Others

ఎవరిని నమ్మాలి..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజానికి రెండు కాళ్లే ఉంటాయి.. అబద్ధానికి ఆరుకాళ్లు ఉంటాయి.. అని అంటారు పెద్దలు. నిజం నెమ్మదిగానూ, తిన్నగానూ నడిస్తే- అబద్ధం అంగవంగలతో వంకర టింకరగా నడుస్తుందని అంటారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చిత్రం, అందులో వివిధ రాజకీయ పక్షాల కుతంత్రం చూస్తుంటే పెద్దలు చెప్పిన ఈ మాటలే గుర్తుకొస్తాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన ఎలా జరిగిందో.. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో సీమాంధ్ర ప్రజలందరికీ తెలుసు.
కొత్త రాష్ట్రాన్ని కట్టుబట్టలతో, రూ.16 వేల కోట్ల ఆర్థిక లోటుతో ఎలా రోడ్డుకీడ్చారో తెలుసు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్రజాస్వామిక విధానాలను ఖండించి, 2014 సార్వత్రిక ఎన్నికల్లో ‘తల్లిని చంపి, బిడ్డను బతికించారు’ అని చెప్పిన ప్రధాని మోదీ మాటలను సీమాంధ్ర ప్రజలు ఎప్పటికీ మరచిపోలేరు. అలనాడు రోడ్డున పడేసినవాళ్ళు ‘ప్రత్యేకహోదా ఇచ్చి తీరుతాం’-అని అంటుంటే సీమాంధ్రులు నమ్మక తప్పని దుస్థితి ఏర్పడింది. ఆదుకుంటామని అరివీర భయంకర ప్రగల్భాలు పలికినవారు ఆదుకోకపోగా, ఇక్కడి ప్రభుత్వమే ‘అడ్డంకి’ అనడాన్ని కొందరు నమ్ముతున్న దుస్థితి. నవ్యాంధ్రలో అమలుకాని హామీలు, సవాలక్ష సమస్యలు కనిపిస్తున్నా.. అన్నీ ‘ఇచ్చేశాం’, ‘చేసేశాం’ అని కేంద్రంలో పెద్దలు అంటున్నారు. విభజన నాడు ఏమీ ‘ఇవ్వనివాళ్ళు’ ఇపుడు సభలు పెడుతుండగా జనం ఆశగా వెళుతున్నారు. చివరకు వారు గాని, వీరు గాని ఎలాంటి భరోసా ఇవ్వడం లేదు.
అధికారంలోకి వచ్చిన తెదేపా ప్రభుత్వం రైతులకు రుణమాఫీ హామీలో రూ.24 వేల కోట్ల మాఫీని 5 విడతలుగా ప్రకటించి అందులో 3 విడతలుగా దాదాపు 11వేల కోట్లు జమ చేసింది. కొందరు విపక్ష నేతలు 4వ, 5వ విడత రుణమాఫీ ఏదీ? అని అంటారు. అన్ని రకాల పెన్షన్లను తెదేపా ప్రభుత్వం పెంచగా, ప్రతిపక్ష పార్టీ నేతలు తమ ‘నవరత్న’ హామీలను దొంగిలించారని ఎదురుప్రశ్న వేస్తారు. 34 వేల భూములను రైతులు రాజధాని నిర్మాణం కోసం త్యాగంచేస్తే, పంట భూములను బలవంతంగా లాగేసుకుంటారా?అని ప్రచారం చేస్తారు. వందేళ్ల నాటి పోలవరం సాగునీటి ప్రాజెక్టు కలను 64% పూర్తిచేస్తే, ఈ ప్రాజెక్టకు పునా దులు లేవంటారు. పోలవరంపై కేసులు వేసిన వాళ్ళకు స్వాగతాలు పలుకుతారు ఇంకొందరు. కడప ఉక్కు ఫ్యాక్టరీని మేమే కట్టుకుంటాం అంటూ ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తే... ఆ ఏముందిలే.. అంటూ పెదవి విరుస్తారు. నిరుద్యోగ భృతిని రూ.2,000లకు పెంచినా ఎంతమందికి ఇస్తున్నారు...? అని అడుగుతారు. డ్వాక్రా మహిళలకు పసుపు-కుంకుమ పథకం కింద రూ.పదివేలు ఇస్తే చెల్లని చెక్కులు అంటూ ఎగతాళి చేస్తారు. స్మార్ట్ఫోన్లు ఇస్తామంటే అనుయాయులకే కదా కంట్రాక్టులు ఇచ్చేది? అని మాట్లాడతారు.
అన్నదాతా సుఖీభవ పథకం కింద ఒక్కొక్క రైతుకు 15వేలు (కేంద్ర సాయం 6 వేలతో కలిపి) ఆర్థికసాయం ప్రకటించినా ఇదంతా ప్రజల సొమ్మేకదా! అంటారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు కార్పొరేషన్లు పెట్టినా, కింది కులాల వారికి ఏమిచ్చారు? అని ప్రశ్నిస్తారు. వంచించిన కేంద్రంపై తిరగబడ్డా, ప్రత్యేక హోదాకోసం ఢిల్లీవెళ్ళి ధర్మపోరాట దీక్షచేసినా, నాలుగేళ్ళు ఎందుకు కలిసున్నారని, ‘ప్రభుత్వ సొమ్మును కోట్లల్లో ఖర్చుపెట్టారు’.. అని విమర్శలు చేస్తారు. సీమాంధ్రులను రాక్షసులతో పోల్చినవారికి స్వాగతాలు పలికి మంతనాలు చేస్తారు. సీమాంధ్ర ప్రజలారా.. తస్మాత్ జాగ్రత్త..! ఎన్నికల సమయంలో ఎవరిని నమ్మాలో అని తేల్చుకొనే ముందు ఆచితూచి అడుగువేయాలి.

-పోతుల బాలకోటయ్య 98497 92124