Others

అమరజీవి పొట్టి శ్రీరాములు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక వ్యక్తి పుట్టుక కేవలం శరీర సంబంధమైంది. కానీ ఆ వ్యక్తి జటిలమైన ఒక మహోన్నత కార్యక్రమాన్ని చేపట్టి విజయవంతం చేయడమనేది ప్రపంచానికి నివ్వెరపాటును కలిగిస్తుంది. జాతస్య హి ధ్రువో మృత్యుః -పుట్టిన ప్రతివాడు గిట్టక తప్పదు. కాని ఒక వ్యక్తి ఆవిష్కరించే విప్లవాత్మక భావాలు చిరంజీవులు అవుతాయ. అంటే ఆ భావాలకు చావులేదు.
1901 జనవరి 1వతేదీనాడు 20 శతాబ్దం ఆవిర్భవించగా, ఆ తరువాత 2 నెలల 16 రోజులకు 1901 మార్చి 16వ తేదీనాడు శ్రీరాములు జన్మించారు. పొట్టి శ్రీరాములు అతి సాధారణమైన ఆర్య వైశ్య కుటుంబంలో జన్మించారు. తండ్రి గురవయ్య, తల్లి మహాలక్ష్మమ్మ. వీరి ప్రాథమిక విద్య అంతా మదరాసు నగరంలోనే పూర్తిచేశారు.
బొంబాయి విక్టోరియా జూబ్లీ టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్‌లో శానిటరీ ఇంజనీరింగ్ కోర్సు చదువుతూ విద్యార్థిగా వున్న రోజుల్లోనే మొదటిసారి పొట్టి శ్రీరాములు మీద గాంధీజీ ప్రభావం పడింది. ఆ రోజుల్లో స్వాతంత్య్రోద్యమం, గాంధీజీ సాగించిన సత్యాగ్రహోద్యమాలు దేశంలో విద్యార్థి లోకాన్ని ఉర్రూతలూగించాయి.
శ్రీరాములు జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను, కష్టనష్టాలను అనుభవించారు. తల్లిదండ్రులు, భార్య లోకాన్ని విడిచిన తర్వాత తన జీవిత లక్ష్యం అర్థమయింది. కాషాయ వస్త్రాలు స్వీకరించి లాంఛనప్రాయంగా సన్యాసాశ్రమాన్ని స్వీకరించకపోయినా సన్యాస జీవితాన్ని గడిపారు.
గుడిసెలలో జీవించే కోట్లాది మంది సామన్య జనంతో కలిసిమెలసి జీవిస్తూ, వారికి జరుగుతున్న అన్యాయాలను ధైర్యంగా ప్రకటించిన గాంధీజీ వంటి మహాత్ముల కోవకు చెందిన పొట్టి శ్రీరాములు వంటివారికి మానవజాతి తన అభ్యుదయానికి ఋణపడాలి.
ఉప్పు సత్యాగ్రహ యాత్రలో మహాత్మాగాంధీ వెంట వెళ్లిన 79 మంది ప్రియశిష్యులలో పొట్టిశ్రీరాములు ఒకరు. సంపూర్ణ సేవాభావం, దృఢదీక్షగల వ్యక్తి అని శ్రీరాములును మహాత్ముడు అనేక పర్యాయాలు మెచ్చు కున్నారు. తన గురువు బ్రిటీష్ ప్రభుత్వంపట్ల ప్రయోగించిన అస్త్రానే్న ఆ గాంధీ భక్తుడు 1952 అక్టోబర్ 26వ తేదీన భారత ప్రభుత్వంమీద ప్రయోగించారు. తన దృఢవిశ్వాసానికి వ్యతిరేకంగా నిలిచిన శక్తివంతమైన ప్రభుత్వం బలాన్ని పరీక్షించేందుకు పూనుకున్నాడు.
ఈ మహోన్నతుడు సానుకూల పరిస్థితులలో ప్రత్యేక రాష్ట్రాన్ని పొంది భారత జాతీయ ప్రభుత్వ విధానాలకు తలవంచినప్పటికీ- తన ప్రజలందరూ సంతోషంగా తమ తమ సాంస్కృతిక స్వేచ్ఛలను, భాషా రాష్ట్ర స్వపరిపాలనలను అనుభవించాలని తలచారు. ప్రత్యేక భాషా రాష్ట్రాన్ని ఏర్పాటుచేయవలసిందిగా మన జాతీయ నాయకులను ఆయన డిమాండ్ చేశారు. అహింసాత్మకమైన భావాన్ని ఆయన వెల్లడించి, చారిత్రక నిరాహారదీక్షకు పూనుకున్న నిజమైన జాతీయవాది శ్రీరాములు. తన మరణమో లేదా ప్రత్యేకాంధ్ర రాష్ట్ర నిర్మాణమో- రెంటిలో ఏదో ఒకటి జరిగేవరకు కొనసాగే ఒక నిరవధిక నిరాహారదీక్షకు ఆయన ఉపక్రమించారు.
స్వతంత్ర భారతదేశాన్ని పరిపాలించే సంరంభంలో తలమున్కలుగా వున్న నెహ్రూ ఒక గాంధేయుడు ఏమి సాధిస్తాడులే అని తాత్కాలికంగా విస్మరించారు. నిరాహారదీక్ష విరమించమని శ్రీరాములుకు కొన్ని విజ్ఞప్తులు చేశారు.తరువాత ఆ దీక్షను ఉపే
క్షించారు. తెలుగు రాష్ట్ర ఏర్పాటుకు రాజాజీ సుముఖత చూపలేదు. ప్రజలనుంచి, స్థానిక నాయకుల నుంచి, చివరికి పత్రికలవారి నుంచి ఎలాంటి సహకారం లభించకపోవడంతో జీవించి ఉన్నప్పటికంటే ప్రాణాలను అర్పించడం ద్వారా మానవజాతికి మరింత ఎక్కువ సేవ చేయగలను అనే విశ్వాసం ఆయనలో బలపడింది. గాంధేయవాది పొట్టి శ్రీరాములు 1952 అక్టోబర్ 19వ తేదీన ఆంధ్ర రాష్ట్రం కోసం ఆమరణ నిరాహారదీక్షకు పూనుకున్నారు. సాంబమూర్తిగారు మద్దతునిస్తూ తగిన వేదిక దొరక్కపోవడంవలన చెన్నై మైలాపూరులో వున్న తన ఇంటికి ఆహ్వానించి దానినే వేదికగా చేసుకోమన్నారు. స్థలాన్ని ఏర్పాటుచేయడమే కాకుండా సన్నిహిత నిరీక్షణా పర్యవేక్షణలతో, సరైన సలహాలతో శ్రీరాములుగారి దీక్ష నిర్విఘ్నంగా సాగడానికి తోడ్పడ్డారు. ఎప్పటికప్పుడు వైద్యులను అందుబాటులో వుంచి తగిన చర్యలు తీసుకున్నారు. 1952 డిసెంబర్ 15వ తేదీ గం.8.40లకు నిరాహారదీక్ష కొనసాగిస్తున్న శ్రీరాములు నిరాహారదీక్ష ఆరంభించి 58వ రోజున క్షుద్బాధతో స్పృహ కోల్పోయారు. రాత్రి గం.11.20లకు అసువులు బాసారు. అమరజీవి బలిదానం తప్పలేదు.
శ్రీరాములు మరణవార్త బయటికి పొక్కగానే నాటి చెన్నై రాజధానిలో 11 తెలుగు జిల్లాల ప్రజలు ఉలిక్కిపడి సింహగర్జనతో భయంకరమైన తిరుగుబాటు ప్రారంభించారు. తీవ్రమైన ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు ప్రారంభం అయ్యాయి. భారీ ఎత్తున హింసాకాండ చెలరేగింది. 24 గంటలు తిరిగేలోగా నెహ్రూ అతిశ్రద్ధగా నిర్మించుకున్న ‘బలమైన కేంద్రం -నాలుగే ప్రధాన పార్టీలు’ అనే సిద్ధాంతం కుప్పకూలిపోయింది. డిసెంబర్ 18వ తేదీన భారత మంత్రివర్గం ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటుచేస్తూ తీర్మానించింది. 1953లో కర్నూలు రాజధానిగా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది.
ఆంధ్ర నాయకుల దౌర్భల్యాన్ని ఆసరాగా చేసుకుని ఆంధ్రులకి చేసిన తీరని అన్యాయం ఇది. గాంధీజీ ప్రధాన అనుయాయి అయిన పొట్టి శ్రీరాములు మరణానికి కారణమయ్యారు. ఆ సంఘటన తీరని మచ్చగా కలకాలం నిలిచి వుండడం తథ్యం. మానవజాతి ఉద్ధారకులం అని చెప్పుకుంటూ పొట్టి శ్రీరాముల విషయంలోనూ, ఆంధ్రుల విషయంలోనూ చేసిన అన్యాయాన్ని ముందుతరాలవారు క్షమించరానిది.

-దామరాజు నాగలక్ష్మి 99129 40182 nagalakshmidamaraju@gmail.com