మల్లికార్జున పండితుడు శైవాన్ని ప్రచారం చేశాడు. చాళుక్య భీముడు ద్రాక్షారామంలో భీమేశ్వరాలయం నిర్మించాడు. భీమవరం, పాలకొల్లు, అమరావతి ఆలయాలు చాళుక్య నిర్మాణాలే. యుద్దమల్లుడు బెజవాడలో కుమారస్వామి, 2వ విక్రమాదిత్యుని భార్య మహాదేవి, పట్టడకల్‌లో శైవాలయాన్ని నిర్మించారు. రాష్టక్రూటుల కాలంలో ఎల్లోరా గుహలు మలుచ మడ్డాయి. కైలాసనాథ ఏకశిలాలయం మొదటి కృష్ణుని అద్భుత సృష్టి. కాలాముఖి, కాపాలిక తెగలు ప్రచారంలోకి వచ్చాయి. కాకతీయులు కాకతి మాతృదేవతారాధుకులుగా అభిప్రాయాలున్నాయి. గ్రామదేవతయైన ఏకవీర ఆరాధన నాడు బహుళ ప్రచారంలో ఉంది. వీరికాలంలో జైన,బౌద్ధ,వీరశైవుల మధ్య ఘర్షయలు తారాస్థాయికి చేరాయి. ఇందుకు భిన్నంగానే తిక్కన హరిహర తత్వాన్ని బోధించాడు. కాళేశ్వరంలో శివలింగ ప్రతిష్ఠ చేసింది 2వ ప్రోలరాజు గురువైన రామేశ్వర పండితుడు. కాకతీయ పరిపాలనలో ధర్మపురి, అనుమకొండ, ఐనవోలు, పానగల్లు, నందికంది, శనిగరం, పుష్పగిరి, అమరావతి, సామర్లకోట, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం గొప్ప శైవక్షేత్రాలు. ఏకామ్రనాథుని ప్రతాపరుద్ర చరిత్రలో కాకతీయుల కాలంలో 5500 శైవాలయాలు, 1300 వైష్ణవాలయాలు, 2400 మల్లారదేవుని గుళ్ళు...్భరవ, దుర్గ, గణపతి దేవుళ్ళవి కలిపి 4400 గుడులు ఉండేవని స్పష్టమవుతున్నది. వెలమరాజుల కాలంలో కాళిక, దుర్గ, చండి, భద్రకాళి, మహిశాసుర మర్ధిని, కట్టమైసమ్మ, ముత్యాలమ్మ, మారెమ్మ, ఏకవీర దేవతల ఆరాధన ఉన్నట్లు తెలుస్తున్నది.

సమాప్తం

- సంగనభట్ల రామకిష్టయ్య