Others

పదినిముషాల్లో సంతోషం!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక్కసారిగా గాల్లో తేలిపోయేంత సంతోషం..
ప్రపంచంలోని ఆనందమంతా ముంగిట్లో వాలినంత ఆనందం..
కానీ..
అంతలోని..
ఎక్కడలేని నిరాశ.. నిస్పృహ..
ఇలా ఎందుకు జరుగుతుంది?
ఆ సమయంలో ఏం చేయాలి?
వివరాల్లోకి వెళితే..
మనకు మానసిక సమస్యలేమీ లేకున్నా సరే.. రోజువారీగా ఎదురయ్యే కొన్ని ఒత్తిళ్ల వల్ల మనలో రోజంతా ఉన్న ఆనందం.. క్షణాల్లో ఆవిరైపోతుంది. అప్పటిదాకా మనం చేసిన మంచి పనులు, ఆఫీసులో బాస్ నుంచి అందుకున్న ప్రశంసలు.. అన్నీ మరిచిపోయి చిరాకు మొదలవుతుంది. అయితే అలాంటి ఒత్తిళ్ల నుంచి బయట పడేందుకు శాస్ర్తియంగా అనేక మార్గాలు ఉన్నాయి. మానసిక ప్రశాంతతను ఎలా మెరుగుపరుచుకోవచ్చో.. 20 ఏళ్లనాటి ‘పాజిటివ్ సైకాలజీ’ మనకు ఎన్నో పద్ధతులను సూచించింది. కానీ వాటిని ఆచరణలో పెట్టేందుకు రోజువారీ జీవితంలో సమయం దొరికేదెలా? అన్నదే అసలు సమస్య. దీనికి ఇంగ్లండ్‌లోని యూనివర్శిటీ ఆఫ్ సెంట్రల్ లాంకషైర్‌కి చెందిన అధ్యాపకురాలు శాండీమాన్ ఓ సులువైన పరిష్కారం చూపిస్తోంది. మానసిక వైద్యురాలిగా అనుభవమున్న ఆమె ‘టెన్ మినిట్స్ టు హ్యాపీనెస్’ పేరుతో ఒక పుస్తకం రాసింది. ఈ పుస్తకంలోని సూచనలను రోజూ ఓ పదినిముషాల పాటు చదివితే చాలు.. మీ జీవితం ఆనందంగా సాగిపోతుందని చెబుతున్నారు ఆమె. రోజువారీగా తమకు ఎదురయ్యే ఆరు సానుకూల అంశాలపై దృష్టి పెడితే ఒత్తిడి నుంచి సులువుగా బయటపడొచ్చని సూచిస్తున్నారు.
ఆరు అంశాలు
సంతృప్తి
ఆ రోజు మీకు సంతృప్తినిచ్చిన విషయాలేంటి? మీరు బాగా ఆస్వాదించిన విషయం ఏంటి?
ప్రశంస
ఆ రోజు మీకు వేటి వల్ల ప్రశంసలు లేదా సానుకూల సూచనలు వచ్చాయి?
అదృష్టం
ఆ రోజు మీకు అదృష్టంగా లేదా యోగ్యంగా అనిపించిన సమయం ఏంటి?
విజయాలు
‘నేను బాగా చేశాను’ అనిపించే పని ఏంటి? చిన్నదైనా సరే..
కృతజ్ఞత
ఆ రోజు కృతజ్ఞతా భావాన్ని కలిగించిన అంశమేంటి?
సేవాతత్త్వం
ఆ రోజు మీ సేవాతత్త్వాన్ని ఎలా ప్రదర్శించారు?
మాంచెస్టర్‌లోని తన క్లినిక్‌లో అనేకమందిపై ఈ అంశాలను పరీక్షించగా మంచి ఫలితాలు కనిపించాయని డా. మాన్ చెప్పారు. ‘మీ జేబులో డబ్బులున్నాయి. అదే సమయంలో ఎదుటి వ్యక్తి సహాయం కోసం చూస్తున్నాడు. అప్పుడు మీకు చేతనైనంతలో అతనికి కొంత డబ్బు సాయం చేయండి. అప్పుడు అదే డబ్బును మీ కోసమే ఖర్చు చేసుకున్నప్పుడు వచ్చే ఆనందానికి మించిన ఆనందం వస్తుంది’ అనే విషయం 130 దేశాల్లో నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది. అయితే, ఈ పది నిముషాల పరిశీలన ద్వారా అందరిలోనూ అద్భుతాలు జరిగే అవకాశం ఉండదని, ఎవరైనా తాము మానసికంగా కుంగుబాటుతో బాధపడుతున్నట్లు అనిపిస్తే.. తప్పకుండా వైద్యులను సంప్రదించాలని డా. మాన్ సూచిస్తున్నారు. ప్రతికూల అంశాల గురించి ఆలోచిస్తూ బుర్రను బద్ధలు కొట్టుకోకుండా.. సానుకూల అంశాలపై దృష్టిపెడుతూ, తమను తాము ప్రశంసించుకుంటే.. ప్రశాంతత, సంతోషం ఎప్పుడూ మీ వెంటే ఉంటాయని ఆమె అంటున్నారు. ప్రతికూల ఆలోచనలు మొదలవ్వగానే.. ఈ పుస్తకంలోని విషయాలను ఒక్కసారి గుర్తుచేసుకోండి.. దాంతో క్రమంగా మీలో ఆనందం పెరుగుతుంది. అన్నింటికన్నా, ఆరవ సూత్రం అత్యంత ప్రభావవంతమైనది. స్వార్థం లేకుండా చేసే పనులతో మనకు నలుగురిలో మంచి పేరు రావడంతో పాటు మనలోని సానుకూల భావాన్ని, సంతోషాన్ని కూడా మెరుగుపరుస్తుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది.