Others

కోరికలు తీర్చే కల్పవల్లి కొల్హాపురి మహాలక్ష్మి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పదునెనిమిది చేతులలో అక్షమాల, గండ్రగొడ్డలి, గద, బాణం, వజ్రాయుధం కమలము, ధనస్సు, కలశము, దండం, శక్తి, ఖడ్గము, డాలు, శంఖము ఘంట, మద్య పాత్ర శూలం, పాశం, సుదఠ్శన చక్రము, ధరించి ప్రవాళమణి వర్ణంతో తామరపూవుపై చిరునవ్వుతో పలకరించే స్ర్తి మూర్తిని మహా లక్ష్మిదేవిగా భావించి పూజిస్తారు. ఈతల్లిని ఓం, శ్రీం హ్రీం ఐం అనే బీజాక్షరము లతో సర్వలోకాలు ఉపాసిస్తాయ. ఈ మహా లక్ష్మీదేవియే కొల్హాపురీకరవీర మాతగా కొలువై సర్వులనూ కాపాడుతోంది.
కొల్హాపూర్‌ను పూర్వం కరవీర్ నగరమని పిలిచేవారు. ఇక్కడ కొలువైన ఈ తల్లిని కరవీరమాత అనేవారు. ఈకొల్హాపూర్ ప్రకృతి అందాలకు నిలయం. అతిపురాతనమైన ఈ నగరం ‘108’ కల్పాలకు పూర్వం నాటిదని పురాణాలు చెబు తున్నాయ. ఈ నగరం గొప్పతనం గురించి కాశీఖండం, పద్మపురాణం, దేవీ భాగవతం, స్కంద, మార్కండేయ పురాణాలలో కనబడు తుంది. పంచగంగానది ఒడ్డున అలరారుతున్న ఈ ప్రాచీన నగరాన్ని కొంకణరాజు కర్ణదేవ, వౌర్యుడు, చాళుక్యుడు, రాష్టక్రూటులు, ఇతర యాదవ రాజులు పాలించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయ. ఇంతకుముందు కాలంలో ఈ కొల్హాపూర్‌ను కొలతాపూర్, కళ్ళ, కోల్‌గిరి, కొలదగిరి పట్టణం అని కూడా అనేవారు. ‘కొళ్ళ’ అంటే వ్యాలీ (లోయ) అని అర్థం. ‘పూర్’ అంటే పట్టణమని అర్థం. అంటే ఈ పట్టణ ప్రాశస్త్యాన్నిబట్టీ కర్‌వీర్ నగరాన్ని కొల్హపూర్‌గా మార్చారని అంటారు.
ఇక్కడ ఉండే ఈ మహాలక్ష్మి ఆలయాన్ని క్రీ.పూ. 4,5 శతాబ్దాల మధ్యకాలంలో కట్టి ఉంటారని చారిత్రిక కథనం. 17వ శతాబ్దంలో చక్రవర్తి శివాజీ, 18వ శతాబ్దంలో శంభాజీ మహారాజులు, ఈ కొల్హాపూర్ క్షేత్రాన్ని పాలించినట్లు శాసనాల వల్ల తెలుస్తుంది. జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారు కూడా ఈ అమ్మను దర్శించి ఇక్కడ మఠాన్ని ఏర్పరిచారు. ప్రధానాలయంలో ఓ ప్రక్క ‘శ్రీచక్రం’ ప్రతిష్టించారట. ఈ మహాలక్ష్మి ఆలయం అద్భుతమైన శిల్పసంపదకు నిలయం.
పురాణ గాథ:
ఒకసారి అగస్త్యుడు లోపాముద్రా దేవి శివుడిని దర్శించారు.ఆ సందర్భంలో శివుడు వారికి కొల్హాపూర్ లోని కరవీర మాతను దర్శంచి ఆమెను పూజించి సకల జనులు కూడా ఆ తల్లి అనుగ్రహాన్ని పొందేటట్లు చేయుమని చెప్పాడట. వారిద్దరూ బయలుదేరి కరవీర పురం వెళ్లారు. అక్కడ ఒక చేతిలో ఖడ్గం, మరో చేతిలో కలశం, మరో చేతిలో పుష్పం, ఇంకో చేతిలో పానపాత్రలతో కిరీటి ధారిణిగా ఉన్న అమ్మకు గొడుగుపడ్తూ ఆదిశేషుడిని చూసి వారు తన్మయులైయ్యారట. అపుడే ఆ తల్లిని వివిధ స్తోత్రాలతో కీర్తించారు. లోపాముద్ర అగస్త్యుల స్తుతికి మెచ్చి మహాలక్ష్మీదేవి ఏదైనా వరం కోరుకోమని అడిగిందట. అపుడు అమ్మా మమ్ములను పరమశివుడు నిన్నుపూజించి సర్వజనులకు నీ అనుగ్రహం కలిగేట్టుగా చేయమని చెప్పాడు. కనుక నీవు శివుని కోరిక తీరేట్టుగా చేయమని వేడుకొన్నారట. వారి మాటలను విని మహాలక్ష్మీదేవి ముదమంది శివుని అభీష్టం ప్రకారం నన్ను దర్శించుకున్న వారికందరి వారి వారి మనోభీష్టాలను తీరుతాయ అని వరం ఇచ్చిందట. దాంతో అగస్త్యుడు, లోపాముద్ర ఎంతో ఆనందపడి అక్కడే కొన్నాళ్లు ఉండి అమ్మను సేవించారట. వారికి ఇచ్చిన మాట ప్రకారమే ఈ కొల్హాపూర్ లోని మహాలక్ష్మీ దేవి ని దర్శించుకొన్న వారికందరికీ వారి వారి మనో భీష్టాలను నెరవేరుతున్నాయని స్థలపురాణం చెబుతుంది. ఈ ఆలయంలోని ప్రథమ భాగం లో అతిబలేశ్వరస్వామి ఆలయం కూడా నెలకొని ఉంది.ఈ ఆలయంలో అతి బలేశ్వరుడు లింగరూపంలో దర్శనమిస్తాడు. ఆలయానికి సమీపంలో శారదామాత, మరో పక్క కాళికామాత మందిరాలున్నా య. వీటికి సమీపంలోనే సూర్యదేవుడు, విఘ్నేశ్వరుడు, శ్రీకృష్ణ భగవాన్‌ల చిన్ని మందిరాలున్నాయి. ప్రధానాలయ ప్రాకారంపై ‘సటువాభాయి’ శిలా ప్రతిమ ఉంది. ఆ తల్లి మహిమ గొప్పదని తమ శిశువులను ‘సటువాభాయి’ మూర్తికి కింద భాగంలో ఉంచి, పూజలు నిర్వహిస్తారు. అలా చేయడంవల్ల తమ పిల్లల భవిష్యత్‌ను బాగుంటుందని ఇక్కడి వారు నమ్ముతారు.
ఆలయానికి ముందు భాగంలో నిత్య అగ్నిహోత్రి గుండం ఉంది. ఇక్కడకు వచ్చిన భక్తులు తమతో తెచ్చిన సుగంధ ద్రవ్యాలను ఈ గుండంలో వేసి, ఆలయంలోకి ప్రవేశించడం ఇక్కడి సంప్రదాయం. ఆలయంలో మరోపక్క ఉమా మహేశ్వరస్వామి, శనీశ్వరుడు, దత్తాత్రేయుడు, గరుడ మండపం, దీప్తస్తంభం, వీరభద్రస్వామి, నాగేంద్రుడు, భైరవుడు కూడా కొలువై ఉన్నారు.
ప్రతిరోజు అమ్మకు కుంకుమార్చనలు, అభిషేకాలు జరుపుతారు. విశేషదినాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వార్షికోత్సవాలు ఫ్రత్యేక పూజలు రథోత్సవాలు జరిపే సమయంలో వివిధ ప్రాంతాల నుంచి జనులు కోకొల్లలుగా ఈ తల్లిని దర్శించడానికి వస్తుంటారు.
ఈ ఆలయం కొల్హాపూర్ పట్టణ నడిబొడ్డున ఉంది. దేశంలోని అనేక ప్రాంతాలనుంచి బస్సులు, రైళ్ళు ఈ పట్టణానికి అందుబాటులో వున్నాయి.

- కె. వాణిప్రభాకరి