Others

సుడిగుండాలు (నాకు నచ్చిన సినిమా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కళలేవైనా వాటి పరమార్థం సమాజహితం, మనోవికాసమే. పాత చిత్రాలను దేన్ని తీసుకున్నా సమాజానికి పనికొచ్చే ఏదోక ఉపదేశం ఉండకుండా ఉండదు. స్వర్ణకాలం నాటి చిత్రాల్లోని వినోదం, వికాసం గురించి మాట్లాడుకున్నపుడు -సుడిగుండాలు చిత్రం ముందువరుసలో ఉండే అర్హతపొందుతుందని నా నమ్మకం. ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు న్యాయమూర్తి. అతని భార్య గతించటంతో, కొడుకు యోగక్షేమాలు నౌకరుల సాయంతో తానే జాగ్రత్తగా చూసుకుంటుంటాడు. మరో పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనే చేయడు. ఒక సందర్భంలో జడ్జి కొడుకు స్నేహితులతో ఆడుకుంటూ ఒక స్నేహితుడి చేతిలో హత్యకు గురవుతాడు. పోలీసుల దర్యాప్తులో నిందితుడు పట్టుబడతాడు. తన కొడుకును వాడి స్నేహితులే చంపారా? ఏమిటి ఈ దారుణ సంఘటనకు కారణం? అంతా 15ఏళ్లలోపు పిల్లలే! ఎంతో స్నేహంగా ఉండేవారే. ఇలా అందరూ కలిసి హంతకుడికి ఎందుకు సాయపడ్డారని మరో కోణంలో ఆలోచిస్తాడు జడ్జి.
చివరకు విచారణలో ఆ విద్యార్థులకు డిటెక్టివ్ నవలలు చదవడం అలవాటుందని తెలుస్తుంది. కథల్లో ‘హత్యలు’ ఎలా చేయవచ్చో ప్రయోగాత్మకంగా చేసి తెల్సుకోవాలన్న ఉత్సుకతతో -జడ్జి కొడుకును పార్కుకు తీసుకెళ్లి గొంతునులిమి చంపేసి, ‘స్విమ్మింగ్ పూల్’లో పడేసి గప్‌చుప్‌గా ఇంటికెళ్తారు. ఇదంతా డిటెక్టివ్ నవల్లో హత్యోదంతాలు నడిపించిన వైనం. ఆ ప్రభావం ఆ పసివాళ్లపై పడి హత్యకు పాల్పడ్డారు. సుదీర్ఘ విచారణ అనంతరం హంతకునికి ఉరిశిక్ష వేయాల్సివస్తుంది. ఆ సమయంలో జడ్జి -నేరం హంతకుడైన పిల్లాడిది కాదన్న వాదనకు తెరలేపుతాడు. పిల్లలపై చెడు ప్రభావం చూపిన డిటెక్టివ్ నవలలదనీ, వాటిని పిల్లలకు అందుబాటులో ఉంచిన తల్లిదండ్రుల తప్పుగా న్యాయమూర్తిగా మనసునుంచి తీర్పునిస్తాడు. ఆ పిల్లవాడిని శిక్షనుంచి తప్పిస్తాడు. మానవత్వాన్ని ప్రదర్శించి, సమాజహితానికి నిలువెత్తు సాక్షిగా నిలుస్తాడు. ఎంత గొప్ప ఉదాత్త చిత్రమో. క్లైమాక్స్ సన్నివేశాలు మనసున్న మనిషి గుండెను పిండేస్తాయ. ఇలాంటి సినిమాలెక్కడ ఇప్పుడు? అంతా అసభ్యం, హింస తారాస్థాయిలో చూపి, ఆబాల వృద్ధులను నేరాలవైపు మళ్ళించే నేటి సినిమాలు -‘సుడిగుండాలు’కు దిష్టి తీయడానికి కూడా పనికిరావు.
అశ్లీలతా ప్రతిఘటన వేదికవంటి సంస్థలు చెడు అనవద్దు- వినవద్దు- కనవద్దు మాత్రమేగాక చెడును ప్రతిఘటించమంటాయి. సెన్సార్‌బోర్డు కీలుబొమ్మగా, దిష్టిబొమ్మగా మాత్రమే వేలాడుతుంది. సామాజికంగా, సాంస్కృతికంగా తీవ్ర నష్టం కలిగించే వస్తధ్రారణ, హింసను సినిమాల్లో నిరోధించలేకపోతోంది. ఇది ఎప్పటికైనా ప్రమాదమేనని విజ్ఞులు గ్రహించాలి.

-ఎల్ రాజేశ్వరి, పి గన్నవరం