Others

శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు కథ (నాకు నచ్చిన సినిమా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చారిత్రక అంశంతో కూడిన పదహారణాల తెలుగు చిత్రం -శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణుకథ. తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసిన సినిమా. తెలుగువారి శాసనాన్ని ఏకం చేయటానికే అన్నట్టు ఆనాటి కళాకారులు కలిసికట్టుగా పనిచేసి విజయపతాక ఎగురవేశారు ఈ సినిమాతోనే. శంభూఫిలిమ్స్ పతాకంపై నిర్మాత దగ్గుబాటి లక్ష్మీనారాయణ చౌదరి నిర్మిస్తే, ఎకె శేఖర్ దర్శకత్వం వహించారు. చిత్రానికి నిర్మాత నారాయణ చౌదరే స్క్రీన్‌ప్లే అందించటం మరో గొప్ప విషయం. శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు సాక్షిగా సుచంద్రసేన మహారాజు తన రాజ్యాన్ని తెలుగు జాతికి అంకితం చేసిన చందాన్ని ఈ సినిమా ఇతివృత్తంగా ఎంచుకున్నారు. మాటలు-పాటల్ని చమత్కారంగా, శృంగారరస భరితంగా పింగళి నాగేంద్రరావు సమకూరిస్తే, అంతకుమించి సుస్వర సంగీతాన్ని పెండ్యాల అందించటం ఈ చిత్రానికి మరో అదనపు సొబగు. అనాగరికుడైన నాగ నిశుంభుడు వీరుడినన్న గర్వంతో మహారాజు సుచంద్రుడితో సంధికి బదులు వైరంతో మెలగటానికి మంత్రి మహేంద్రజిత్తు కారణం. తాను రాజ్యమేలాలన్న పన్నాగం పన్ని చివరకు నాగనిశుంభుడి చేతిలోనే ఎలా అంతమయ్యాడన్నది మూల కథ. ఇందులో యువరాజు వల్లభదేవుడిగా ఎన్టీ రామారావు, యువరాణి సుజాతగా జమున అద్భుతమైన నటన ప్రదర్శించారు. ఆటవిక చక్రవర్తి నాగ నిశుంభునిగా ఎస్‌వి రంగారావు, నక్కజిత్తుల మహేంద్రజిత్తు మంత్రి పాత్రలో ముదిగొండ లింగమూర్తి తన రంగస్థల నటనా పాటవాన్ని సినీ జగత్తుకు తగిన రీతిగా అందించి రక్తికట్టించారు. నిశుంభ చక్రవర్తి భార్యగా ఛాయాదేవి, లంక రాకుమారుడిగా రేలంగి, గిరిజ వారివారి పాత్రలను తగిన రీతిన పోషించి మెప్పించారు. బలదేవుడిగా బాలయ్య, సుచంద్రుడి మంత్రిగా మిక్కిలినేని, బలదేవుని ప్రియురాలిగా నాట్యమయూరి ఎల్ విజయలక్ష్మి చక్కని నటనతో మెప్పించారు. కలిమి బలిమితోడై ఆంధ్ర మహాసామ్రాజ్యానికి శంకుస్థాపన ఘనంగా జరగటం, దైవసాన్నిధ్యంలో చిత్రం మొదలై అక్కడే శుఖాంతం కావటం ఈ సినిమాలో కొనసాగించిన చక్కని సంప్రదాయం. ఎన్టీఆర్, జమునలపై చిత్రీకరించిన ‘వసంత గాలికి’ పాట మరువలేం. చిత్రంలో మాటలు, పాటలు, సంభాషణలు, సాహిత్యం తెలుగువారి సంస్కారానికి అద్దంపడతాయి. తెలుగుదనం, తెలుగునానుడులు పండిత పామరుల్ని ఆకర్షించేలా దర్శకుడు శేఖర్ చిత్రాన్ని తీర్చిదిద్దారు.
-ఎల్వీ జ్ఞానేంద్ర, రాజమండ్రి