Others
వేకువ స్వప్నం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 15 March 2019
-డేగల అనితాసూరి 9247500819
చీకటి కాటుక
కలల కళ్ళను
నిదుర దోసిట్లో పొదువుకుంది!
మెరిసే నక్షత్రాలై
మురిసే ఆశలను
ఊహల వాకిట్లో నిలుపుకుంది!
జ్ఞాపకాల పూలు విరిసి
తపనల తలపులను
తొణికే వధువులతో నింపుకుంది!
మధుర రాగాల
మలయ పవనాలు
ఎదను పరిమళమై అల్లుకుంది!
జావళి పదములు
చల్లిన రవళులు
వెండి మువ్వలై పరుచుకుంది!
ఇంతలో..
తూరుపు కొండపై
పుట్టిన వేకువ
కువకువల మెలకువై నవ్వుకుంది!