Others

త్రిగుణాత్మక స్వరూపిణి మహాలక్ష్మి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దక్షిణ కాశిగా, హరిహర క్షేత్రంగా, నవ నారసింహ క్షేత్రాలలో నొకటిగా, ప్రధానంగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వర త్రైమూర్త్య స్థిత మహిమాన్విత నిలయంగా, సర్వదేవతామయమై, వివిధ దేవాలయాల సముదాయంతో విరాజిల్లుతున్న ధర్మపురి క్షేత్రంలో గోదావరి నదీ తీరాన ఆదిశక్తి, జగన్మాత, త్రిగుణాత్మక స్వరూపిణియైన శ్రీమహాలక్ష్మీ దేవి ఆలయం వెలసి ఉంది. అఖండ మహిమాన్వితులైన గుండోభావ మహాత్ముల ప్రియ శిష్యులైన శ్రీబాల సరస్వతీ శ్రోతులు క్రీ.శ.1750-51 సంవత్సరంలో చైత్ర బహుళ పంచమి పర్వదినాన ధర్మపురి క్షేత్రానికి ఆగ్నేయ దిశలో, పవిత్ర గోదావరి తీరాన, అలనాటి ఆవాస ప్రాంతానికి కొద్ది దూరాన ప్రశాంత వాతావరణంలో, సృష్టి, స్థితి, లయకారిణియైన శ్రీమహాలక్ష్మీ దేవి విగ్రహ ప్రతిష్ఠ గావించి, శ్రీకౌశికి (నాయికమ్మ), నవ శక్తులను ప్రతిష్ఠింప జేయడం జరిగింది. గ్రామ, లోక, సర్వజన రక్షణ హేతువై అలరారుతున్న ఈఆలయంలో 1956వ సంవత్సరంలో మాఘ బహుళ దశమి రోజున శంఖ, చక్ర, గద, అభయహస్త సమన్వితమయైన సుందర పాలరాతి విగ్రహాన్ని, పాత దారు (కర్ర) విగ్రహ స్థానే ప్రతిష్ఠించడం జరిగింది. భారత దేశంలోనే అరుదైన సుందర వదనారవింద శోభితయైన జగన్మాత, గోదావరి తీరాన భక్తుల పాలిట కల్పవృక్షమై, కోరిన కోర్కెలను తీర్చగలదని భక్తుల అచంచల విశ్వాసం.
చైత్ర బహుళ పంచమి రోజున ప్రాచీన కాలంనుండి ఎడ్లబండ్ల తీర్థములు, రథోత్సవం, ఆషాఢ, శ్రావణ మాసాలలో విశేష పూజాదులను నిర్వహించబడుతూ, అశేష జన కుల, ఇల దైవమై విరాజిల్లు తున్నది. జగన్మాత లక్ష్మీదేవి పాలరాతి విగ్రహ స్థాపన జరిగి 2007 ఫిబ్రవరి 12 సోమవారం మాఘ బహుళ దశమికి యాభై సంవత్సరములు పూర్తయిన సందర్భంలో, జయంతి సర్ణోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది. మహిమాన్వితయైన ఈ ఆలయంలో ఇటీవలే శతచండీ సహిత శ్రీమహాలక్ష్మీ శ్రీగణపతి, శ్రీసరస్వతీ దేవతల విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలను నిర్వహించారు అపుడు స్తోత్ర పారాయణాలు, పూజలు, హోమాది కార్యక్రమాలు నిర్విఘ్నంగా ఇక్కడ జరుగుతాయ.
ఈ ఆలయంలో సువాసినులచే సామూహిక లక్ష్మీపూజ, కుంకుమార్చన, లలితా పారాయణం, ఆయురారోగ్య ఐశ్యర్యములను, సువాసినులకు ఐదవతనాన్ని ఒసంగుతూ, ఆర్థిక ఇబ్బందులను, మానసిక వ్యాధులను తొలగించి, అభీష్ట వరములను, ఆశ్రీతుల వృత్తి, వ్యాపార, ఉద్యోగాది అభివృద్ధికై అమ్మవారి సన్నిధిన ప్రత్యేక పూజాదులలో పాల్గొంటున్న భక్తుల సంఖ్య నానాటికీ అధికం అవుతున్నది.

-సంగనభట్ల రామకిష్టయ్య 9440595494